Posts

Showing posts from April, 2021

Muslim programme to confront the ‘Neo Manuism’

  Muslim programme to confront the ‘Neo Manuism’ నయా మనువాదాన్ని ఎదుర్కోవడానికి ముస్లిం కార్యక్రమం   -        డానీ   1.             మనదేశంలో నయా మనువాద నియంతృత్వం రాజ్యం చేస్తున్నదని ఇప్పుడు ఎక్కువ మంది గుర్తిస్తున్నారు . దేశవ్యాప్తంగా అనేకానేక నిస్సహాయ (vulnerable) సమూహాలు చాలాకాలంగా దీని ఉక్కుపాదాల కింద నలిగిపోతున్నాయి .   2.             సాంస్కృతిక జాతీయవాదానికి తొలి బాధితులు మతఅల్పసంఖ్యాకవర్గాలు . ఆ బాధితుల్లోకెల్లా బాధితులు ముస్లింలు .   3.             స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో భారత రాజకీయార్థికరంగాల్లో భౌగోళిక జాతీయవాదం బలంగానూ సాంస్కృతిక జాతీయవాదం బలహీనంగానూ వుండేవి . కులమతాలు పౌరుల వ్యక్తిగత (ప్రైవేటు) వ్యవహారంగా వుండేవి .   4.             దేశప్రజలకు లౌకిక రాజ్యాంగం ఒక కొత్త మార్గదర్శిగా నిలిచేది . విద్యా ఉపాధి అధికార రంగాల్లో తగిన ప్రాతినిథ్యం దక్కని సమూహాలు ఎన్నికల ప్రక్రియ ద్వార ప్రభుత్వాల మీద రాజకీయ వత్తిడి తెచ్చి తమ కోసం ఉద్దీపనచర్యల్ని సాధించుకోవడానికి  అవకాశాలు వుండేవి .   5.             వామపక్షాలు , నక్సలైట్ ఉద్యమాల ప్రభావం కారణంగా ప్రధాన స్