Posts

Showing posts from August, 2019

సభలు ప్లాన్ చేయాలి. తేదీలను చర్చించి నిర్ణయించండి.

మిత్రులారా! నా ఆరోగ్యం ఇంకా కుదుట పడలేదు. నిన్నటి నుండి కొద్దిగా  సెమీ సాలిడ్ డైట్ తీసుకుంటున్నాను. చాలా నీరసంగా వుంది. కశ్మీర్ సమస్య మీద మాట్లాడడానికి అనేక మంది పిలుస్తున్నారు. నేను చాలా నిస్సత్తువతో వున్నాను. ఐదు రోజుల క్రితం ధైర్యం చేసి ఒక టివీ కార్యక్రమానికి వెళ్ళాను. ఆ తరువాత  జబ్బు తిరగబడింది.  ప్రాణవాయువు సరిపోక చాలా ఇబ్బందిగా వుంటోంది. మంగళగిరి సభకు వెళ్లలేదు. చాలా బాధగా అనిపించింది. రేపు ఆదివారం హైదరాబాద్ సభకు వస్తానని మాటిచ్చాను. అప్పటికి కోలుకుంటానని నమ్ముతున్నాను. సోమవారం  ఫుల్ బాడీ చెకప్ చేయించాను. ఒక శుభవార్త ఏమంటే నా శరీరంలో లంగ్స్ (COPD), ప్రాంకియాసిస్ (డయాబెటిక్) తప్ప మిగిలిన అన్ని అవయవాలు పూర్తి ఆరోగ్యంతో వున్నాయట. సెప్టెంబరు 8 విజయవాడ సభ చాలా ప్రతిష్టాత్మకమైనది. అందులో నేను ఒక్కడ్నే  వక్తను. తమ్మినేని వీరభద్రంగారు అధ్యక్షులు. విమలక్క, గోరటి వెంకన్న గాయకులు. ప్రస్తుతం నేను దానికి సిధ్ధం అవుతున్నాను. హైదరాబాద్, ఖమ్మం, అనంతపురం, తూర్పు గోదావరి, విశాఖపట్నంలలో మనం సభలు ప్లాన్ చేయాలి. తేదీలను చర్చించి నిర్ణయించండి. విజయవాడ సభ తరువాత కడప వెళదామనుకుంటున్నాను. మ

Subject : సంస్థాగత క్రమశిక్షణ

హైదరాబాద్ 3 ఆగస్టు 2019 అస్సలామ్ అలైకుమ్, MTF గ్రూపులోని మిత్రులందరికీ, Subject : సంస్థాగత క్రమశిక్షణ వివిధ అంశాలపై  MTF  అవగాహన మీద గానీ, MTF  చేపడుతున్న కార్యక్రమాల మీద గానీ. MTF సంస్థాగత నిర్మాణం మీదగాని మీలో కొందరికి అభ్యంతరాలు,  అసమ్మతి వుండవచ్చు. భిన్నాభిప్రాయాల్ని MTF  స్వాగతిస్తుంది. మనది ప్రజాస్వామిక సంస్థ. మీ అభిప్రాయాలు, సూచనలు, అసమ్మతులు తెలపడానికి, మీ ప్రజాస్వామిక హక్కుల్ని ప్రయోగించడానికి  కార్యవర్గ సమావేశాల్ని, సర్వసభ్యసమావేశాల్ని వినియోగించుకోండి. ప్రజాస్వామిక హక్కుకు కూడ ఒక పరిమితి వుంటుంది. కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే వరకే ఎవరికయినా  తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అవకాశం వుంటుంది. ఒక నిర్ణయం జరిగాక దాన్ని మెజారిటీ సభ్యులేగాక మైనారిటీ సభ్యులు సహితం ఆమోదించి ఆచరించాల్సి వుంటుంది. కార్యవర్గ సమావేశం చేసిన నిర్ణయాలను సహితం తిరగదోడే అవకాశం సభ్యులకు వుంటుంది. కానీ, ఆ పనిని మరో కార్యవర్గ సమావేశంలో మాత్రమే  చేయాల్సి వుంటుంది.  ఈలోపు, సంస్థ కార్యకలాపాల మీద సోషల్ మీడియాలోగానీ, ఇతర బహిరంగ  వేదికల మీదగాని వ్యతిరేక వ్యాఖ్యానాలు చేసే హక్కు ఎవరికీ లేదు. అలాంటి

సంస్థకు చెడ్డపేరు తేవద్దు

హైదరాబాద్ 2 ఆగస్టు 2019 మిత్రులారా ! అస్సలాం అలైకుమ్ ! విషయం - సంస్థకు చెడ్డపేరు తేవద్దు మన గ్రూపులో కొందరు వున్నారు.   వారెన్నడూ MTF   కోసం సమయాన్ని వెచ్చించిందీ లేదు. సంస్థ కోసం పని చేసిందీలేదు. కానీ ఇతరుల దగ్గర సంస్థ విధానాలనూ, సంస్థ   బాధ్యుల ఇమేజ్ ను నైతికంగా దెబ్బ తీసే ప్రయత్నాలు చేస్తున్నారు.   MTF   మేధో సరోవరంగా వుంటూ క్షేత్ర స్థాయిలో   పనిచేయడానికి కొన్ని సంఘాలను ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని కూడ కొందరు సంఘం బయట విమర్శిస్తున్నట్టు   నా దృష్టికి వచ్చింది. విధాన నిర్ణయాలు చేసే సమయంలో చర్చించే అవకాశం అందరికీ వుంటుంది. నిర్ణయం తీసుకున్నాక దానికి వ్యతిరేకంగా బయట మాట్లాడడం క్రమశిక్షణా రాహిత్యం అవుతుంది. అలాంటి వాళ్ళను ఉపేక్షించ కూడదు. నేను సాధారణంగా ఎవరినైనా రెండుసార్లు తప్పుల్ని మన్నిస్తాను. సరిదిద్దుకోమంటాను. మూడోసారి అలా మన్నించను. క్రమశిక్షణ   తెలికైపోకూడదు.   ప్రధాన స్రవంతి మీడియా ప్రధాన స్రవంతి సేవలకే పరిమితం అయిపోయాక సామాన్యుల భావాలను సహితం ప్రసారం చేయడానికి   సోషల్ మీడియా పుట్టింది. అయితే, సోషల్ మీడియా తెచ్చిన చెడు కూడా వుంది. బాధ్యతా రహితంగా నో

July 2019 Contributions & Expenses

July 2019 Contributions & Expenses Contribution After 15 June Executive Body Meeting 1.    Kalida Parwin Baji (for 10 Months)                       Rs. 5000 2.    Umar Farooq Khan                 Rs. 1000 (For June & July) 3.    Hasan Sharief - July                Rs. 500 4.    Jaha Ara – July                        Rs. 500 5.    Hussen Shake – July               Rs. 500 6.    Dr. Atavur Rahman               Rs. 5000 Total                                    Rs. 12,500 Expenses After 15 June Executive Body Meeting 1.    July 10 Vijayawada, Girish Karnad Meeting                   Rs. 1000 2.    July 17 Amrabad, Uranium Exploration                           Rs. 500 3.    July 28 Ongole Ongole, Samajika Parivarthana Kendram          Rs. 500 4.    July 29 Vijayawada, Muslim Sankalpa Sabha MTF contribution                                                Rs. 5000 Danny Expenses 7 days.                                     Rs