Posts

Showing posts from January, 2019

Fight against communal forces and support UPA and allied parties

Fight against communal forces and support UPA and allied parties హైదరాబాద్ 25 జనవరి 2019 మిత్రులారా ! వచ్చే జమిలి ఎన్నికల్లో నరేంద్ర మోదీ - అమిత్ షా , ఎన్డీయే కూటమి , సంఘపరివారం , ఆడానీ - అంబానీలతో కూడిన మతతత్వ   కేంద్ర ప్రభుత్వాన్ని ఓడించడం దేశంలోని ప్రజాస్వామికవాదులు , ఉదారవాదులు , మతసామరస్యవాదులు , సామ్యవాదులు , సౌమ్యవాదులు , మానవ హక్కులు- పౌరహక్కుల వాదుల ప్రధాన కర్తవ్యం . సరిగ్గా ఇదే లక్ష్యంతో ఈ కర్తవ్య నిర్వహణ కోసం ఏకం అవుతున్న రాజకీయ పక్షాలను ( ఈ కూటమి పేరు ఇప్పుడు యూపిఏ కావచ్చు రేపు ప్రజాకూటమి కావచ్చు లేదా మరొకటిగా మారవచ్చు ) సమర్ధించడం ద్వారానే మనం మన చారిత్రక కర్తవ్యాన్ని నిర్వర్తించగలం .   ఈ శిబిరాల్లో ఏఏ పార్టీలున్నాయి , వాటితో మన వ్యక్తిగత empirical అనుభవాలు ఏమీటీ అనేది ఇప్పుడు అంతగా పట్టించుకోవాల్సిన అంశాలుకావు . వాటిల్లో కొన్ని పార్టీలతో వ్యక్తిగత empirical అనుభవాలు మనల్ని బాధించి, వేధించి కూడా వుండవచ్చు. వ్యక్తిగత empirical అనుభవాలను మాత్రమే ప్రధానంగా భావించేవాళ్ళు ఎన్నడూ ప్రధాన

BC-E Vs EBC

BC-E Vs EBC ముస్లిం సమాజంలో కులాలు లేవని మనం గొప్పగా అనుకున్నప్పటికీ రిజర్వేషన్లు అనేవి భారత రాజ్యాంగం ప్రకారం కుల ప్రాతిపదిక మీద మాత్రమే కల్పిస్తారు. దీనినే సాంస్కృతిక అణివేత అంటారు. ముస్లిం సమాజంలో సాంస్కృతిక వివక్ష వుందనే నిర్ధారణ మీదనే BC-E  ఏర్పడిందనేది ముందుగా మనం గమనించాలి. ఇదొక కీలమైన చట్ట సంబంధ వ్యవహారం. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతంవున్న ముస్లిం రిజర్వేషన్లలో  సయ్యద్, పఠాన్, మీర్జా, బేగ్ తదితర 'కులాలకు' మినహాయింపు నిచ్చారు. వాళ్లను చట్టం ముస్లిం సమాజంలో అగ్రకులాలుగా పరిగణించింది. మిగిలిన 14 +2  కులాలను BC జాబితాలో చేర్చారు.  ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అగ్రకుల  పేదలకు EBCగా గుర్తించి రిజర్వేషన్ కల్పించింది. .  చట్టంలో మత ప్రస్తావన తెచ్చారో లేదో నాకు తెలీదు. తేకపోతే మాత్రం  బహుశ ముస్లిం 'అగ్రకులాలు' కూడా దీనివల్ల లబ్దిపొందవచ్చు. ఇందులో అంతర్గత చిక్కులు కొన్ని వున్నాయి. చట్తం మీద అవగాహన లేకపోవడంవల్ల కొంత, వ్యక్తిగత స్వార్ధాలవల్ల కొంత,  ముస్లిం సమాజం ఈ రిజర్వేషన్ల మూలంగా ఒకవైపు లబ్దిపొందుతూనే మరోవైపు అంతర్గత తగవుల్లో ఇబ్బందులు పడుతోంది. ఆ వివరాలు ఇం