Posts

Showing posts from July, 2017

Meetings and Two Duties

సభలు - రెండు బాధ్యతలు  మిత్రులారా! సంస్థ నిర్వహించే సభలు, సమావేశాలకు హాజరుకావడం సభ్యులందరి బాధ్యత. సభలూ సమావేశాలవల్ల రెండు ప్రయోజనాలుంటాయి. మొదటిది; మన సంస్థ లక్ష్యాలు కార్యక్రమాల గురించి  స్వీయ సమాజానికేకాక బయటి ప్రపంచానికి కూడా తెలుస్తుంది.  రెండోది; సమావేశాల్లో జరిగే చర్చల ద్వార సభ్యుల అవగాహన స్థాయి పెరుగుతుంది.  అందువల్ల, సభలూ, సమావేశాలకు హాజరుకావడం సభ్యులందరి ప్రత్యక్ష బాధ్యత.  సభ్యులు నిర్వర్తించాల్సిన పరోక్ష బాధ్యత కూడా వుంది. సెలవు దొరక్కో, అదేరోజు మరో ముఖ్యమైన పని వుండో, ఆరోగ్యం బాగోలేకో  కొందరు సభ్యులు కొన్ని సభలు, సమావేశాలకు హాజరు కాలేకపోవచ్చు. అలాంటివాళ్ళు ఒక పని చేయవచ్చు.  సభలు, సమావేశాలకు  వెళ్ళాలనే ఆసక్తి వుండి డబ్బులు లేక వెళ్లలేకపోతున్న వాళ్ళని మీమీ జిల్లాలో గుర్తించండి. వాళ్లకు టిక్కెట్టు డబ్బులు ఇచ్చి సభలు, సమావేశాలకు పంపించండి. 1980వ దశకంలో నక్సలైటు ఉద్యమంలో ఇలాంటి సాంప్రదాయం వుండేది. నిరుద్యోగులు, పేదవాళ్ళ ప్రయాణ ఖర్చులను ఉద్యోగులు, స్థితిమంతులు పెట్టుకునేవారు. నిజానికి ఇది ఇస్లాం సాంప్రదాయమే. రంజాన్ నెలలో ఉపవాసం వుండలేకపోతే మరొకరికి ఉపవాస ఏర్పాట్లు చేయాలనే న

MTF Vijayawada Round Table Conference 23 July 2017

MTF Vijayawada Round Table Conference 23 July 2017 ముస్లిం ఆలోచనాపరుల వేదిక  విజయవాడ సదస్సు సందర్భంగా వచ్చిన సూచనలు - 1. డానీ - హిందూ ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికి ప్రజల్లో ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టే విధంగా  కేంద్ర ప్రభుత్వం ఒక కపట నీతితో వ్యవహరిస్తున్నది. - సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (LPG) పధ్ధతుల్లో  కార్పొరేట్లకు ఊడిగం చేయడం ప్రభుత్వ లక్ష్యంగా వుంది. - ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చడానికి ప్రజల దృష్టిని మళ్ళించడానికి అది తరచూ ముస్లింలను వివాదంలోనికి లాగుతోంది. - ట్రిపుల్ తలాఖ్ పేరుతో కొన్నాళ్ళు, బీఫ్ బ్యాన్ పేరుతో కొన్నాళ్ళు ముస్లిం సమాజం మీద అనైతిక దాడులు చేస్తున్నది. - ముస్లింల మీద సాగుతున్న మూక దాడులు, హత్యల మీద సభ్యసమాజం స్పందించాల్సినంతగా స్పందించడంలేదు. - ఇలాంటి నేపథ్యంలో తమ జీవికను కాపాడుకోవడం ముస్లింలకు ప్రాధమిక సమస్యగా మారింది. - బీజేపికి హిందూత్వ అనేది ప్రత్యక్ష సాధనంగా వుంటే,  తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో వున్న టిడిపి, టీఆర్ ఎస్‍ లకు, ప్రతిపక్షాలయిన వైయస్సార్ సిపీ, కాంగ్రెస్‍ లకు  హిందూత్వ అనేది పరోక్ష సాధనంగా వుంది. - బీజేపి అమతవాద కాంగ్రెస్ అయితే, కా

Vijayawada Declaration

Vijayawada Declaration విజయవాడ ప్రకటన అన్ని కాలాల్లోనూ ముస్లింల మీద  ఆర్ధిక, సాంస్కృతిక, భౌతిక దాడులు సాగుతున్నాయి. బీజేపి అధికారంలో వున్న కాలంలో ఈ దాడులు వుధృతం అవుతున్నాయి. ముస్లింల మనుగడ, అస్థిత్వం అనేది వర్తమాన సమాజంలో  ప్రధానంగా రాజకీయ సమస్య. ఈ వాస్తవాన్ని గుర్తించిన తరువాత,   రాజకీయ అధికారం వస్తేనే ముస్లింల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆలోచనాపరులు చెప్పి ఊరుకుంటే సరిపోదు.  దానికి అవసరమైన రాజకీయ ప్రక్రియను సూచించడమేగాక దాన్ని చేపట్టాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో టిడిపి, టీఆర్ఎస్‍, వైయస్సార్ సిపీ లు బీజేపీ కూటమిలో సభ్యులే. బీజేపి కూటమిని గద్దె దించాలంటే  బీజేపి వ్యతిరేక కూటమిని బలపరచాలి. బీజేపి వ్యతిరేక కూటమి  ముస్లింలకు పూర్తిగా అనుకూలమైనది ఏమీ కాకపోవచ్చు.  అయితే, శత్రువుకు శత్రువు మిత్రుడనే విధానాన్ని పాటించాలి. జాతీయ రాజకీయాల్లో బీజేపి కూటమికి గట్టిపోటీ ఇవ్వగల కూటమిని గుర్తించాలి. దాన్ని బలపరచాలు. ముస్లిం ఆలోచనాపరులు ఆ ప్రక్రియను తక్షణం ఆరభించాలి. జాతీయ రాజకీయాల్లో బీజేపి కూటమికి గట్టిపోటీ ఇవ్వగల కూటమిని గుర్తించాలి. దాన్ని బలపరచాలి. ముస్లిం ఆలోచనాపరులు తక్షణం ఆ ప్రక

Udugula Zareena

Udugula Zareena  AM Khan Yazdani 29 -07-2017 గత వారం జరిగిన పరిణామాల్లో Udugula Zareena మన group నుండి తప్పుకోవడం ఒకటి. ఇది కొంచెం  బాధతోపాటూ కొంచెం ఆశ్చర్యమూ కలిగించింది. స్కైబాబా వెళ్ళిపోయినపుడు ఆయన కుటుంబ సభ్యులు కూడా వెళిపోతారని నేను సహజంగానే  అనుకున్నాను. Udugula Zareena మనతో కొనసాగడం  ఆనందాన్నిచ్చింది. సభ్యుల్లో  శక్తి - ఆసక్తి వున్నవాళ్లను గుర్తించి  నాయకత్వంలో భాగస్వామ్యం కల్పించే ప్రక్రియను నేను నిత్యం కొనసాగిస్తుంటాను. అందులో భాగంగానే అనేక మందిని co-convener గా వుండమని కోరాను.  కొందరు ఆమోదించారు. కొందరు అంతటి బాధ్యతను స్వీకరించలేమన్నారు. అలా అన్నవాళ్లలో Udugula Zareena ఒకరు. "Thank you so much sir నన్ను అడిగినందుకు.. నేను ఇస్లాం కి ఎప్పుడు వ్యతిరేకిని కాదు, నా కమ్యూనిటీ అంటే నాకు చాలా గౌరవం, కానీ నేను అంత పెద్ద బాధ్యతను ఇప్పుడు మోయలేను, ఇప్పుడిప్పుడు జస్ట్ మీలాంటి పెద్దవాళ్ళును చూసి అడుగులేయడం నేర్చుకుంటున్నాను..నేను మంచి వక్తను కూడా కాదు, నాకు గ్రిప్ n కమాండింగ్ కూడా లేదు, plz don't mind sir, i will do definitely in future" అని వారు వివరణ ఇచ్చారు. తరువాత

Vijayawada Declaration

MTF Vijayawada Declaration 23 rd July 2017 " ముస్లింల మీద దాడుల్ని ఖండించండి " ముస్లిం ఆలోచనాపరుల వేదిక దేశంలో ముస్లింలు , దలితుల మీద సాగుతున్న మూక దాడుల్ని ప్రజాస్వామిక వాదులు అందరూ   ముక్తకంఠంతో ఖండించాలని ముస్లీం ఆలొచనాపరుల వేదిక విజయవాడలో ఆదివారం నిర్వహించిన సదస్సు కోరింది .  వేదిక కన్వీనర్ ప్రముఖ రచయిత   డానీ అధ్యక్షతన   జరిగిన సదస్సులో ప్రొఫెసర్ అబ్దుల్ నూర్ బాషా , రిటైర్డ్ ప్రొఫెసర్ అమంచెర్ల సుబ్రహ్మణ్యం , గీటురాయి సంపాదకులు అబ్దుల్ వాహెద్ , అడ్వకేట్ జహా ఆరా ,  దళిత నేత బి . పరంజ్యోతి తదితరులు ప్రసంగించారు . కేంద్ర ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని వారన్నారు . తమ తప్పిదాల నుండి    దృష్టిని మళ్ళించడానికి ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నదని వారన్నారు . గోరక్షణ దళాల పేరుతో   కొన్ని అరాచకశక్తులు ముస్లింలు , దళితులపై దాడులు చేస్తున్నాయని వక్తలు ఆరోపించారు . కేంద్ర ప్రభుత్వ విధానాలవల్ల నష్టపోతున్నవారందరూ ఏకం కావాలని వారు కోరారు .    ఆగస్టు 6 న   హిందూపురంలోనూ , 13 న స