Posts

SKY Baba interview - Srinivas Jilukara HBT

 HBT guest editor గా Srinivas Jilukara 1 April 2021 ముస్లింవాద సాహిత్యకారుడిగా, ముస్లిం సామాజిక పరిస్థితిపై స్కైబాబ ఆలోచనలను పంచుకునే ఇంటర్వ్యూ🌱 * ముస్లిం సామాజిక ఉద్యమం చేయకపోతే ముస్లింలలో సగం చీకటిలోనే ఉండిపోతారు. * దునియా ప్రాధాన్యం గురించి మాట్లాడడం నేడు అత్యంత అవసరం. * కొన్ని జమాత్ లు ముస్లింలను సామాజికంగా నిర్వీర్యులను చేస్తున్నాయి. * MIM ని వెనుకేసుకు రాలేం, కానీ ఆ పార్టీ ఇప్పుడు అనేక కోణాల్ని చర్చకు పెడుతున్నది. * TRS కి BJP యేతర ఆల్టర్నేటివ్ ఏర్పడేలా చూడడమే అవసరం. * దర్గా - పీర్ల పండుగ సంస్కృతుల్ని కాపాడుకోవాలి. బహుళ సంస్కృతులే మేలు. * హర్యాలీ లైవ్ సిరీస్ కొత్త ఆవిష్కరణలు చేసింది. * బహుజన సాహిత్య కారులు కొత్త మానిఫెస్టో తో ఒక రచయితల సంఘం ఏర్పాటు చేసుకోవాలి. * జల్ జలా సంకలనం నుంచే ముస్లింవాదం అనే పేరు స్థిరపడింది. * ముస్లింవాదం దేశంలోనే ఒక విశేషం. * ఫ్రెండ్స్! స్పందిస్తే ముస్లిం సమాజానికి ఒకింత మేలు ☘️ Hyderabad Book Trust teSmpMarcohsf 31fdgns atom s1r0:lrlni15o SPerScadiM  ·  Skybaaba : యూసుఫ్ బాబ షేక్  కవిగా రచయితగా కార్యకర్తగా పాతికేళ్లుగా స్కైబాబ తెలుగు...

Thanks to All - ధన్యవాదాలు

  ధన్యవాదాలు     కరోనా తరువాత ముస్లిం ఆలోచనాపరుల వేదిక విజయవాడలో తలపెట్టిన తొలి సమావేశం సంతృప్తిని ఇచ్చింది. వ్యవధి తక్కువగా వున్నప్పటికీ చాలామంది సానుకూలంగా స్పందించారు. ఒక సామాజిక సమస్య మీద ముస్లిం సమాజం స్పందించడాన్ని అందరూ అభినందించారు.   ఇఫ్తార్ విందుల్లో సామాజిక అవగాహనను అభివృధ్ధిచేయడానికి కృషి చేయాలని ఒక అర్ధవంతమైన పిలుపును ఈ సమావేశం ఇచ్చింది.   సమావేశంలో పాల్గొని జయప్రదం చేసిన IFTU   జాతీయ అధ్యక్షులు పి ప్రసాద్, ప్రజాసాహితి నేత దివి కుమార్, మూవ్ మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ నేత కేఎంఏ సుభాన్, విరసం నేతలు అరసవిల్లి కృష్ణ, రివేర ప్రజా నాట్యమండలి నేత పిచ్చయ్య, IAPL నాయకులు పిచ్చుక శ్రీనివాస్, సమాజ పరిశీలకులు సి వెంకట్రావ్, సామాజిక పరివర్తన కేంద్రం నేత వున్నవ వినయ్ కుమార్, కార్మిక నేత కోయ వెంకటేశ్వర్లు, పిడిఎస్ యు రాష్ట్రనాయకులు   రామకృష్ణ, రవిచంద్ర, MTF నేతలు డాక్టర్ అతావుర్ రహమాన్, షేక్ మునీర్ అహ్మద్, అడ్వకేట్ ఖలీలుల్లా,   ప్రెస్ క్లబ్ సిబ్బందికి ఇంకా ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ సమావేశ ...

Improve social awareness at Iftar dinners - MTF

  ఇఫ్తార్ విందుల్లో సామాజిక అవగాహనను పెంచండి   ‘ఇఫ్తార్ విందుల్లో ప్రైవేటీకరణ, రిజర్వేషన్లు, రైతుల ఆందోళన మీద అవగాహనను పెంచండి’ ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF) పిలుపు.   విజయవాడ ప్రెస్ క్లబ్ లో మార్చ్ 28 ఆదివారం సాయంత్రం ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF) ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టెబుల్ సమావేశం ఈ మేరకు ఒక తీర్మానం చేసింది. ఏప్రిల్ 14 నుండి రంజాన్ మాసం ఆరంభం కానున్నందున ముస్లిం సమాజానికి ఈ సూచన చేసింది. ఏప్రిల్ 14 భారత లౌకిక రాజ్యంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతి కూడ.             భారత లౌకిక రాజ్యాంగ పరిరక్షణ కోసం 2019 చివర్లో ఆరంభమైన షాహీన్‌ బాగ్ ఉద్యమం కేంద్ర ప్రభుత్వాన్ని రాజధాని నగరంలోనే ఎలా దిగ్బంధం చేయవచ్చో చాటి చెప్పింది. ఈనాటి రైతాంగ ఆందోళన నాయకత్వం ‘ షాహీన్‌ బాగ్’ ను తమకు దారి చూపిన తల్లిగా పేర్కొనడం ఒక విశేషం.             దళితుల మీద ఒక పరంపరగా దాడులు సాగుతున్నప్పుడు 2018 రంజాన్ మాసంలో ముస్లిం ఆలోచనాపరుల వేదిక   ‘దళిత్ - ముస్లిం ఇఫ్తార్లు’ పిలుపు ఇచ్చిం...

ఒక మహా ప్రజాఉద్యమం మాత్రమే విశాఖ ఉక్కును రక్షించుకోగలదు!.

  ఒక మహా ప్రజాఉద్యమం మాత్రమే విశాఖ ఉక్కును రక్షించుకోగలదు!.     ఉక్కు ఉద్యమానికి MTF సంఘీభావం   20-02-21 శనివారం – విశాఖపట్నం 21-02-21 ఆదివారం – కాకినాడ 22-02-21 సోమవారం - విశాఖపట్నం   ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోరాడి సాధించుకున్న ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు.   భారత దేశంలో తీరప్రాంతంలో వున్న ఏకైక స్టీలు ఫ్యాక్టరీ ఇది. 64 గ్రామాల ప్రజలు 33 వేల ఎకరాల భూములిస్తే పుట్టిన ప్రాజెక్టు ఇది.   ఫ్యాక్టరీ శంఖుస్థాపన జరగడానికి ముందే దాన్ని పోరుగు రాష్ట్రం తమిళనాడుకు హైజాక్ చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ కుట్రను వ్యతిరేకిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1966లో   పెద్ద ఉద్యమం సాగింది. విశాఖపట్నం, గుంటూరు, వరంగల్, హైదరాబాద్ విద్యార్ధులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన సాగించారు. విశాఖకు చెందిన తెన్నేటి విశ్వనాధం ఉద్యమానికి నాయకత్వం వహించారు. గుంటూరుకు చెందిన టి. అమృతరావు ఆమరణ నిరాహార దీక్ష సాగించారు. ఆనాడు ఏపీలో వున్న రాజకీయ పార్టీలన్నీ ఉద్యమానికి మద్దతు పలికాయి. ఉద్యమంలో విశాఖపట్నానికి చెందిన 12 మంది చనిపోయారు. ఇతర జిల్లాల్లో ఇంకో 20 మంది చనిపోయారు. ప్రాణ త...

ముస్లింల కోసం అందరూ; అందరి కోసం ముస్లింలు.

  దేశవ్యాప్త రైతుల ఆందోళనకు ముస్లిం ఆలోచనాపరుల వేదిక ( MTF)  సంపూర్ణ సంఘీభావాన్ని తెలుపుతోంది.   ముస్లింల కోసం అందరూ; అందరి కోసం ముస్లింలు.       ఆలోచనాపరుల వేదిక ( MTF) సభ్యులూ కో-కన్వీనర్లకు.   అస్సలాము అలైకుమ్,   మిత్రులారా!   కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ముస్లింలను వేధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నది. కార్పొరేట్ల ఊడిగం చేయడానికి మైనారిటీలు మాత్రమేగాక కార్మికులు, కర్షకులు. సామ్యవాదుల్ని సహితం ఈ ప్రభుత్వం అణిచివేస్తున్నది. ఈ   నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జిల్లా స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు జరిగే   ప్రతి ఉద్యమంలోనూ ముస్లింలు చురుగ్గా పాల్గొనాలి. వీలున్న చోట్ల నాయకత్వాన్ని చేపట్టడానికి చొరవను ప్రదర్శించాలి.     ముస్లింలు అందరి కోసం నిలబడ్డప్పుడు మాత్రమే అందరూ ముస్లింల కోసం నిలబడతారు. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ నిరంతరం గుర్తు పెట్టుకోవాలి.   ఖాలీదా పర్వీన్,   ఉమర్ ఫారూఖ్ ఖాన్, జహా ఆరా, ఫయాజ్ ఆలీ, హసన్ షరీఫ్ తదితర MTF కో-కన్వీనర్లు నిరంతరం ప్రజల్లో పనిచేస్తున్నారు. వీళ్ళు సహజ నాయకులు.  ...

హత్రాస్ సంఘటనపై ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF) ప్రకటన

  ముందు దెయ్యాలు అత్యాచారం చేశాయి. ఇప్పుడు వ్యవస్థ అత్యాచారం చేస్తున్నది.   హత్రాస్ సంఘటనపై ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF) ప్రకటన   ఉత్తరప్రదేశ్ హత్రాస్ జిల్లా బూల్ గర్హీ గ్రామంలో దళిత అమ్మాయి మోనికా వాల్మీకి మీద జరిగిన హత్యాచారాన్ని. ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF) తీవ్రంగా ఖండిస్తున్నది. ఆమెను చంపిన తీరు ఆమె చనిపోయాక నిందితుల్ని రక్షించడానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం, హత్రాస్ జిల్లా అధికార యంత్రాంగం ఆడిన నాటకాలన్నీ సభ్యప్రపంచం సిగ్గుపడేలా వున్నాయి.     కేంద్ర ప్రభుత్వం తరచుగా ప్రవచించే ‘బేటీ బచావో’ నినాదం నిజరూపాన్ని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి దేశానికి డిజిటల్ డిస్ప్లే   చేస్తున్నారు. బూల్ గర్హీ గ్రామాన్ని డిటెన్షన్ సెంటర్ గా మార్చారు. బయటి ప్రపంచంతో సంబంధాలను పూర్తిగా తెంచేశారు. గ్రామం లోపల బాధితురాలి కుటుంబ సభ్యుల్ని వేధిస్తున్నారు; బెదిరిస్తున్నారు; కొడుతున్నారనే వార్తలు గుండెల్ని పిండేస్తున్నాయి.     మోనికా వాల్మీకిని ముందు దెయ్యాలు అత్యాచారం చేశాయి. ఇప్పుడు వ్యవస్థ అత్యాచారం చేస్తున్నది. ఈ సంఘటనలో నిందితులతోపాటూ అధికారుల్ని సహితం నిర...

My Dream Team Proposal for a Satellite News Channel To build Muslim Goodwill in Telugu

My Dream Team Proposal for a Satellite News Channel To build Muslim Goodwill and to Create Muslim Social Capital in Telugu Honorary Editor                                Khadar Mohiuddeen Chief Executive Officer (CEO)     Kareem (TV9 fame) Chief Technical Officer (CTO)      Asifuddin Muhammed           Marketing Head                                         Siraj (Ad Agency, Vijayawada)             Input Editor            ...