ముస్లింల కోసం అందరూ; అందరి కోసం ముస్లింలు.
దేశవ్యాప్త రైతుల ఆందోళనకు ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF) సంపూర్ణ సంఘీభావాన్ని తెలుపుతోంది.
అస్సలాము అలైకుమ్,
మిత్రులారా!
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం
ముస్లింలను వేధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నది. కార్పొరేట్ల ఊడిగం చేయడానికి మైనారిటీలు
మాత్రమేగాక కార్మికులు, కర్షకులు. సామ్యవాదుల్ని సహితం ఈ ప్రభుత్వం అణిచివేస్తున్నది.
ఈ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జిల్లా స్థాయి
నుండి జాతీయ స్థాయి వరకు జరిగే ప్రతి ఉద్యమంలోనూ
ముస్లింలు చురుగ్గా పాల్గొనాలి. వీలున్న చోట్ల నాయకత్వాన్ని చేపట్టడానికి చొరవను ప్రదర్శించాలి.
ముస్లింలు అందరి కోసం నిలబడ్డప్పుడు
మాత్రమే అందరూ ముస్లింల కోసం నిలబడతారు. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ నిరంతరం గుర్తు పెట్టుకోవాలి.
ఖాలీదా పర్వీన్, ఉమర్ ఫారూఖ్ ఖాన్, జహా ఆరా, ఫయాజ్ ఆలీ, హసన్ షరీఫ్
తదితర MTF కో-కన్వీనర్లు నిరంతరం ప్రజల్లో పనిచేస్తున్నారు. వీళ్ళు సహజ నాయకులు. ఇది మహత్తర విషయం. కరోనా కాలంలో రాజమండ్రికి చెందిన ఆమీర్ ముహమ్మద్
గొప్ప సేవలు అందించారు. వారిని ప్రత్యేకంగా
అభినందిస్తున్నాను. ఇతర కో-కన్వీనర్లు, సభ్యులు కూడ క్రియాశీలంగా మారాలి.
కరోనా ఉధృతి తగ్గగానే మనం త్వరలో
ఏదో ఒక నగరంలో సమావేశం అవుదాం. ఈలోగా జాతీయంగా
సాగుతున్న కార్మిక- కర్షక ఉద్యమాల మీద ముస్లింల
అవగాహనను పెంచడానికి తక్షణం ఒక జూమ్ మీటింగును నిర్వహించాల్సిందిగా హసన్ షరీఫ్ ను కోరుతున్నాను.
అందరూ ముస్లింల కోసం నిలబడాలంటే
ముస్లింలు అందరి కోసం నిలబడాలి.
జజఖుల్లా ఖైర్
మీ
ఖాన్ యజ్దానీ
Comments
Post a Comment