Improve social awareness at Iftar dinners - MTF
- Get link
- X
- Other Apps
ఇఫ్తార్ విందుల్లో సామాజిక అవగాహనను పెంచండి
‘ఇఫ్తార్ విందుల్లో ప్రైవేటీకరణ, రిజర్వేషన్లు,
రైతుల ఆందోళన మీద అవగాహనను పెంచండి’ ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF) పిలుపు.
విజయవాడ ప్రెస్ క్లబ్ లో మార్చ్ 28 ఆదివారం సాయంత్రం
ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF) ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టెబుల్ సమావేశం ఈ మేరకు ఒక
తీర్మానం చేసింది. ఏప్రిల్ 14 నుండి రంజాన్ మాసం ఆరంభం కానున్నందున ముస్లిం సమాజానికి
ఈ సూచన చేసింది. ఏప్రిల్ 14 భారత లౌకిక రాజ్యంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతి కూడ.
భారత
లౌకిక రాజ్యాంగ పరిరక్షణ కోసం 2019 చివర్లో ఆరంభమైన షాహీన్ బాగ్ ఉద్యమం కేంద్ర ప్రభుత్వాన్ని
రాజధాని నగరంలోనే ఎలా దిగ్బంధం చేయవచ్చో చాటి చెప్పింది. ఈనాటి రైతాంగ ఆందోళన నాయకత్వం
‘ షాహీన్ బాగ్’ ను తమకు దారి చూపిన తల్లిగా పేర్కొనడం ఒక విశేషం.
దళితుల
మీద ఒక పరంపరగా దాడులు సాగుతున్నప్పుడు 2018 రంజాన్ మాసంలో ముస్లిం ఆలోచనాపరుల వేదిక
‘దళిత్ - ముస్లిం ఇఫ్తార్లు’ పిలుపు ఇచ్చింది.
దీనికి మంచి స్పందన వచ్చింది. సామాజిక అంశాల
మీద ముస్లింల అవగాహనను మరింతగా పెంచేందుకు వచ్చే రంజాన్ మాసం తోడ్పడుతుందని ఎంటిఎఫ్
ఆశిస్తున్నది. అందుకు సహకరించాల్సిందిగా ముస్లిం ఆలోచనాపరుల్ని, ముస్లిం సమాజాన్ని
కోరుతున్నది.
డానీ
ఏపి, తెలంగాణ రాష్ట్రాల కన్వీనర్
ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)
డాక్టర్ అతావుర్ రహమాన్
గౌరవ అధ్యక్షులు, ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)
అడ్వకేట్ జహా ఆరా
కన్వీనర్, ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF), ఆంధ్రప్రదేశ్
ఖాలీదా పర్వీన్
కన్వీనర్, ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF), తెలంగాణ
ఉమర్ ఫారూఖ్ ఖాన్
కో – కన్వీనర్, ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)
హసన్ షరీఫ్
కో – కన్వీనర్, ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)
ఫయాజ్ అలీ
కో – కన్వీనర్, ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)
షేక్ మునీర్ అహ్మద్
కో – కన్వీనర్, ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)
అడ్వకేట్ షేక్ ఖలీలుల్లా
కో – కన్వీనర్, ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)
హుస్సేన్ షేక్
కో – కన్వీనర్, ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)
నబీ కరీం ఖాన్
కో – కన్వీనర్, ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment