Thanks to All - ధన్యవాదాలు

 ధన్యవాదాలు

 

 

కరోనా తరువాత ముస్లిం ఆలోచనాపరుల వేదిక విజయవాడలో తలపెట్టిన తొలి సమావేశం సంతృప్తిని ఇచ్చింది. వ్యవధి తక్కువగా వున్నప్పటికీ చాలామంది సానుకూలంగా స్పందించారు. ఒక సామాజిక సమస్య మీద ముస్లిం సమాజం స్పందించడాన్ని అందరూ అభినందించారు.

 

ఇఫ్తార్ విందుల్లో సామాజిక అవగాహనను అభివృధ్ధిచేయడానికి కృషి చేయాలని ఒక అర్ధవంతమైన పిలుపును ఈ సమావేశం ఇచ్చింది.

 

సమావేశంలో పాల్గొని జయప్రదం చేసిన

IFTU  జాతీయ అధ్యక్షులు పి ప్రసాద్,

ప్రజాసాహితి నేత దివి కుమార్,

మూవ్ మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ నేత కేఎంఏ సుభాన్,

విరసం నేతలు అరసవిల్లి కృష్ణ, రివేర

ప్రజా నాట్యమండలి నేత పిచ్చయ్య,

IAPL నాయకులు పిచ్చుక శ్రీనివాస్,

సమాజ పరిశీలకులు సి వెంకట్రావ్,

సామాజిక పరివర్తన కేంద్రం నేత వున్నవ వినయ్ కుమార్,

కార్మిక నేత కోయ వెంకటేశ్వర్లు,

పిడిఎస్ యు రాష్ట్రనాయకులు  రామకృష్ణ, రవిచంద్ర,

MTF నేతలు డాక్టర్ అతావుర్ రహమాన్, షేక్ మునీర్ అహ్మద్, అడ్వకేట్ ఖలీలుల్లా,

 

ప్రెస్ క్లబ్ సిబ్బందికి

ఇంకా ప్రతి ఒక్కరికీ

పేరు పేరున ధన్యవాదాలు.

ఈ సమావేశ నిర్వహణలో నా వల్ల ఒక తప్పు జరిగింది.

ప్రెస్ క్లబ్ గ్రౌండ్ ఫ్లోర్ ను ప్రతి ఆదివారం సాయంత్రం క్రైస్తవ సభలకు కాంట్రాక్టు ఇచ్చారన్న అంశం నా దృష్టికి ఆలస్యంగా వచ్చింది. మేము ఫస్ట్ ఫ్లోర్ లో సమావేశం పెట్టడంవల్ల ఆడియో ఓవర్ లాప్ అయ్యింది.  పైగా ఫస్ట్ ఫ్లోర్ లో  లైటింగ్ ఏర్పాట్లు చాలా బలహీనంగా వున్నాయి. లోలైట్ లో సమావేశం నిర్వహించాల్సి వచ్చింది.

 

కలిగిన అసౌకర్యానికి నన్ను మన్నించండి. భవిష్యత్ సమావేశాల్లో లైటింగ్, ఆడియో మీద మరింత  శ్రధ్ధ తీసుకుంటాను.

 

-         డానీ

ఏపి, తెలంగాణ రాష్ట్రాల కన్వీనర్

ముస్లిం ఆలోచనాపరుల వేదిక  (MTF)

Comments

Popular posts from this blog

*జిల్లాల్లోని ప్రధాన సమస్యల్ని పోస్టు చేయండి*

Crusades - 1095–1291

Ahmad Khan - French Revolution