హత్రాస్ సంఘటనపై ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF) ప్రకటన
ముందు దెయ్యాలు అత్యాచారం
చేశాయి.
ఇప్పుడు వ్యవస్థ అత్యాచారం
చేస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం తరచుగా ప్రవచించే ‘బేటీ బచావో’ నినాదం నిజరూపాన్ని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి దేశానికి డిజిటల్ డిస్ప్లే చేస్తున్నారు. బూల్ గర్హీ గ్రామాన్ని డిటెన్షన్ సెంటర్ గా మార్చారు. బయటి ప్రపంచంతో సంబంధాలను పూర్తిగా తెంచేశారు. గ్రామం లోపల బాధితురాలి కుటుంబ సభ్యుల్ని వేధిస్తున్నారు; బెదిరిస్తున్నారు; కొడుతున్నారనే వార్తలు గుండెల్ని పిండేస్తున్నాయి.
మోనికా వాల్మీకిని ముందు దెయ్యాలు అత్యాచారం చేశాయి. ఇప్పుడు వ్యవస్థ అత్యాచారం చేస్తున్నది. ఈ సంఘటనలో నిందితులతోపాటూ అధికారుల్ని సహితం నిర్భయ చట్టం ప్రకారం కఠినాతికఠినంగా శిక్షించాలని MTF డిమాండ్ చేస్తున్నది.
ఉత్తరప్రదేశ్ బలరాంపూర్ లో కూడ సెప్టెంబరు 29న ఒక దళిత అమ్మాయి మీద అత్యాచారం జరిగింది. ఈ కేసులో షాహిద్, సాహిల్ నిందితులు. వాళ్ళిద్దర్నీ నిర్భయ చట్టం ప్రకారం కఠినాతికఠినంగా శిక్షించాలని MTF డిమాండ్ చేస్తున్నది.
ఏయం ఖాన్ యజ్దానీ (డానీ)
కన్వీనర్, ముస్లిం ఆలోచనాపరుల వేదిక
(MTF)
Comments
Post a Comment