Posts

Next Target AP Muslim Educational Society

విజయవాడ 30 జులై 2019 మిత్రులారా ! MTF స్వీయ సమాజానికి దిశానిర్దేశం చేసే మేధోసరోవరంగా వుంటూ క్షేత్రస్థాయిలో కార్యచరణ సంఘాలను ఏర్పాటుకు కృషి చేయాలని మన జూన్ 15 నాటి విస్తృత కార్యవర్గంలో తీర్మానం చేసుకున్నాము.   నిన్న విజయవాడలో జరిగిన ముస్లిం సంకల్ప సభ నిర్వహణ భారాన్ని Muslim JAC కన్వీనర్ షేక్ మునీర్ అహ్మద్ మరికొందరు భరించగా,   MTF మేధోసరోవరంగా పనిచేసింది.   ఈ సభలోనే ఏపి వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కమిటి (APWPPC) ఆవిర్భవించింది. దీనితో MTF లక్ష్యాల్లో ఒకటి నెరవేరింది. ఇక మన తదుపరి లక్ష్యం విద్యారంగం.   AP Muslim Educational Societyని ఏర్పాటు చేయాలి. రెండు మూడు నెలల్లో మరో ముస్లిం సంకల్ప సభను నిర్వహించి AP Muslim Educational Society ఏర్పాటు చేయాలి. ఇలాంటి సభలకు రూ. 40 వేల నుండి రూ. 50 వేల వరకు ఖర్చు అవుతుంది. భరించ గలిగే జిల్లా యూనిట్ ఏదైనా వుందా? లేకుంటే దాన్ని కూడా విజయవాడలోనే జరపాల్సి వుంటుంది. అందరూ స్పందించండి. మీ డానీ

Extended Executive Committee Meeting 15 June 2019

Muslim Thinkers Forum (MTF) Extended Executive Committee Meeting 15 June 2019, Saturday, 10 a.m. to 5 p.m. @ Advocate Khalilulla’s Office, Behind Museum Governorpet, Vijayawada ప్రధాన తీర్మానాలు 1.            కార్యక్షేత్రం పరిథి పరిమితి – సామాన్య ప్రజలు ఎంటిఎఫ్ లక్ష్యం సామాన్య ముస్లింల అభ్యున్నతి. ఎంటిఎఫ్ కార్యక్షేత్రం మేధోరంగం. ఎంటిఎఫ్ సాగించే మేధోమధనం ఆలోచనల స్థాయి, పారిభాషిక పదాల   ప్రయోగం ఎప్పుడూ వున్నతంగా వుండాలి. మన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవడానికి సమాజ, మానవాభివృధ్ధి, తాత్విక, చరిత్ర, రాజకీయార్థిక, వాణిజ్యం వంటి హ్యుమానిటీస్   శాస్త్రాలతో పాటూ వివిధ విజ్ఞాన శాస్త్రాల్లో వస్తున్న కొత్త పరిణామాల్ని సహితం ఎంటిఎఫ్ సభ్యులు గమనిస్తూ వుండాలి. అనుక్షణం అప్డేట్ అవుతూ ముస్లిమేతర ఆలోచనాపరుల కన్నా ఎంటిఎఫ్ ఎప్పుడూ   మేధోమధనంలో ముందుండాలి. ఎన్నడూ ఎట్టి పరిస్థితులలోనూ ఫేక్ న్యుస్ ప్రచారంలో ఎంటిఎఫ్ సభ్యులు భాగస్వాములు కావద్దు. ఒకటికి రెండుసార్లు పున ఃపరిశీలన చేసుకున్న తరువాతే ఇతరుల పోస్టింగ్స్ ...

గాంధీ నుండి మోదీ వరకు

గాంధీ నుండి మోదీ వరకు నరేంద్ర మోది – అమిత్ షాలను భారత రాజకీయాల్లో ఏ పార్టీ కూడ ఎదుర్కొనే పరిస్థితి ఇప్పుడు లేదు. ఇన్ స్టాంట్ ట్రిబుల్ తలాక్ బిల్లును వైసిపి లోక్ సభలో సమర్ధించనూ లేదు; తిరస్కరించనూ లేదు. ఓటింగుకు దూరంగా వుండిపోయింది. టీఎంసి కూడ ఆపనే చేసింది. ఇదొక రకం తటస్థవైఖరి. కాంగ్రెస్ ఒక్కటే అడ్డుకున్నది. మితిష్ కుమార్ నాయకత్వంలోని జేడియు కూడా బిల్లుకు దూరాన్ని పాటించింది. పాకిస్తాన్ లో మైనారిటీలయిన హిందువుల కోసం, భారత దేశంలో మైనారిటీలయిన ముస్లింల కోసం తాను నిలబడతాను అన్నందుకు గాంధీని హత్య చేశారు. ఇప్పుడు అలాంటి ప్రకటనలు చేసి చావును కొని తెచ్చుకునేవారు భారత రాజకీయాల్లో లేరు. ముస్లింల మీద ఏమాత్రం   సానుభూతిని చూపినా రాజకీయాల నుండి తప్పుకోవాల్సిన వాతావరణం దేశంలో వుంక్దని మనం గమనించాలి.   జగన్ ను అయినా, మరో పార్టీని అయినా అనేక పరిమితులవల్ల వాళ్ళు చేయలేని పనుల్ని మనం అడగక పోవడమే మంచిది. మనం పెద్ద పెద్ద కోరికలు కోరడం మానేసి చిన్నచిన్న కోరికలు అడగడం మంచిదేమీ అనిపిస్తోంది.

Daily Debate

మిత్రులారా! వర్తమాన సామాజిక, రాజకీయార్ధిక అంశాల్ని మనం అనుక్షణం గమనిస్తూ వుండాలి. వాటి మన అవగాహనను పెంచుకుంటూ వుండాలి. MTF లక్ష్యాలకు అనుగుణంగా విధాన నిర్ణయాలు చేసుకోవడమేగాక   అవసరమైనపుడు ఒక కార్యాచణను కూడ రూపొందించడమేగాక ఆచరించాలి. ఇక నుండి వారంలోని 7 రోజులు రోజుకు ఒకరు ప్రాతిపదిక నోట్ పెట్టాలి.   ఆ వారంలో ముస్లిం సమాజానికి సంబంధించి వారి దృష్టికి వచ్చిన ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ పరిణామాల్ని అందులో పేర్కొనడమేగాక, MTF   వాటిని ఎలా అర్ధం చేసుకోవాలో? సందర్భాన్నీబట్టి దానికి మద్దతుగానో, వ్యతిరేకిస్తూనో ఎలాంటి కార్యక్రమాన్నీ తీసుకోవాలో సూచించాలి. నోట్ నిడివి 200 పదాలు లేదా 1200 అక్షరాలకు మించరాదు. నోట్ ను సాయంత్రం 7 గంటలలోగా ఎప్పుడయినా పెట్టవచ్చు. 8 గంటల నుండి దానిమీద చర్చ వుంటుంది. రోజుకు ఒక నోటు మీద మాత్రమే చర్చ చేయగలం కనుక నిర్ణిత రోజున నిర్ణిత సభ్యులే నోట్ పెడితే బాగుంటుంది. ఒకే నోట్ లో రెండు మూడు అంశాలు కూడా ప్రస్తావించవచ్చు. నోట్ నిడివి మాత్రం పెరగకూడదు. నేను కొన్ని రోజులకు కొందరి పేర్లను ప్రతిపాదిస్తున్నాను. సవరణలు వుంటే సూచించండి. 1.   ...

Live Chatting proposal

Live Chatting  మిత్రులారా ! భారత ముస్లీం సమాజానికి మనం ఊహిస్తున్న దానికన్నా ఎక్కువ ముప్పు ముంచుకు వస్తున్నది.   ఆలోచనారంగంలో మనం నిర్వర్తించాల్సిన కర్తవ్యాలు పెరుగుతున్నాయి. మనం అనేక వినూత్న కార్యక్రమాలను చేపట్టాల్సి వుంది. MTF   Group లో మనం మరింత విస్తృతంగా మేధోమనం సాగించాల్సి వుంది. ముందుగా గ్రూపులోని ప్రతి సభ్యుడు రోజుకు ఒక గంట సమయాన్ని గ్రూపు ఛాట్ కోసం కేటాయించండి. ప్రతిరోజూ ఒక గంట.   అందరూ ఒకే సమయంలో online లో వుంటే ఇంకా బాగుంటుంది. ఏ సమయం బాగుంటుందో చెప్పండి. నేను 7 p.m. to 8 p.m. ను ప్రతిపాదిస్తున్నాను. ఆ సమయంలో అందరూ online లో వుండాలి. మీ అభిప్రాయాలు చెప్పండి. డానీ

ట్రిపుల్ తలాక్ బిల్లు,

మిత్రులారా! వివాదాస్పద ట్రిపుల్ తలాక్ బిల్లు,   ‘ముస్లిం మహిళల (వైవాహిక హక్కుల పరిరక్షణ) బిల్లు – 2017 నిన్న   లోక్ సభ ఆమోదాన్ని పొందింది. ఇప్పుడు రాజ్య సభ ఆమోదాన్ని పొందాల్సి వుంది. రాజ్యసభలో బిజెపికి తగిన బలం లేదు. టిడిపి తదితర పార్టీల్ని విలీనం చేసుకోని రాజ్యసభలోనూ తన బలాన్ని పెంచుకోవడానికి బిజెపి అనేక ప్రయత్నాలు చేస్తున్నది. దానికి రాజ్యసభలో ఆధిక్యత వచ్చిన రోజు ఈ బిల్లు చట్టంగా మారి అమల్లోనికి రావచ్చు. చట్టాలు లేకుండానే సంఘపరివారం ముస్లింలను వేధిస్తున్నది. ఇక చట్టం కూడ చేతిలోవుంటే ఈ వేధింపులు ఏ స్థాయికి చేరుతాయో ఊహించవచ్చు. ఈ బిల్లును పాస్ చేయించుకున్న ఉత్సాహంతో హలాలా ను చర్చనీయాంశంగా మార్చే అవకాశాలున్నాయి. తలాక్ విషయంలో రెండు అంశాలున్నాయి. ముస్లిం భర్తలు కొందరు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. భార్యల్ని అతి దయనీయ స్థితిలో బయటికి గెంటేస్తున్నారు. దీన్ని సాకుగా తీసుకుని బిజేపి చట్టం తెస్తున్నది. ఈ చట్టంలో రోడ్డు పాలైన ముస్లిం ఇల్లాల్ని ఆదుకునే దయగల చర్యలులేవు, కేవలం ముస్లిం భర్తల్ని జైళ్ళకు పంపాలనే క్రూరత్వం మాత్రమే వుంది. ముందు మనం ముస్లిం మహిళలకు జరుగుతు...

అష్రాఫ్, అజ్లాఫ్, అర్జాల్

అష్రాఫ్, అజ్లాఫ్, అర్జాల్ భారత ముస్లిం సమాజంలో అష్రాఫ్, అజ్లాఫ్, అర్జాల్ తేడాలు వున్నాయి. వీటిని పూర్తిగా కులాలు కూడా అనలేం. వాళ్ల మధ్య యజమాని, శ్రామికులు అనే ఉత్పత్తి సంబంధాలు లేవు కనుక ఈ తేడాలను హిందూ సమాజంలోని కుల ఘర్షణతో పోల్చలేం. కల్మా చదివినవారు ఎవరైనా ముస్లింలే. అల్లాతప్ప ఈ విశ్వంలో మరో దేవుడు లేడు; ముహమ్మద్ మనకు దైవ సందేశాన్ని అందిచినవారు అని నమ్మితే చాలు ముస్లింలు అయిపోతారు. ఇందులో ఎలాంటి వివక్షాలేదు.   శుక్రవారం మధ్యాహ్నం   ఏ మసీదుకు వెళ్ళినా ముస్లిం సమాజంలో ఎంతటి వైవిధ్యం వుందో కనిపిస్తుంది. ఇస్లాం ఏకేశ్వరోపాసన మతం. ఇంకో దేవుడ్నో, బాబాలనో నమ్మే వాళ్ళను, దర్గాల దగ్గర పూజలు కర్మకాండలు చేసే బహుదేవతారాధకుల్ని సాంప్రదాయ ముస్లింలు భిన్నంగా చూస్తారనేది వాస్తవం. ఇదొక ధార్మిక సూక్ష్మం. ఈ శాఖా బేధాల్ని పట్టణాల్లో, విద్యాధిక సమూహాల్లో పెద్దగా గుర్తు పట్టలేం గానీ గ్రామీణ ప్రాంతాల్లో ఈ మేరకు సాంస్కృతిక తారతమ్యాలు వుంటాయి. ముస్లిం సమాజంలో సాంస్కృతికంగా వెనుకబడిన మెహతర్, లద్దాఫ్,   దూదేకుల తరగతులకు చాలా కాలంగా విద్య, ఉపాధిరంగాల్లో బిసి-ఎ, బిసి-బి జాబితాలో రిజర్...