అష్రాఫ్, అజ్లాఫ్, అర్జాల్
అష్రాఫ్, అజ్లాఫ్, అర్జాల్
భారత ముస్లిం సమాజంలో అష్రాఫ్, అజ్లాఫ్, అర్జాల్
తేడాలు వున్నాయి. వీటిని పూర్తిగా కులాలు కూడా అనలేం. వాళ్ల మధ్య యజమాని, శ్రామికులు
అనే ఉత్పత్తి సంబంధాలు లేవు కనుక ఈ తేడాలను హిందూ సమాజంలోని కుల ఘర్షణతో పోల్చలేం.
కల్మా చదివినవారు ఎవరైనా ముస్లింలే. అల్లాతప్ప ఈ
విశ్వంలో మరో దేవుడు లేడు; ముహమ్మద్ మనకు దైవ సందేశాన్ని అందిచినవారు అని నమ్మితే చాలు
ముస్లింలు అయిపోతారు. ఇందులో ఎలాంటి వివక్షాలేదు.
శుక్రవారం మధ్యాహ్నం ఏ మసీదుకు వెళ్ళినా
ముస్లిం సమాజంలో ఎంతటి వైవిధ్యం వుందో కనిపిస్తుంది.
ఇస్లాం ఏకేశ్వరోపాసన మతం. ఇంకో దేవుడ్నో, బాబాలనో
నమ్మే వాళ్ళను, దర్గాల దగ్గర పూజలు కర్మకాండలు చేసే బహుదేవతారాధకుల్ని సాంప్రదాయ ముస్లింలు
భిన్నంగా చూస్తారనేది వాస్తవం. ఇదొక ధార్మిక సూక్ష్మం. ఈ శాఖా బేధాల్ని పట్టణాల్లో,
విద్యాధిక సమూహాల్లో పెద్దగా గుర్తు పట్టలేం గానీ గ్రామీణ ప్రాంతాల్లో ఈ మేరకు సాంస్కృతిక
తారతమ్యాలు వుంటాయి.
ముస్లిం సమాజంలో సాంస్కృతికంగా వెనుకబడిన మెహతర్,
లద్దాఫ్, దూదేకుల తరగతులకు చాలా కాలంగా విద్య,
ఉపాధిరంగాల్లో బిసి-ఎ, బిసి-బి జాబితాలో రిజర్వేషన్ సౌకర్యం వుంది. 2006లో 14 విభాగాల్లో
దాదాపు 60 కులాలవాళ్ళను బిసి-ఇ జాబితాలో చేర్చారు. వాళ్ళల్లో ఎక్కువ మంది సంచార తెగల
వాళ్ళు. వాళ్ళ దయనీయ జీవన స్థితిగతుల్ని బట్టి ఎస్ టి, ఎస్ సి జాబితాల్లో చేరాల్సిన
వాళ్ళు. ఏపిలో వాళ్ళకు రిజర్వేషన్ల సాధన కోసం పొరాడింది అష్రాఫ్ లే. తమకు కాకుండా ఇతర తరగతులకు రిజర్వేషన్లు వచ్చినందుకు సయ్యద్, పఠాన్,
బేగ్, మీర్జా, మొఘల్ తదితర అష్రాఫ్ లు ఎన్నడూ అక్కసును వ్యక్తం చేయలేదు.
బీహార్ వంటి చోట్ల వీరి మధ్య విబేధాలు కొంచెం ఎక్కువగా
వుండేవని విన్నాను. ఇప్పుడు అవి తగ్గి పోయాయి. అయితే, తెలుగు రాష్ట్రాల్లో అలాంటి విబేధాలు ఎప్పుడూ లేవు. నిజానికి ముస్లింగా పుట్టిన (chance) వారికన్నా ఇష్టపూర్వకంగా
(choice) ఇస్లాంను స్వీకరించివారంటే ముస్లిం
సమాజంలో గౌరవం ఎక్కువ. వాళ్ళను ‘నౌ ముసల్మాన్’ అని చాలా గౌరవంగా సంభోదిస్తారు.
ఇక ముస్లిం ఆలోచనా వేదిక పెట్టిన తరువాతే కాకండా
అంతకు ఇరవై ఏళ్ళ ముందు నుండే నేను అజ్లాఫ్ లతో
కలిసి పనిచేస్తున్నాను. కొందరు అర్జాల్ లు సహితం MTF లో పనిచేస్తున్నారు.
Comments
Post a Comment