ట్రిపుల్ తలాక్ బిల్లు,
మిత్రులారా!
వివాదాస్పద
ట్రిపుల్ తలాక్ బిల్లు, ‘ముస్లిం మహిళల (వైవాహిక హక్కుల పరిరక్షణ) బిల్లు
– 2017 నిన్న లోక్ సభ ఆమోదాన్ని పొందింది. ఇప్పుడు రాజ్య సభ ఆమోదాన్ని
పొందాల్సి వుంది. రాజ్యసభలో బిజెపికి తగిన బలం లేదు. టిడిపి తదితర పార్టీల్ని విలీనం
చేసుకోని రాజ్యసభలోనూ తన బలాన్ని పెంచుకోవడానికి బిజెపి అనేక ప్రయత్నాలు చేస్తున్నది.
దానికి రాజ్యసభలో ఆధిక్యత వచ్చిన రోజు ఈ బిల్లు చట్టంగా మారి అమల్లోనికి రావచ్చు.
చట్టాలు
లేకుండానే సంఘపరివారం ముస్లింలను వేధిస్తున్నది. ఇక చట్టం కూడ చేతిలోవుంటే ఈ వేధింపులు
ఏ స్థాయికి చేరుతాయో ఊహించవచ్చు. ఈ బిల్లును పాస్ చేయించుకున్న ఉత్సాహంతో హలాలా ను
చర్చనీయాంశంగా మార్చే అవకాశాలున్నాయి.
తలాక్
విషయంలో రెండు అంశాలున్నాయి. ముస్లిం భర్తలు కొందరు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.
భార్యల్ని అతి దయనీయ స్థితిలో బయటికి గెంటేస్తున్నారు. దీన్ని సాకుగా తీసుకుని బిజేపి
చట్టం తెస్తున్నది. ఈ చట్టంలో రోడ్డు పాలైన ముస్లిం ఇల్లాల్ని ఆదుకునే దయగల చర్యలులేవు,
కేవలం ముస్లిం భర్తల్ని జైళ్ళకు పంపాలనే క్రూరత్వం మాత్రమే వుంది.
ముందు
మనం ముస్లిం మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని ఖండించాలి. ఆ తరువాత ప్రభుత్వ దమన నీతిని ఖండించాలి.
బిల్లును
లోక్ సభలో ఏఏ పార్టీలు సమర్ధించాయి, ఏఏ పార్టీలు వ్యతిరేకించాయి అనేది విశ్లేషించుకుని
మనం ఒక రాజకీయ విధానాన్ని రూపొందించుకోవాల్సి వుంటుంది. మనం జాతీయ నెట్ వర్క్ ను ఏర్పాటు
చేసుకోవాల్సిన అవసరం కుడా వుంది.
ఎంటిఎఫ్
మరింత చురుగ్గా పని చేయాల్సిన అవసరం కనిపిస్తున్నది. సంఘపరివారంకన్నా నన్ను భయపెడుతున్న
అంశం ముస్లిం ఆలోచనాపరుల నిర్లిప్తత. మన సమాజం పోరాడటం అటుంచి, నిరాశక్తంగా వుండిపోతున్నది.
ఏం
చేద్దాం. సూచనలు ఇవ్వండి.
Comments
Post a Comment