గాంధీ నుండి మోదీ వరకు
గాంధీ
నుండి మోదీ వరకు
నరేంద్ర
మోది – అమిత్ షాలను భారత రాజకీయాల్లో ఏ పార్టీ కూడ ఎదుర్కొనే పరిస్థితి ఇప్పుడు లేదు.
ఇన్ స్టాంట్ ట్రిబుల్ తలాక్ బిల్లును వైసిపి లోక్ సభలో సమర్ధించనూ లేదు; తిరస్కరించనూ
లేదు. ఓటింగుకు దూరంగా వుండిపోయింది. టీఎంసి కూడ ఆపనే చేసింది. ఇదొక రకం తటస్థవైఖరి.
కాంగ్రెస్ ఒక్కటే అడ్డుకున్నది. మితిష్ కుమార్ నాయకత్వంలోని జేడియు కూడా బిల్లుకు దూరాన్ని
పాటించింది.
పాకిస్తాన్
లో మైనారిటీలయిన హిందువుల కోసం, భారత దేశంలో మైనారిటీలయిన ముస్లింల కోసం తాను నిలబడతాను
అన్నందుకు గాంధీని హత్య చేశారు. ఇప్పుడు అలాంటి ప్రకటనలు చేసి చావును కొని తెచ్చుకునేవారు
భారత రాజకీయాల్లో లేరు. ముస్లింల మీద ఏమాత్రం సానుభూతిని చూపినా రాజకీయాల నుండి తప్పుకోవాల్సిన
వాతావరణం దేశంలో వుంక్దని మనం గమనించాలి. జగన్
ను అయినా, మరో పార్టీని అయినా అనేక పరిమితులవల్ల వాళ్ళు చేయలేని పనుల్ని మనం అడగక పోవడమే
మంచిది.
మనం
పెద్ద పెద్ద కోరికలు కోరడం మానేసి చిన్నచిన్న కోరికలు అడగడం మంచిదేమీ అనిపిస్తోంది.
Comments
Post a Comment