Extended Executive Committee Meeting 15 June 2019
Muslim Thinkers Forum (MTF)
Extended Executive
Committee Meeting
15 June 2019, Saturday, 10 a.m. to 5 p.m.
@ Advocate Khalilulla’s Office, Behind Museum
Governorpet, Vijayawada
ప్రధాన తీర్మానాలు
1.
కార్యక్షేత్రం పరిథి పరిమితి – సామాన్య
ప్రజలు
ఎంటిఎఫ్ లక్ష్యం సామాన్య
ముస్లింల అభ్యున్నతి.
ఎంటిఎఫ్ కార్యక్షేత్రం
మేధోరంగం.
ఎంటిఎఫ్ సాగించే మేధోమధనం
ఆలోచనల స్థాయి, పారిభాషిక పదాల ప్రయోగం ఎప్పుడూ
వున్నతంగా వుండాలి.
మన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవడానికి
సమాజ, మానవాభివృధ్ధి, తాత్విక, చరిత్ర, రాజకీయార్థిక, వాణిజ్యం వంటి హ్యుమానిటీస్ శాస్త్రాలతో పాటూ వివిధ విజ్ఞాన శాస్త్రాల్లో వస్తున్న
కొత్త పరిణామాల్ని సహితం ఎంటిఎఫ్ సభ్యులు గమనిస్తూ వుండాలి.
అనుక్షణం అప్డేట్ అవుతూ
ముస్లిమేతర ఆలోచనాపరుల కన్నా ఎంటిఎఫ్ ఎప్పుడూ
మేధోమధనంలో ముందుండాలి.
ఎన్నడూ ఎట్టి పరిస్థితులలోనూ
ఫేక్ న్యుస్ ప్రచారంలో ఎంటిఎఫ్ సభ్యులు భాగస్వాములు కావద్దు. ఒకటికి రెండుసార్లు పునఃపరిశీలన
చేసుకున్న తరువాతే ఇతరుల పోస్టింగ్స్ ను షేర్ చేయాలి.
మేధోమధనంలో ఎంటిఎఫ్ సభ్యులు
వాడే పదజాలం సామాన్యులకు అర్థం అయ్యేలా చేయడం ఒక పెద్ద సవాలు. సమస్త విషయాలు సామాన్యులకు
అర్థం కావడానికి మనం ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అంతేతప్ప, సామాన్యులకు
అర్థం కావాలనే వంకతో మేధోమధనం స్థాయిని ఎన్నడూ తగ్గించకూడదు. ఎంటిఎఫ్ ఒక మేధావుల సంఘం; ప్రాధమిక పాఠశాల కాదు.
మన అభిప్రాయాలను సామాన్యప్రజల
దగ్గరికి తీసుకునిపోవడానికి ఎంటిఎఫ్ ఇతర ప్రజాసంఘాలతో కలిసి పనిచేస్తుంది. ప్రజాసంఘాల
ప్రముఖులకు అవసరమైతే శిక్షణా తరగతుల్ని నిర్వహిస్తుంది.
మరోమాటల్లో చెప్పాలంటే ఎంటిఎఫ్ ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తుంది. అలా శిక్షణ పొందిన ఉపాధ్యాయుల
ద్వార ఎంటిఎఫ్ సందేశం సామాన్య ప్రజలకు చేరుతుంది.
(చర్చలో ప్రధానంగా పాల్గొన్నవారు
డానీ, జహ ఆర. మునీర్ అహ్మద్, షఫి అహ్మద్)
2.
నైతిక సందిగ్ధం
భారత ముస్లింలను ఒక పథకం
ప్రకారం విద్యా, ఆర్థిక, రాజకీయ రంగాల నుండి తరిమేయడానికి సంఘపరివారం నిత్యం ప్రయత్నిస్తున్నది.
వీటిని ఎదుర్కోవడం ఒక పెద్ద సమస్య. ఆపైన మనల్ని నైతికంగా ఆత్మరక్షణలో పడేయడానికి మన తలల మీద రామజన్మభూమి,
ఉమ్మడి పౌర స్మృతి, ఆర్టికల్ 370, గో రక్షణ దళాలు, లవ్ జిహాద్, ఘర్ వాపసి, ట్రిపుల్
తలాక్, హలాల పేరిట పది కత్తుల్ని వేలాడదీశారు.
పరిస్థితి ఏ దశకు చేరుకున్నదంటే
మూకోన్మాదులు ఎవరినైనా ఎప్పుడయినా నడిరోడ్డు మీద చుట్టుముట్టి చంపేస్తే మనం మౌనంగా
వుండిపోయినా తప్పుగానే వుంటోంది. నోరు తెరచి ఖండించినా తప్పుగానే వుంటోంది. మౌనంగా
వుండిపోతే మనం ఆమోదం తెలిపినట్టు పరిగణిస్తున్నారు. మనం ఖండిస్తే ఆ వంకతో
హిందూ సమాజానికి ముప్పు వచ్చినట్టు ప్రచారం చేసి వాళ్ళను ఏకం చేసి రాజకీయంగా
లబ్ది పొందుతున్నారు. ఇదొక డామినెంట్ మూవ్.
(చర్చలో ప్రధానంగా పాల్గొన్నవారు
ఆసిఫుద్దీన్, ఖలీలుల్లా, షేక్ మౌలా ఆలీ, డాక్టర్ అతావుర్ రహమాన్)
3.
రాజకీయ తీర్మానం
స్వీయసమాజంలో ఎంటిఎఫ్ నిరంతరం
రాజకీయ చైతన్యాన్ని కలిగిస్తూ వుండాలి. అయితే, ఏ రాజకీయ పార్టీకీ ప్రత్యక్షంగా మద్దతు
పలకరాదు. అలాంటి పిలుపులు ఇవ్వరాదు.
అధికారంలో ఏ పార్టీ వున్నాసరే
దానితో సంప్రదింపులు జరిపి, లాబీయింగ్ చేసి నిరంతరం ముస్లిం సమాజానికి మేళ్ళు సాధించే
పనిలో వుండాలి.
(చర్చలో ప్రధానంగా పాల్గొన్నవారు జహ
ఆరా, ఆసిఫుద్దీన్, ఖలీలుల్లా, షేక్ మౌలా ఆలీ)
4.
చర్చలు సంప్రదింపులు
మనం నిరంతరం ఐదు సమూహాలతో
నిరంతరం చర్చలు సంప్రదింపులు జరుపుతుండాలి.
1.
కేంద్ర
రాష్ట్ర ప్రభుత్వాలు
2.
ముస్లీం
సమాజం
3.
ముస్లిమేతర
సమాజాలు
4.
రాజకీయ
పార్టీలు
5.
ముస్లిం
జమాత్ లు
(చర్చలో
ప్రధానంగా పాల్గొన్నవారు జహ ఆరా , షేక్ మౌలా ఆలీ)
5.
రోజుకో గంట కేటాయించాలి
ఎంటిఎఫ్ సభ్యులు ప్రతి
రోజూ ఒక గంట సమయాన్ని సంస్థ కోసం, స్వీయ సమాజం కోసం కేటాయించాలి. అందరూ ఒకే సమయాన్ని
కేటాయిస్తే ఇంకా బాగుంటుంది. ప్రతిరోజూ రాత్రి 7-8 గంటల మధ్య ఎంటిఎఫ్ సభ్యులందరూ చాటింగ్ లో వుండాలి. కరెంట్ టాపిక్స్ మీద ప్రతిరోజూ
విస్తృతంగా చర్చిస్తూ ఎప్పటికప్పుడు మన అవగాహనను
పెంచుకుంటూ వుండాలి. భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటూ వుండాలి.
(చర్చలో ప్రధానంగా పాల్గొన్నవారు
షేక్ యాసీన్)
6.
విజన్ మిషన్ 2024
ఎంటిఎఫ్ తక్షణం న్ మిషన్
2024ను రూపొందించుకోవాలి. సమాజంలోని ఇతర అణగారిని
సమూహాలతో కలసిమెలసి నడవాలి. ముందుగా ఎంటిఎఫ్
ను సొసైటీస్ యాక్ట్ కింద రిజిస్టర్ చేయాలి. సోషల్ మీడియాలో పేజీనీ, వెబ్ సైట్ ను రూపొందించుకోవాలి.
(చర్చలో ప్రధానంగా పాల్గొన్నవారు
ఆసిఫుద్దీన్ )
7.
ముస్లీం అధ్యన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి
పరిసరాల్లో కనీసం ఒక ఎకరం విస్తీర్ణంలో ముస్లిం అధ్యయన కేంద్రాన్ని నెలకొల్పాలి. ఇది
ఇస్లామిక్ ధార్మిక అధ్యయన కేంద్రం కాదు. భారత ముస్లీంల సమాజ అధ్యయన కేంద్రం. ఈ కేంద్రానికి
సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ పేరును ఎంటిఎఫ్ ప్రతిపాదిస్తున్నది.
అయితే, దీని నిర్మాణానికి సహకరించే ప్రభుత్వం తన ఆసక్తి మేరకు ఎవరి పేరును ప్రతిపాదించినా
ఏంటిఎఫ్ అంగీకరిస్తుంది. (ఉదా :
వైయస్సార్).
(చర్చలో ప్రధానంగా పాల్గొన్నవారు
ఆసిఫుద్దీన్. జహా ఆర, హసన్ షరీఫ్ )
8.
విజయవాడలో ఎంటిఎఫ్ కార్యాలయం
విజయవాడలో తక్షణం ఎంటిఎఫ్
కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి. లొకేషన్ ను బట్టి 2 BHK కార్యాలయం నెలసరి అద్దె 15 వేల
రూపాయలకు మించకుండా ఏర్పాటు చేసుకోవాలి. కార్ పార్కింగ్ కూడా వుంటే మరింత సౌలభ్యంగా
వుంటుంది.
(చర్చలో ప్రధానంగా పాల్గొన్నవారు
ఆసిఫుద్దీన్. జహా ఆర, సయ్యద్ రఫి, హసన్ షరీఫ్, మునీర్ అహ్మద్ )
9.
సాధారణ కార్యక్రమాలు
ఎంటిఎఫ్ నెలకు ఒక సభను
నిర్వహించాలి.
నెలకు రెండు మీడియా సమావేశాలని
నిర్వహించి వివిధ అంశాల మీద మన అవగాహనను, విధానాలను ప్రజలకు వివరించాలి.
అలాగే, ప్రతి మూడు నెలలకు
ఒక శిక్షణా తరగతుల్ని నిర్వహించి చైతన్యవంతమైన కొత్తతరాన్ని రూపొందించాలి.
(చర్చలో ప్రధానంగా పాల్గొన్నవారు
అబ్దుల్ మతీన్, హసన్ షరీఫ్, మునీర్ అహ్మద్ )
10. భవిష్యత్తు
కార్యక్రమాలు
ప్రజలు మన భావజాలంకన్నా
తమ తక్షణ అవసరాలను వెరవేర్చుకోవడానికి ఎక్కువ
ఆసక్తి చూపుతారు.
ముస్లిం సమాజంలో విద్యా
వ్యాప్తి కోసం ఏంటిఎఫ్ కృషి చేయాలి.
విద్యారంగంలో కృషిచేస్తున్న
సంస్థలకు మద్దతు ఇవ్వాలి.
తెలంగాణలో రెసిడేన్షియల్ పాఠశాలలు 4 వందల వరకు వున్నాయి. ఏపిలో అవి 10 కూడా
లేవు.
జాబ్ మేళాలు వంటివి నిర్వహించి
ఉపాధిరంగంలో ముస్లింల వాటా పెణ్చడానికి ప్రత్యేకంగా
కృషి చేయాలి.
రాజకీయ ప్రాతినిధ్యం కోసం
మనం చట్ట సభల్నే ఎంచుకుంటున్నాము.
మనం గ్రామ పంచాయితీల నుండి
మొదలవ్వాలి.
వక్ఫ్ భూముల పరిరక్షణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. ఎబిసి రిజర్వేషన్లను
సయ్యద్, పఠాన్, మొఘల్, మీర్జా తదితర సమూహాలు వినియోగించుకునేలా కృషిచేయాలి.
రాష్ట్రంలో మరో ముస్లిం మంత్రిని నియమించాలను కోరాలి.
వారికి మెరుగైన శాఖని ఇవ్వాలని
కోరాలి.
తలాక్ ను నేరపూరిత చర్యగా
పరిగణించే బిల్లును వ్యతిరేకించాలి. అయితే, తక్షణ ట్రిపుల్ తలాక్ చెప్పి మహిళలకు తీవ్ర
అన్యాయం చేస్తున్న ముస్లిం భర్తల్ని తీవ్రంగా వ్యతిరేకించాలి.
వాళ్ళ మీద, వారి కుటుంబాల
మీద ఆంక్షలు విధించాలి.
సబ్ కమిటీలు ఏర్పాటు చేసి
ఒక్కోదానికి ఒక్కో బాధ్యతను అప్పచెప్పాలి. దానివల్ల పనులు వేగంగా జరగడమేగాక కొత్త నాయకత్వం
తయారు అవుతుంది.
(చర్చలో ప్రధానంగా పాల్గొన్నవారు
రఫీఖ్, మునీర్ అహ్మద్, డాక్టర్ అతావుర్ రహమాన్ )
11. ఆర్థికం
ఎంటిఎఫ్ కు ఇప్పటి వరకు
ఆర్ధిక ప్రణాళిక లేదు. నగదు నిల్వ ఒక్క రూపాయి కూడ లేకుండా మనం ధైర్యంగా కార్యక్రమాలని
చేపట్టేస్తున్నాము. అయితే, ఏ కార్యక్రమాన్ని చేపట్టినా అవసరమైన నిధులు కాంట్రిబ్యూషన్
రూపంలో సమకూరి పోతున్నాయి. ఇదొక గొప్ప సానుకూలాశం. ఇలా ఎప్పటికప్పుడు అనే గాలిలో దీపం విధంగా కాకుండా ఎంటిఎఫ్ దగ్గర నిరంతరం కొంత నిధి
వుండేలా చూసుకోవాలి. ప్రతి సభ్యుడు నెలనెల కొంత మొత్తం చందాగ ఇవ్వాలి. ముస్లిం సమాజంలోని
సంపన్నులు, వితరణశీలుర నుండి చందాలు వసూలు చేసి ఒక నిధిని ఏర్పాటు చేసుకోవాలి.
(చర్చలో ప్రధానంగా పాల్గొన్నవారు
ఆసిఫుద్దీన్. జహా ఆర, హసన్ షరీఫ్, మునీర్ అహ్మద్ )
12. కొత్త
కన్వీనర్
ఏంటిఎఫ్ ఆవిర్భవించి రెండు
సంవత్సరాలు పూర్తి అయ్యాయి. సంస్థకు వ్యవస్థాపక కన్వీనర్ గా ఏయం ఖాన్ యజ్దానీ (డానీ)
వుంటున్నారు. తన రెండేళ్ళ పదవీ కాలం ముగిసిన కారణంగా కొత్త వారిని కన్వీనర్ గా ఎన్నికోవాలని
డానీ స్వయంగా ప్రతిపాదించారు.
అబ్దుల్ వాహెద్, జహా ఆరా లలో ఒకరు కన్వీనర్
బాధ్యతను స్వీకరిస్తే బాగుంటుందని కూడా డానీ సూచించారు. అయితే, ఆ బాధ్యతను డానీయే మరో రెండేళ్ళు కొనసాగించాలని సమావేశం
ఏకగ్రీవంగా తీర్మానించింది.
(చర్చలో ప్రధానంగా పాల్గొన్నవారు జహా
ఆర, హసన్ షరీఫ్, మునీర్ అహ్మద్, ఆసిఫుద్దీన్. షఫి అహ్మద్, సయ్యద్ రఫి)
Comments
Post a Comment