Posts

సత్యం వాటి మధ్య ఎక్కడో మధ్య వుంది.

సత్యం వాటి మధ్య ఎక్కడో  మధ్య వుంది. ఆంధ్రప్రదేశ్ ముస్లింలు  కేంద్ర ప్రభుత్వాన్ని మార్చాలనుకుంటున్నారని మన కో కన్వీనర్  ఉమర్ ఫారూఖ్ ఖాన్ గట్టిగా అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముస్లింలు రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చాలనుకుంటున్నారని ఇంకో కో కన్వీనర్  సయ్యద్ సాబిర్ హుస్సేన్ అంతే గట్టిగా అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముస్లింలు జనసేన  బీఎస్పి కమ్యూనిస్టు కూటమిని సమర్ధించడమే సరైనదని ఇంకో కో కన్వీనర్  హసన్ షరీఫ్  ఇంకా గట్టిగా అంటున్నారు.

పాత రాజకీయ తీర్మానాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరం వుంది.

మిత్రులారా! మనం ఆశించినట్టు జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ కేంద్రంగా Pre-poll alliance (UPA) ఏర్పడలేదు. రాజకీయాల్లో BJP వ్యతిరేక పార్టీలన్నీ ఎవరికి వారే అనేలా వుంది పరిస్థితి. MTF  పనిచేస్తున్న  రెండు రాష్ట్రాల్లో BJP తప్ప ప్రకటిత NDA  పార్టీలు లేవు.  అలాగే Congress తప్ప ప్రకటిత UPA పార్టీలు కూడా లేవు. విచిత్రంగా Congress, BJPలు  కూడా రెండు రాష్ట్రాల్లో చాలా బలహీనంగా వున్నాయి. మారిన ఈ నేపథ్యంలో మన పాత రాజకీయ తీర్మానాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరం వుంది. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి అసెంబ్లీలో తీర్మానం చేసి KCR  ఒక మంచి సాంప్రదాయానికి నాందీ పలికారు.  ఇది మరొకరికి కూడ ఆదర్శం కావాలంటే మనం TRS ను సమర్ధించడమే సమంజసం అనుకుంటున్నాను. GST, నోట్ల రద్దు నేరుగా ముస్లింల సమస్యలుకావు. రిజర్వేషన్ల పెంపు  ముస్లింల సమస్య. ఈ విషయంలో ఒక సియం అసెంబ్లీలో బిల్లు పాస్ మాత్రమే చేయగలడు. అనుకూల వాతావరణం వచ్చినపుడు పార్లమెంటు దాన్ని షెడ్యూల్ లో చేరుస్తుంది. రాష్ట్రంలో మాత్రం కేసిఆర్ Muslim Friendly  గానే వ్యవహరిస్తున్నారు. జగన్ విషయమూ అంతే. 2014...
Hyderabad 9 March 2019  To Sri YS Jagan Mohana Reddy garu President YSR Congress party Sir, At the outset MTF and its members heart fully congratulate you for your recent historical PRAJA SANKALPA YAATRA and its tremendous success. Sir, You are well aware that the Vijayawada West Assembly constituency has a specialty. It is called the lone constituency of Muslims in the Northern Krishna region of Andhra Pradesh. Muslims have been elected from this constituency for five times since 1972. Asif Pasha, MK Baig, Jalil Khan and Nasar Vali have represented the constituency in the State Legislative Assembly. While Jalil Khan has been twice elected from this constituency, Asif Pasha and MK Baig have served as ministers of the undivided Andhrapradesh. It is well established fact that Indian Muslims were became antagonistic towards Indian National Congress after the demolition of Babri masid in 1992. It is also true that YS Rajasekhara Reddy has played a vital role...
మిత్రులారా! MHPS  ప్రధాన కార్యదర్శి ఫారూఖ్ షుబ్లి    'ముస్లింలకు జనాభా  దామాషా ప్రకారం అసెంబ్లీ సీట్లు కేటాయించాలి' అని కోరుతూ  మార్చి 13, 14 తేదీల్లో విజయవాడ ధర్నా చౌక్ లో రెండు రోజులు నిరాహార దీక్ష చేయ తలపెట్టారు. ఫారూఖ్ షుబ్లి ఈ ఉదయం నాకు ఫోన్ చేసి ఈ  కార్యక్రమానికి MTF  మద్దతు కోరారు.  వారు గతంలో MTF  గురించి దుష్ప్రచారం చేసినట్టు వినివున్నాను. అంచేత వారితో నాకు సన్నిహిత సంబంధాలు ఏమీలేవు. స్వీయసమాజానికి మేలు చేసే కార్యక్రమాన్ని ఎవరు చేపట్టినా నద్దతు పలకడం ఉద్యమకారుల  సాంప్రదాయం. ఆ సాంప్రదాయానికి లోబడి వారి దీక్షకు మద్దతు ఇస్తానని చెప్పాను. ఈ అంశం మీద మీమీ అభిప్రాయాలు చెప్పండి. జగన్ YCP ఇప్పటికి ముస్లింలకు  4 స్థానాలు ప్రకటించింది. ఇంకోస్థానాన్ని ప్రకటించవచ్చు. విజయవాడ వెస్ట్ ను మాత్రం 2014లో BJP  అభ్యర్ధిగా పోటీచేసిన వెలంపల్లి శ్రీనివాసరావుకు కేటాయించింది. టిడిపి ఇప్పటికి ముస్లింలకు  2 స్థానాలు ప్రకటించింది. ఆ పైన ఇస్తుందోలేదో తెలీదు. ఈ నేపథ్యంలో   'ముస్లింలకు జనాభా  దామాషా ప్రకారం అసెంబ్లీ ...

నేను మూడు అంశాలను గమనించాను.

మిత్రులారా ! ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి.  మరో వారం రోజుల్లో  ఈ వేడి మరింత పెరగ వచ్చు. ఆ పరిణామాల మీద ప్రతిరోజూ మన గ్రూపులో చర్చిస్తూ వుండండి. దీన్ని ఒక యాక్టివిటీగా మార్చండి. నేను మూడు అంశాలను గమనించాను. 1. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కేంద్రంగా సాగుతున్న రాజకీయాలు ఆసక్తికరంగా వున్నాయి.  వాళ్ళు ఆశిస్తున్న ప్రయోజనాలు ఏమైనప్పటికీ, వాటిల్లో,  బిజెపిని తొలగించాలనే అంశం ముస్లింలకు  అనుకూలమైనది.  2. ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టి నాయకులు చంద్రబాబు జాతీయ స్థాయిలో బిజెపి వ్యతిరేక ప్రచారాన్ని వుధృతంగా సాగిస్తున్నారు.  విధానపరంగా అవి ముస్లింలకు చాలా అనుకూలం. ఫుల్వాన ఘటన మీద చంద్రబాబు చేసిన కామెంట్ సాధారణమైనది కాదు. బిజెపితో చావో రేవో తేల్చుకోవడానికి వారు సిధ్ధమయ్యారు. అయితే, రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగం అస్సలు పనిచేయడంలేదు. అధికారుల అవినీతి, అవినీతి ప్రజలు చంద్రబాబు మీద తీవ్ర అసంతృప్తితో వున్నారు. 3. అధికార పార్టీ మీద ప్రజలకున్న అసంతృప్తి ప్రధాన ప్రతిపక్షమైన జగన్ కు అనుకూలంగా మారింది. ముస్లింలతో సహా అనేక సామాజికవర్గాలు జగన్...

Fight against communal forces and support UPA and allied parties

Fight against communal forces and support UPA and allied parties హైదరాబాద్ 25 జనవరి 2019 మిత్రులారా ! వచ్చే జమిలి ఎన్నికల్లో నరేంద్ర మోదీ - అమిత్ షా , ఎన్డీయే కూటమి , సంఘపరివారం , ఆడానీ - అంబానీలతో కూడిన మతతత్వ   కేంద్ర ప్రభుత్వాన్ని ఓడించడం దేశంలోని ప్రజాస్వామికవాదులు , ఉదారవాదులు , మతసామరస్యవాదులు , సామ్యవాదులు , సౌమ్యవాదులు , మానవ హక్కులు- పౌరహక్కుల వాదుల ప్రధాన కర్తవ్యం . సరిగ్గా ఇదే లక్ష్యంతో ఈ కర్తవ్య నిర్వహణ కోసం ఏకం అవుతున్న రాజకీయ పక్షాలను ( ఈ కూటమి పేరు ఇప్పుడు యూపిఏ కావచ్చు రేపు ప్రజాకూటమి కావచ్చు లేదా మరొకటిగా మారవచ్చు ) సమర్ధించడం ద్వారానే మనం మన చారిత్రక కర్తవ్యాన్ని నిర్వర్తించగలం .   ఈ శిబిరాల్లో ఏఏ పార్టీలున్నాయి , వాటితో మన వ్యక్తిగత empirical అనుభవాలు ఏమీటీ అనేది ఇప్పుడు అంతగా పట్టించుకోవాల్సిన అంశాలుకావు . వాటిల్లో కొన్ని పార్టీలతో వ్యక్తిగత empirical అనుభవాలు మనల్ని బాధించి, వేధించి కూడా వుండవచ్చు. వ్యక్తిగత empirical అనుభవాలను మాత్రమే ప్రధానంగా భావించేవాళ్ళు ఎన్నడూ...

BC-E Vs EBC

BC-E Vs EBC ముస్లిం సమాజంలో కులాలు లేవని మనం గొప్పగా అనుకున్నప్పటికీ రిజర్వేషన్లు అనేవి భారత రాజ్యాంగం ప్రకారం కుల ప్రాతిపదిక మీద మాత్రమే కల్పిస్తారు. దీనినే సాంస్కృతిక అణివేత అంటారు. ముస్లిం సమాజంలో సాంస్కృతిక వివక్ష వుందనే నిర్ధారణ మీదనే BC-E  ఏర్పడిందనేది ముందుగా మనం గమనించాలి. ఇదొక కీలమైన చట్ట సంబంధ వ్యవహారం. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతంవున్న ముస్లిం రిజర్వేషన్లలో  సయ్యద్, పఠాన్, మీర్జా, బేగ్ తదితర 'కులాలకు' మినహాయింపు నిచ్చారు. వాళ్లను చట్టం ముస్లిం సమాజంలో అగ్రకులాలుగా పరిగణించింది. మిగిలిన 14 +2  కులాలను BC జాబితాలో చేర్చారు.  ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అగ్రకుల  పేదలకు EBCగా గుర్తించి రిజర్వేషన్ కల్పించింది. .  చట్టంలో మత ప్రస్తావన తెచ్చారో లేదో నాకు తెలీదు. తేకపోతే మాత్రం  బహుశ ముస్లిం 'అగ్రకులాలు' కూడా దీనివల్ల లబ్దిపొందవచ్చు. ఇందులో అంతర్గత చిక్కులు కొన్ని వున్నాయి. చట్తం మీద అవగాహన లేకపోవడంవల్ల కొంత, వ్యక్తిగత స్వార్ధాలవల్ల కొంత,  ముస్లిం సమాజం ఈ రిజర్వేషన్ల మూలంగా ఒకవైపు లబ్దిపొందుతూనే మరోవైపు అంతర్గత తగవుల్లో ఇబ్బందులు ప...