BC-E Vs EBC

BC-E Vs EBC

ముస్లిం సమాజంలో కులాలు లేవని మనం గొప్పగా అనుకున్నప్పటికీ రిజర్వేషన్లు అనేవి భారత రాజ్యాంగం ప్రకారం కుల ప్రాతిపదిక మీద మాత్రమే కల్పిస్తారు. దీనినే సాంస్కృతిక అణివేత అంటారు. ముస్లిం సమాజంలో సాంస్కృతిక వివక్ష వుందనే నిర్ధారణ మీదనే BC-E  ఏర్పడిందనేది ముందుగా మనం గమనించాలి. ఇదొక కీలమైన చట్ట సంబంధ వ్యవహారం.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతంవున్న ముస్లిం రిజర్వేషన్లలో  సయ్యద్, పఠాన్, మీర్జా, బేగ్ తదితర 'కులాలకు' మినహాయింపు నిచ్చారు. వాళ్లను చట్టం ముస్లిం సమాజంలో అగ్రకులాలుగా పరిగణించింది. మిగిలిన 14 +2  కులాలను BC జాబితాలో చేర్చారు.

 ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అగ్రకుల  పేదలకు EBCగా గుర్తించి రిజర్వేషన్ కల్పించింది. .  చట్టంలో మత ప్రస్తావన తెచ్చారో లేదో నాకు తెలీదు. తేకపోతే మాత్రం  బహుశ ముస్లిం 'అగ్రకులాలు' కూడా దీనివల్ల లబ్దిపొందవచ్చు.

ఇందులో అంతర్గత చిక్కులు కొన్ని వున్నాయి. చట్తం మీద అవగాహన లేకపోవడంవల్ల కొంత, వ్యక్తిగత స్వార్ధాలవల్ల కొంత,  ముస్లిం సమాజం ఈ రిజర్వేషన్ల మూలంగా ఒకవైపు లబ్దిపొందుతూనే మరోవైపు అంతర్గత తగవుల్లో ఇబ్బందులు పడుతోంది.

ఆ వివరాలు ఇంకోసారి చర్చిద్దాము. 

Comments

Popular posts from this blog

*జిల్లాల్లోని ప్రధాన సమస్యల్ని పోస్టు చేయండి*

Crusades - 1095–1291

Ahmad Khan - French Revolution