పాత రాజకీయ తీర్మానాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరం వుంది.
మిత్రులారా!
మనం ఆశించినట్టు జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ కేంద్రంగా Pre-poll alliance (UPA) ఏర్పడలేదు. రాజకీయాల్లో BJP వ్యతిరేక పార్టీలన్నీ ఎవరికి వారే అనేలా వుంది పరిస్థితి.
MTF పనిచేస్తున్న రెండు రాష్ట్రాల్లో BJP తప్ప ప్రకటిత NDA పార్టీలు లేవు. అలాగే Congress తప్ప ప్రకటిత UPA పార్టీలు కూడా లేవు. విచిత్రంగా Congress, BJPలు కూడా రెండు రాష్ట్రాల్లో చాలా బలహీనంగా వున్నాయి.
మారిన ఈ నేపథ్యంలో మన పాత రాజకీయ తీర్మానాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరం వుంది.
ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి అసెంబ్లీలో తీర్మానం చేసి KCR ఒక మంచి సాంప్రదాయానికి నాందీ పలికారు. ఇది మరొకరికి కూడ ఆదర్శం కావాలంటే మనం TRS ను సమర్ధించడమే సమంజసం అనుకుంటున్నాను.
GST, నోట్ల రద్దు నేరుగా ముస్లింల సమస్యలుకావు. రిజర్వేషన్ల పెంపు ముస్లింల సమస్య. ఈ విషయంలో ఒక సియం అసెంబ్లీలో బిల్లు పాస్ మాత్రమే చేయగలడు. అనుకూల వాతావరణం వచ్చినపుడు పార్లమెంటు దాన్ని షెడ్యూల్ లో చేరుస్తుంది.
రాష్ట్రంలో మాత్రం కేసిఆర్ Muslim Friendly గానే వ్యవహరిస్తున్నారు.
జగన్ విషయమూ అంతే. 2014లో ముస్లింలకు ఆయనే సీట్లు ఎక్కువ ఇచ్చాడు. ఇప్పుడు ఇవ్వవచ్చు. ఆ విషయం రేపే తేలిపోతుంది. కేంద్రంలో ముస్లింల విషయంలో మోదీని సమర్ధించడమూ లేదు విమర్శీంచడమూ లేదు.
అలాగే చంద్రబాబు వ్యవహారం. బాహాటంగా నరేంద్ర మోదీని అన్ని విషయాల్లోనూ విమర్శిస్తున్నారు. కానీ, రాష్ట్రంలో Muslim Friendlyగా వ్యవహరించడంలేదు.
KCR, JAGAN, BABU లలో ఇలాంటి ద్వంద్వం వుండడం వల్లనే చిక్కుముడులు ఏర్పడుతున్నాయి.
రాష్ట్రాల్లో ఏ పార్టీ ఉన్నా కేంద్రంలో బీజేపీ ఉండకూడదు అని కొందరు ముస్లిం ఆలోచనాపరులు మాత్రమే అనుకుంటున్నారు. సాధారణ ముస్లింలు అలా అనుకోవడంలేదు. నిజానికి KCR, Jagan జాతీయ రాజకీయాల్లో తటస్తులు. Congress, TDP ఇప్పుడు బాహాటంగా BJP వ్యతిరేకులు. మీరు అన్నదే నిజం అయితే మనం Comgress, TDP లను సమర్ధించాలి. ముస్లిం సమాజం అందుకు సిధ్ధంగా వున్నట్టు లేదు. దానికి ఇప్పుడు చట్ట్అ సభల్లో ప్రాతినిధ్యం పెరగాలి.
ఎన్నికల ఫలితాలు ఎలా వుంటాయో మనం చెప్పలేం. స్వీయసమాజం ఒకే తాటి మీద ఒకే మాట మీద వుంటే అది వేరే విషయం. ఇప్పుడు అలా లేదు. మనం రాజకీయ పార్టీలను నియంత్రించనూ లేము. స్వీయ సమాజాన్ని అదేశించనూ లేము. సారాంశంలో ఈ ఎన్నికల్లో మన పాత్ర నామమాత్రం.
ఈ దశలో ఒక్క బిజేపి తప్ప ఇతర పార్టీలు ఏవైనా సరే ముస్లింలకు టిక్కెట్టు ఇస్తే చాలు వాళ్లను గెలిపించుకోవడమే మన విధానంగా వుండాలి. ఓకే నియోజకవర్గంలో ఇద్దరు ముస్లింలు పోటీ పడితే కొన్ని సవాళ్లు వస్తాయి. వాటి గురించి అప్పుడు ఆలోచిద్దాము.
1. తెలంగాణలో మళ్ళీ TRS కే మద్దతు పలుకుదామా? మార్పులు ఏవైనా వున్నాయా?
APలో రేపటికి టిక్కెట్ల వ్యవహారం తేలిపోతుంది.
ముస్లిం సమాజంలో సహితం అత్యధికులు బాబును నమ్మడం లేదు.
2. TDP, YCP లలో ఎవరు ఎక్కువ సీట్లు ఇస్తే వారికే MTF పక్షాన మద్దతు ప్రకటిద్దామా?
ఇవి విధాన వ్యవహారాలు కనుక అందరూ తమ తమ అభిప్రాయాలను చెప్పండి.
Yes / No అనవద్దు. ఎవరికి మద్దతు ఇవ్వాలో స్పష్టంగా చెప్పండి.
- డానీ

Comments
Post a Comment