Fight against communal forces and support UPA and allied parties


Fight against communal forces and support UPA and allied parties

హైదరాబాద్
25 జనవరి 2019

మిత్రులారా !

వచ్చే జమిలి ఎన్నికల్లో నరేంద్ర మోదీ - అమిత్ షా, ఎన్డీయే కూటమి, సంఘపరివారం, ఆడానీ-అంబానీలతో కూడిన మతతత్వ  కేంద్ర ప్రభుత్వాన్ని ఓడించడం దేశంలోని ప్రజాస్వామికవాదులు, ఉదారవాదులు, మతసామరస్యవాదులు, సామ్యవాదులు, సౌమ్యవాదులు, మానవ హక్కులు- పౌరహక్కుల వాదుల ప్రధాన కర్తవ్యం.

సరిగ్గా ఇదే లక్ష్యంతో కర్తవ్య నిర్వహణ కోసం ఏకం అవుతున్న రాజకీయ పక్షాలను (ఈ కూటమి పేరు ఇప్పుడు యూపిఏ కావచ్చు రేపు ప్రజాకూటమి కావచ్చు లేదా మరొకటిగా మారవచ్చు) సమర్ధించడం ద్వారానే మనం మన చారిత్రక కర్తవ్యాన్ని నిర్వర్తించగలం. 

శిబిరాల్లో ఏఏ పార్టీలున్నాయి, వాటితో మన వ్యక్తిగత empirical అనుభవాలు ఏమీటీ అనేది ఇప్పుడు అంతగా పట్టించుకోవాల్సిన అంశాలుకావు. వాటిల్లో కొన్ని పార్టీలతో వ్యక్తిగత empirical అనుభవాలు మనల్ని బాధించి, వేధించి కూడా వుండవచ్చు. వ్యక్తిగత empirical అనుభవాలను మాత్రమే ప్రధానంగా భావించేవాళ్ళు ఎన్నడూ ప్రధాన శత్రువును ఎదుర్కోలేరు.

          ఒక పెద్ద శత్రువును ఎదుర్కోవాల్సి వచ్చినపుడు చిన్న శత్రువులందరితో కలిసి పని చేయడమే కార్యసాధనకు అవసరమైన వివేకం.  పశ్చిమ బెంగాల్ లో తృణాముల్ కాంగ్రెస్, కాంగ్రెస్ ప్రధాన శత్రు పక్షాలు, ఉత్తర ప్రదేశ్ లో SP-BSP  వైరి వర్గాలు. అవన్నీ తమ మధ్య సాగుతున్న స్వల్ప స్పర్ధల్ని పక్కన పెట్టి కొత్త వివేకంతో ఒకే వేదిక మీది వస్తున్న సందర్భం ఇది.

రెండు శిబిరాలు కాకుండా   మూడు  నాలుగు పార్టీలు విడిగా ఫెడరల్ ఫ్రంట్ అంటూ ఏర్పడే ప్రయత్నాల్లో వున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు  సంభంధించినంత వరకు YCP ఇందులో లాంఛనంగా చేరే ప్రయత్నాల్లో వుంది.   

కూటమి పేరు ఏదైనా మూడు  నాలుగు పార్టీల లక్ష్యం ప్రత్యక్షంగానో పరోక్షంగానో NDA  వ్యతిరేక శిబిరాన్ని బలహీనపరచడం. తద్వార NDA  శిబిరాన్ని పరిరక్షించడం. నేపథ్యంలో మనం ఫెడరల్ ఫ్రంట్ ను కూడా వ్యతిరేకించాల్సి వుంటుంది. అందులో ఏమాత్రం సందేహం, భావోద్వేగం  అక్కరలేదు.

ఏపిలో ఇప్పటి రాజకీయ వాతావరణంలో జగన్ ను సమర్ధించినా కొన్ని అపవాదులు వస్తాయి. చంద్రబాబును సమర్ధించినా కొన్ని అపవాదులు వస్తాయి. చారిత్రక నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొన్ని నిందలు ఎలాగూ వస్తాయి. వాటికి భయపడి నిర్ణయాలను వాయిదా వేయకూడదు. రక్షణాత్మక వ్యూహాలు ఎన్నడూ గెలుపును ఇవ్వవు. తెగబడితేనే విజయమో వీరస్వర్గమో తేలిపోతుంది.

స్వీయసమాజపు విశాల ప్రయోజనాలకన్నా తాము కొనసాగుతున్న పార్టీల మీద అభిమానమే తమకు ముఖ్యమనుకునేవారు కూడా మనలో వుంటారు. ఒక సంస్థ ఒక చారిత్రక నిర్ణయం తీసుకున్నప్పుడు సహజంగానే కొన్ని కూడికలు కొన్ని తీసివేతలు వుంటాయి. ధర్మ నిర్ణయంలో తీసివేతలకన్నా కూడికలే ఎక్కువగా వుంటాయి.

మనం ఎన్నడూ ముస్లిం ప్రయోజనాలకు మాత్రమే పరిమితం కాకూడదు. దేశప్రయోజనాల కోసం పాటుబడుతూ ముస్లిం ప్రయోజనాలను కూడ సాధించుకోవాలి.

ప్రజాస్వామ్యంలో ప్రజలు నేరుగా యుధ్ధం చేయరు. రెండు  శత్రు శిబిరాలు తలపడుతుంటే చిన్న శత్రువుల పక్షాన నిలబడి పెద్ద శత్రువుల ఓటమిని నిర్ణయిస్తారు. శత్రులందర్నీ ఒకేసారి ఓడించాలనుకోవడం ఒక ఆదర్శమేగానీ, ఆచరణ సాధ్యంకాదు. యుధ్ధంలో గెలుపోటములు ఒకరి చేతుల్లో వుండవు. ఎవరి మీద? ఎందుకు? ఎంతగా? పోరాడుతున్నామన్నదే కీలకం.

అంశం మీద మీ అభిప్రాయాలు తెలుపండి. చర్చను కొనసాగించండి.

.యం. ఖాన్ యజ్దానీ (డానీ)
కన్వీనర్, ముస్లిం ఆలోచనాపరుల వేదిక.

Comments

Popular posts from this blog

*జిల్లాల్లోని ప్రధాన సమస్యల్ని పోస్టు చేయండి*

Crusades - 1095–1291

Ahmad Khan - French Revolution