మిత్రులారా!
MHPS  ప్రధాన కార్యదర్శి ఫారూఖ్ షుబ్లి    'ముస్లింలకు జనాభా  దామాషా ప్రకారం అసెంబ్లీ సీట్లు కేటాయించాలి' అని కోరుతూ  మార్చి 13, 14 తేదీల్లో విజయవాడ ధర్నా చౌక్ లో రెండు రోజులు నిరాహార దీక్ష చేయ తలపెట్టారు.

ఫారూఖ్ షుబ్లి ఈ ఉదయం నాకు ఫోన్ చేసి ఈ  కార్యక్రమానికి MTF  మద్దతు కోరారు.  వారు గతంలో MTF  గురించి దుష్ప్రచారం చేసినట్టు వినివున్నాను. అంచేత వారితో నాకు సన్నిహిత సంబంధాలు ఏమీలేవు.

స్వీయసమాజానికి మేలు చేసే కార్యక్రమాన్ని ఎవరు చేపట్టినా నద్దతు పలకడం ఉద్యమకారుల  సాంప్రదాయం. ఆ సాంప్రదాయానికి లోబడి వారి దీక్షకు మద్దతు ఇస్తానని చెప్పాను.

ఈ అంశం మీద మీమీ అభిప్రాయాలు చెప్పండి.
జగన్ YCP ఇప్పటికి ముస్లింలకు  4 స్థానాలు ప్రకటించింది. ఇంకోస్థానాన్ని ప్రకటించవచ్చు. విజయవాడ వెస్ట్ ను మాత్రం 2014లో BJP  అభ్యర్ధిగా పోటీచేసిన వెలంపల్లి శ్రీనివాసరావుకు కేటాయించింది.

టిడిపి ఇప్పటికి ముస్లింలకు  2 స్థానాలు ప్రకటించింది. ఆ పైన ఇస్తుందోలేదో తెలీదు.

ఈ నేపథ్యంలో   'ముస్లింలకు జనాభా  దామాషా ప్రకారం అసెంబ్లీ సీట్లు కేటాయించాలి'  అనే అంశం మీద ఉద్యమం చేయడం  సరైనదే అని నేను భావిస్తున్నాను. దానికి MTF  మద్దతు పలకడం అవసరం అనుకుంటున్నాను.

ముస్లింలలో కూడా రెండు లోపాలున్నాయి.  మొదటిది, చివరి నిముషంలో టిక్కెట్టు కావాలని వస్తున్నారు. రెండోది, అవసరమైన ఆర్ధిక వనరుల్ని సమకూర్చుకోలేక పోతున్నారు.

ఎన్నికలకు నాలుగేళ్ళు ముందే తమకు అనువైన ఒక ప్రధాన రాజకీయ పార్టీలో చేరి, తరచూ సామాజిక కార్యక్రమాలు చేపడుతూ, మీడియాలో కనిపిస్తూ పార్టి అధినేతకు విధేయులుగా వుంటూ తాము టిక్కెట్టును ఆశిస్తున్నట్టు aspirant  సంకేతాలు ఇస్తుండాలి.  ఎమ్మెల్యే అభ్యర్ధికి  కావలసిన 30 కోట్ల రూపాయలు, ఎంపీ అభ్యర్ధికి  కావలసిన 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే స్తోమత తమకు వుందని ప్రకటించ గలగాలి.  అలాంటి వాళ్లకు మాత్రమే తుది జాబితాలో స్థానం దక్కుతుంది. 

Comments

Popular posts from this blog

*జిల్లాల్లోని ప్రధాన సమస్యల్ని పోస్టు చేయండి*

Crusades - 1095–1291

Telangana State Backward Classes List