నేను మూడు అంశాలను గమనించాను.

మిత్రులారా !

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి.  మరో వారం రోజుల్లో  ఈ వేడి మరింత పెరగ వచ్చు. ఆ పరిణామాల మీద ప్రతిరోజూ మన గ్రూపులో చర్చిస్తూ వుండండి. దీన్ని ఒక యాక్టివిటీగా మార్చండి.

నేను మూడు అంశాలను గమనించాను.

1.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కేంద్రంగా సాగుతున్న రాజకీయాలు ఆసక్తికరంగా వున్నాయి.  వాళ్ళు ఆశిస్తున్న ప్రయోజనాలు ఏమైనప్పటికీ, వాటిల్లో,  బిజెపిని తొలగించాలనే అంశం ముస్లింలకు  అనుకూలమైనది. 

2.
ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టి నాయకులు చంద్రబాబు జాతీయ స్థాయిలో బిజెపి వ్యతిరేక ప్రచారాన్ని వుధృతంగా సాగిస్తున్నారు.  విధానపరంగా అవి ముస్లింలకు చాలా అనుకూలం. ఫుల్వాన ఘటన మీద చంద్రబాబు చేసిన కామెంట్ సాధారణమైనది కాదు. బిజెపితో చావో రేవో తేల్చుకోవడానికి వారు సిధ్ధమయ్యారు. అయితే, రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగం అస్సలు పనిచేయడంలేదు. అధికారుల అవినీతి, అవినీతి ప్రజలు చంద్రబాబు మీద తీవ్ర అసంతృప్తితో వున్నారు.

3.
అధికార పార్టీ మీద ప్రజలకున్న అసంతృప్తి ప్రధాన ప్రతిపక్షమైన జగన్ కు అనుకూలంగా మారింది. ముస్లింలతో సహా అనేక సామాజికవర్గాలు జగన్ ను
సమర్ధిస్తున్నాయి. అయితే, జాతీయ రాజకీయాల్లో జగన్ విధానాలు ముస్లింలకు సంబంధించినంత వరకు చాలా ప్రమాదకరమైనవి. రాష్ట్రంలో జగన్ పూర్తిగా  నరేంద్ర మోదీ అనుకూల విధానాలను అనుసరిస్తున్నారు.  ఇటీవలి ప్రధాని రాష్ట్ర పర్యటన, బెంగాల్ లో సిబిఐ వివాదం సందర్భంగా జగన్ - మోది అనుబంధం మరింత స్పష్టంగా కనిపించింది.

4.
ముస్లిం సమాజపు ధోరణుల్ని గమనిస్తుంటే నిజంగానే భయం వేస్తోంది. జాతీయ పౌరసత్వ నమోదు, గోగ్రవాదం. మూకోన్మాదం, సమస్త రంగాల నుండి ముస్లింల వెలివేత, ప్రతి సందర్భంలోనూ దోషులుగా చిత్రించడం, మత మైనార్టీల హక్కుల్ని  గౌరవించడం అటుంచి నిరంతరం నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవాల్సిన స్థితిలో వుంచడం, ఆస్తుల అపహరణ వంటి ప్రాణప్రద అంశాలను ఆలోచనాపరులు సహితం పట్టించుకోవడంలేదు. ముస్లిం రచయితల్లో ఎక్కువ మంది తమ పుస్తకాలను ప్రమోట్ చేసుకునే పనుల్లో మాత్రమే వున్నారు.  ఆ రచనల్లో పై ప్రమాదాలు మనకు కనిపించవు. ఒకళ్ళిద్దరు భిన్నంగా వున్నారంటే అది మహత్తర విషయమే.  సామాన్య ముస్లింలకు వీటి ఊసే లేదు. ఎన్నికల ప్రక్రియ ఆరంభం అయిపోయింది గాబట్టి  వాళ్ళు అధికార పార్టి ప్రధాన  ప్రతిపక్ష పార్టీల మధ్య విడిపోయారు. వీళ్లను తప్పుపట్టలేం వాళ్ల రోజువారి అవసరాలు అలాంటివి. కొందరికి పార్టి అభిమానాలు కూడా వుంటాయి.  వాటిని మనం కాదనలేం.
అయితే, మనలో  ప్రమాదకరవర్గం ఒకటి తయారు అవుతోంది. కొందరు ముఠాలుగా తయారయ్యి  అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు ముస్లిం ఓట్లను కట్టబెట్టే కాంట్రాక్టరు పనులు చేస్తున్నారు. వీటి మధ్య డబ్బు, వైరాలు  దాడులు చేసుకునే వరకూ  వెళుతున్నాయి. ముస్లింల మీద జరిగే దాడుల్ని, అత్యాచారాల్ని  పోలీసు కేసుల వరకు వెళ్లకుండా ఈ ముఠాలు సెటిల్మెంట్లు చేస్తున్నాయి.

Comments

Popular posts from this blog

*జిల్లాల్లోని ప్రధాన సమస్యల్ని పోస్టు చేయండి*

Crusades - 1095–1291

Ahmad Khan - French Revolution