Posts

సభలు ప్లాన్ చేయాలి. తేదీలను చర్చించి నిర్ణయించండి.

మిత్రులారా! నా ఆరోగ్యం ఇంకా కుదుట పడలేదు. నిన్నటి నుండి కొద్దిగా  సెమీ సాలిడ్ డైట్ తీసుకుంటున్నాను. చాలా నీరసంగా వుంది. కశ్మీర్ సమస్య మీద మాట్లాడడానికి అనేక మంది పిలుస్తున్నారు. నేను చాలా నిస్సత్తువతో వున్నాను. ఐదు రోజుల క్రితం ధైర్యం చేసి ఒక టివీ కార్యక్రమానికి వెళ్ళాను. ఆ తరువాత  జబ్బు తిరగబడింది.  ప్రాణవాయువు సరిపోక చాలా ఇబ్బందిగా వుంటోంది. మంగళగిరి సభకు వెళ్లలేదు. చాలా బాధగా అనిపించింది. రేపు ఆదివారం హైదరాబాద్ సభకు వస్తానని మాటిచ్చాను. అప్పటికి కోలుకుంటానని నమ్ముతున్నాను. సోమవారం  ఫుల్ బాడీ చెకప్ చేయించాను. ఒక శుభవార్త ఏమంటే నా శరీరంలో లంగ్స్ (COPD), ప్రాంకియాసిస్ (డయాబెటిక్) తప్ప మిగిలిన అన్ని అవయవాలు పూర్తి ఆరోగ్యంతో వున్నాయట. సెప్టెంబరు 8 విజయవాడ సభ చాలా ప్రతిష్టాత్మకమైనది. అందులో నేను ఒక్కడ్నే  వక్తను. తమ్మినేని వీరభద్రంగారు అధ్యక్షులు. విమలక్క, గోరటి వెంకన్న గాయకులు. ప్రస్తుతం నేను దానికి సిధ్ధం అవుతున్నాను. హైదరాబాద్, ఖమ్మం, అనంతపురం, తూర్పు గోదావరి, విశాఖపట్నంలలో మనం సభలు ప్లాన్ చేయాలి. తేదీలను చర్చించి నిర్ణయించండి. విజయవాడ సభ తరువాత కడప ...

Subject : సంస్థాగత క్రమశిక్షణ

హైదరాబాద్ 3 ఆగస్టు 2019 అస్సలామ్ అలైకుమ్, MTF గ్రూపులోని మిత్రులందరికీ, Subject : సంస్థాగత క్రమశిక్షణ వివిధ అంశాలపై  MTF  అవగాహన మీద గానీ, MTF  చేపడుతున్న కార్యక్రమాల మీద గానీ. MTF సంస్థాగత నిర్మాణం మీదగాని మీలో కొందరికి అభ్యంతరాలు,  అసమ్మతి వుండవచ్చు. భిన్నాభిప్రాయాల్ని MTF  స్వాగతిస్తుంది. మనది ప్రజాస్వామిక సంస్థ. మీ అభిప్రాయాలు, సూచనలు, అసమ్మతులు తెలపడానికి, మీ ప్రజాస్వామిక హక్కుల్ని ప్రయోగించడానికి  కార్యవర్గ సమావేశాల్ని, సర్వసభ్యసమావేశాల్ని వినియోగించుకోండి. ప్రజాస్వామిక హక్కుకు కూడ ఒక పరిమితి వుంటుంది. కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే వరకే ఎవరికయినా  తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అవకాశం వుంటుంది. ఒక నిర్ణయం జరిగాక దాన్ని మెజారిటీ సభ్యులేగాక మైనారిటీ సభ్యులు సహితం ఆమోదించి ఆచరించాల్సి వుంటుంది. కార్యవర్గ సమావేశం చేసిన నిర్ణయాలను సహితం తిరగదోడే అవకాశం సభ్యులకు వుంటుంది. కానీ, ఆ పనిని మరో కార్యవర్గ సమావేశంలో మాత్రమే  చేయాల్సి వుంటుంది.  ఈలోపు, సంస్థ కార్యకలాపాల మీద సోషల్ మీడియాలోగానీ, ఇతర బహిరంగ  వేదికల మీదగాని వ్య...

సంస్థకు చెడ్డపేరు తేవద్దు

హైదరాబాద్ 2 ఆగస్టు 2019 మిత్రులారా ! అస్సలాం అలైకుమ్ ! విషయం - సంస్థకు చెడ్డపేరు తేవద్దు మన గ్రూపులో కొందరు వున్నారు.   వారెన్నడూ MTF   కోసం సమయాన్ని వెచ్చించిందీ లేదు. సంస్థ కోసం పని చేసిందీలేదు. కానీ ఇతరుల దగ్గర సంస్థ విధానాలనూ, సంస్థ   బాధ్యుల ఇమేజ్ ను నైతికంగా దెబ్బ తీసే ప్రయత్నాలు చేస్తున్నారు.   MTF   మేధో సరోవరంగా వుంటూ క్షేత్ర స్థాయిలో   పనిచేయడానికి కొన్ని సంఘాలను ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని కూడ కొందరు సంఘం బయట విమర్శిస్తున్నట్టు   నా దృష్టికి వచ్చింది. విధాన నిర్ణయాలు చేసే సమయంలో చర్చించే అవకాశం అందరికీ వుంటుంది. నిర్ణయం తీసుకున్నాక దానికి వ్యతిరేకంగా బయట మాట్లాడడం క్రమశిక్షణా రాహిత్యం అవుతుంది. అలాంటి వాళ్ళను ఉపేక్షించ కూడదు. నేను సాధారణంగా ఎవరినైనా రెండుసార్లు తప్పుల్ని మన్నిస్తాను. సరిదిద్దుకోమంటాను. మూడోసారి అలా మన్నించను. క్రమశిక్షణ   తెలికైపోకూడదు.   ప్రధాన స్రవంతి మీడియా ప్రధాన స్రవంతి సేవలకే పరిమితం అయిపోయాక సామాన్యుల భావాలను సహితం ప్రసారం చేయడానికి   సోషల్ మీడియా పుట్టింది. అయితే, సోషల్ మ...

July 2019 Contributions & Expenses

July 2019 Contributions & Expenses Contribution After 15 June Executive Body Meeting 1.    Kalida Parwin Baji (for 10 Months)                       Rs. 5000 2.    Umar Farooq Khan                 Rs. 1000 (For June & July) 3.    Hasan Sharief - July                Rs. 500 4.    Jaha Ara – July                        Rs. 500 5.    Hussen Shake – July               Rs. 500 6.    Dr. Atavur Rahman               Rs. 5000 Total                      ...

Next Target AP Muslim Educational Society

విజయవాడ 30 జులై 2019 మిత్రులారా ! MTF స్వీయ సమాజానికి దిశానిర్దేశం చేసే మేధోసరోవరంగా వుంటూ క్షేత్రస్థాయిలో కార్యచరణ సంఘాలను ఏర్పాటుకు కృషి చేయాలని మన జూన్ 15 నాటి విస్తృత కార్యవర్గంలో తీర్మానం చేసుకున్నాము.   నిన్న విజయవాడలో జరిగిన ముస్లిం సంకల్ప సభ నిర్వహణ భారాన్ని Muslim JAC కన్వీనర్ షేక్ మునీర్ అహ్మద్ మరికొందరు భరించగా,   MTF మేధోసరోవరంగా పనిచేసింది.   ఈ సభలోనే ఏపి వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కమిటి (APWPPC) ఆవిర్భవించింది. దీనితో MTF లక్ష్యాల్లో ఒకటి నెరవేరింది. ఇక మన తదుపరి లక్ష్యం విద్యారంగం.   AP Muslim Educational Societyని ఏర్పాటు చేయాలి. రెండు మూడు నెలల్లో మరో ముస్లిం సంకల్ప సభను నిర్వహించి AP Muslim Educational Society ఏర్పాటు చేయాలి. ఇలాంటి సభలకు రూ. 40 వేల నుండి రూ. 50 వేల వరకు ఖర్చు అవుతుంది. భరించ గలిగే జిల్లా యూనిట్ ఏదైనా వుందా? లేకుంటే దాన్ని కూడా విజయవాడలోనే జరపాల్సి వుంటుంది. అందరూ స్పందించండి. మీ డానీ

Extended Executive Committee Meeting 15 June 2019

Muslim Thinkers Forum (MTF) Extended Executive Committee Meeting 15 June 2019, Saturday, 10 a.m. to 5 p.m. @ Advocate Khalilulla’s Office, Behind Museum Governorpet, Vijayawada ప్రధాన తీర్మానాలు 1.            కార్యక్షేత్రం పరిథి పరిమితి – సామాన్య ప్రజలు ఎంటిఎఫ్ లక్ష్యం సామాన్య ముస్లింల అభ్యున్నతి. ఎంటిఎఫ్ కార్యక్షేత్రం మేధోరంగం. ఎంటిఎఫ్ సాగించే మేధోమధనం ఆలోచనల స్థాయి, పారిభాషిక పదాల   ప్రయోగం ఎప్పుడూ వున్నతంగా వుండాలి. మన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవడానికి సమాజ, మానవాభివృధ్ధి, తాత్విక, చరిత్ర, రాజకీయార్థిక, వాణిజ్యం వంటి హ్యుమానిటీస్   శాస్త్రాలతో పాటూ వివిధ విజ్ఞాన శాస్త్రాల్లో వస్తున్న కొత్త పరిణామాల్ని సహితం ఎంటిఎఫ్ సభ్యులు గమనిస్తూ వుండాలి. అనుక్షణం అప్డేట్ అవుతూ ముస్లిమేతర ఆలోచనాపరుల కన్నా ఎంటిఎఫ్ ఎప్పుడూ   మేధోమధనంలో ముందుండాలి. ఎన్నడూ ఎట్టి పరిస్థితులలోనూ ఫేక్ న్యుస్ ప్రచారంలో ఎంటిఎఫ్ సభ్యులు భాగస్వాములు కావద్దు. ఒకటికి రెండుసార్లు పున ఃపరిశీలన చేసుకున్న తరువాతే ఇతరుల పోస్టింగ్స్ ...

గాంధీ నుండి మోదీ వరకు

గాంధీ నుండి మోదీ వరకు నరేంద్ర మోది – అమిత్ షాలను భారత రాజకీయాల్లో ఏ పార్టీ కూడ ఎదుర్కొనే పరిస్థితి ఇప్పుడు లేదు. ఇన్ స్టాంట్ ట్రిబుల్ తలాక్ బిల్లును వైసిపి లోక్ సభలో సమర్ధించనూ లేదు; తిరస్కరించనూ లేదు. ఓటింగుకు దూరంగా వుండిపోయింది. టీఎంసి కూడ ఆపనే చేసింది. ఇదొక రకం తటస్థవైఖరి. కాంగ్రెస్ ఒక్కటే అడ్డుకున్నది. మితిష్ కుమార్ నాయకత్వంలోని జేడియు కూడా బిల్లుకు దూరాన్ని పాటించింది. పాకిస్తాన్ లో మైనారిటీలయిన హిందువుల కోసం, భారత దేశంలో మైనారిటీలయిన ముస్లింల కోసం తాను నిలబడతాను అన్నందుకు గాంధీని హత్య చేశారు. ఇప్పుడు అలాంటి ప్రకటనలు చేసి చావును కొని తెచ్చుకునేవారు భారత రాజకీయాల్లో లేరు. ముస్లింల మీద ఏమాత్రం   సానుభూతిని చూపినా రాజకీయాల నుండి తప్పుకోవాల్సిన వాతావరణం దేశంలో వుంక్దని మనం గమనించాలి.   జగన్ ను అయినా, మరో పార్టీని అయినా అనేక పరిమితులవల్ల వాళ్ళు చేయలేని పనుల్ని మనం అడగక పోవడమే మంచిది. మనం పెద్ద పెద్ద కోరికలు కోరడం మానేసి చిన్నచిన్న కోరికలు అడగడం మంచిదేమీ అనిపిస్తోంది.