సంస్థకు చెడ్డపేరు తేవద్దు
హైదరాబాద్
2
ఆగస్టు 2019
మిత్రులారా
!
అస్సలాం
అలైకుమ్ !
విషయం - సంస్థకు చెడ్డపేరు తేవద్దు
మన
గ్రూపులో కొందరు వున్నారు. వారెన్నడూ
MTF కోసం సమయాన్ని వెచ్చించిందీ లేదు. సంస్థ
కోసం పని చేసిందీలేదు. కానీ ఇతరుల దగ్గర సంస్థ విధానాలనూ, సంస్థ బాధ్యుల ఇమేజ్ ను నైతికంగా దెబ్బ తీసే ప్రయత్నాలు
చేస్తున్నారు.
MTF మేధో సరోవరంగా వుంటూ క్షేత్ర స్థాయిలో పనిచేయడానికి కొన్ని సంఘాలను ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని
కూడ కొందరు సంఘం బయట విమర్శిస్తున్నట్టు నా
దృష్టికి వచ్చింది. విధాన నిర్ణయాలు చేసే సమయంలో చర్చించే అవకాశం అందరికీ వుంటుంది.
నిర్ణయం తీసుకున్నాక దానికి వ్యతిరేకంగా బయట మాట్లాడడం క్రమశిక్షణా రాహిత్యం అవుతుంది.
అలాంటి వాళ్ళను ఉపేక్షించ కూడదు.
నేను
సాధారణంగా ఎవరినైనా రెండుసార్లు తప్పుల్ని మన్నిస్తాను. సరిదిద్దుకోమంటాను. మూడోసారి
అలా మన్నించను. క్రమశిక్షణ తెలికైపోకూడదు.
ప్రధాన
స్రవంతి మీడియా ప్రధాన స్రవంతి సేవలకే పరిమితం అయిపోయాక సామాన్యుల భావాలను సహితం ప్రసారం
చేయడానికి సోషల్ మీడియా పుట్టింది. అయితే,
సోషల్ మీడియా తెచ్చిన చెడు కూడా వుంది. బాధ్యతా రహితంగా నోటికి ఏది తోస్తే అది వాగేసే
సంస్కృతిని సోషల్ మీడియా నేర్పింది.
అసలు
ముస్లిం సమాజంలో ఎన్ని రకాల విడాకుల విధానాలున్నాయో ముస్లింలలోనే చాలా మందికి తెలీదు. వాటి పేర్లేమిటో, ఒక్కొక్కదాన్ని ఎలా పాటిస్తారో తెలిసినవాళ్ళు చాలా
తక్కువ మంది.
ఏ
తప్పూ చేయక పోయినా మేకలపై దాడి చేయడానికి తోడేళ్ళు సిధ్ధంగా వున్నప్పుడు మేకలు తప్పులు
చేస్తే ఎలా?
వాట్స్
అప్ తలాక్ లు మొదలు కాగానే అవి ఖురాన్, హదీస్, షరియాలకు పూర్తిగా వ్యతిరేకమని ముస్లిం
పర్సనల్ లా బోర్డు ఎందుకు ఫత్వా జారీచేయలేదు. దానికి ఎక్కువ ప్రచారం ఎందుకు కల్పించలేదూ?
తలాక్
మంజూరు కావడానికి అనుసరించాల్సిన సుదీర్ఘ ప్రక్రియ గురించి షాయిరా బానో కేసు సుప్రీం
కోర్టుకు వెళ్ళడానికి ముందే ముస్లిం సమాజానికి ఎందుకు అవగాహన కలిగించలేదు.
తలాక్
కు బాధితులు ప్రధానంగా మహిళలు అనే అంశాన్ని ముస్లిం సమాజం ఎందుకు గుర్తించడంలేదు?.
ఎంత సేపూ పురుషుల గురించే ఎందుకు మాట్లాడుతోంది.
ముస్లిం
సమాజాన్ని వాళ్ళు ఎలాగూ అనాగరీకులు అనదలిచారు.
ముస్లిం సమాజం కూడ దానికి దోహదం చేస్తున్నది. ఒక విధంగా వారు కోరుకున్నదే మనం
చేసి పెడుతున్నాము.
ఇక
యాసీన్ సంగతి. యువకుడైన అతన్ని నేను చాలా ప్రోత్సహించాను. గుంటూరు జిల్లాలో మరి కొందరి సీనియర్లు వున్నప్పటికి
బాధ్యతలు అప్పచెప్పాను. అతనూ బాగానే చేశాడు. మెచ్చుకున్నాను కూడ. కానీ ఆలోచనా రంగంలో
అతనిది ఏమాత్రం పరిపక్వత లేని దుందుడుకుతనం. గతంలో రెండుసార్లు మన్నించాను. ఒకటి అడిగితే
ఇంకేదో సమాధానం చెపుతారు.
తక్షణ
ట్రిపుల్ తలాక్ ఇచ్చేవారికి మూడేళ్ళ జైలు శిక్ష విధిస్తూ చట్టం తెచ్చినందుకు ప్రధాని
నరేంద్ర మోదీని విమర్శించాలి. విపక్షాలను అడ్డమైన
పధ్ధతుల్లో లోబరచుకున్నందుకు అమిత్ షాను విమర్శించాలి. బిజేపికి లొంగిపోయినందుకు విపక్షాలను విమర్శించాలి. ఇవన్నీ వదిలిపెట్టి దాన్ని కవర్ చేసిన పత్రికాధిపతిని "రాధాకృష్ణ! నీకు టైమ్ దగ్గర పడింది ఒక్కటి నిజం
ఉండదు, అసలు తలా ఖ్ కు గురుంచి ఇంత నిర్లక్ష్యం గా రాస్తావా? చీ చీ , షరియా అల్లాహ్
ది దీనికి రక్షణ ఆయనే, షరియాత్ లో ఎవరు ఎలు పెట్టిన వారి నాశనం తధ్యం....!!” అని పోస్టు పెట్టిన వ్యక్తి మానసిక స్థితి ఏమిటీ?
పత్రికాధిపతుల్ని
“నీకు టైమ్ దగ్గర పడింది” అని హెచ్చరించడం MTF విధానానికి విరుధ్ధం. ఇంతకీ రాధాకృష్ణ ముస్లిం షరియాలో
వేలుపెట్టారా? ఇతనే గత వారం సయ్యదుల్ని భార్త
దేశం వదిలి పొమ్మనే అర్థం వచ్చేలా పోస్టు పెట్టారు. నాలుగు రోజుల తరువాత నా దృష్టికి
వస్తే దాన్ని వెనక్కి తీయించాను. ఈ వారం ఇంకో పోస్టు. చురుకైన కార్యకర్త కావచ్చుగానీ
ఇతనికి మానసిక పరిపక్వత లేదు. వారానికో తప్పును ఎలా భరించేదీ? ఫోన్ చేసి అడిగితే ఏదో
వంకర సమాధానం చెప్పారు.
యాసిన్
ఒక్కరే కాదు. మరి కొందరు వున్నారు. తమకు తోచింది మాట్లాడేయడం. నిలదీసి అడిగితే అవమానంగా
భావించడం, తిక్కతిక్క సమాధానాలు చెప్పడం. ఒక పరిపక్వత లేకుండా మాట్లాడేవాళ్ళు, సంస్థ మీద, సంస్థ విధానాల మీద గౌరవం లేనోళ్ళు MTF లో మనకు వద్దు.
రాశి తక్కువైనా
మనకు వాసి ముఖ్యం.
జజకల్ల్హా
ఖైర్.
మీ
డానీ
Comments
Post a Comment