Subject : సంస్థాగత క్రమశిక్షణ
హైదరాబాద్
3 ఆగస్టు 2019
అస్సలామ్ అలైకుమ్,
MTF గ్రూపులోని మిత్రులందరికీ,
Subject : సంస్థాగత క్రమశిక్షణ
వివిధ అంశాలపై MTF అవగాహన మీద గానీ, MTF చేపడుతున్న కార్యక్రమాల మీద గానీ. MTF సంస్థాగత నిర్మాణం మీదగాని మీలో కొందరికి అభ్యంతరాలు, అసమ్మతి వుండవచ్చు. భిన్నాభిప్రాయాల్ని MTF స్వాగతిస్తుంది. మనది ప్రజాస్వామిక సంస్థ.
మీ అభిప్రాయాలు, సూచనలు, అసమ్మతులు తెలపడానికి, మీ ప్రజాస్వామిక హక్కుల్ని ప్రయోగించడానికి కార్యవర్గ సమావేశాల్ని, సర్వసభ్యసమావేశాల్ని వినియోగించుకోండి.
ప్రజాస్వామిక హక్కుకు కూడ ఒక పరిమితి వుంటుంది. కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే వరకే ఎవరికయినా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అవకాశం వుంటుంది. ఒక నిర్ణయం జరిగాక దాన్ని మెజారిటీ సభ్యులేగాక మైనారిటీ సభ్యులు సహితం ఆమోదించి ఆచరించాల్సి వుంటుంది.
కార్యవర్గ సమావేశం చేసిన నిర్ణయాలను సహితం తిరగదోడే అవకాశం సభ్యులకు వుంటుంది. కానీ, ఆ పనిని మరో కార్యవర్గ సమావేశంలో మాత్రమే చేయాల్సి వుంటుంది. ఈలోపు, సంస్థ కార్యకలాపాల మీద సోషల్ మీడియాలోగానీ, ఇతర బహిరంగ వేదికల మీదగాని వ్యతిరేక వ్యాఖ్యానాలు చేసే హక్కు ఎవరికీ లేదు. అలాంటి పనులు ఎవరు చేసినా అది క్రమశిక్షణ రాహిత్యం అవుతుంది. వ్యక్తివాద బాధ్యతా రాహిత్యపు సంస్కృతిని సోషల్ మీడియా బాగా ప్రోత్సహిస్తోంది. అలాంటి పనులు ఎవరు చేసినా సంస్థాగతంగా చర్యలు తీసుకోవాల్సి వుంటుంది.
ఇదేమీ MTF కొత్త నిబంధన కాదు. ఫ్రెంచ్ విప్లవ కాలం నుండి ప్రజాస్వామిక సంస్థలన్నీ పాటిస్తున్న విలువలే ఇవి.
అనుక్షణం మనది ఒక ఆలోచనాపరుల వేదిక అనే స్పృహతో వుండండి. చిల్లర ప్రవర్తనను ఇక్కడికి తేవద్దు. ముస్లిం సమాజంలో కొత్త ప్రజాస్వామిక విలువల్ని ఎలా ప్రవేశపెట్టగలమో ఆలోచించండి.
అభినందనలతో
జజకల్ల్హా ఖైర్
మీ
డానీ

Comments
Post a Comment