Posts

Showing posts from September, 2017

I Support Right for the Freedom of expression of Both Iliah and Vyshyas

ఐలయ్య, వైశ్యుల  భావ ప్రకటన స్వేఛ్ఛ హక్కును  గౌరవిస్తాను Sabareeish Gupta ముస్లిం సమాజం అందరూ తీవ్రవాదులు అని కంచె ఐలయ్య గారు బుక్ రాస్తే మీరు సమర్థిస్తారా సర్. ఆయన రచనలు అందరినీ కలపడానికి ఉపయోగపడాలి. కొట్టుకోడానికి కాదు.. Danny ఒకవేళ నీరు చెప్పినట్టే - ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెఫర్డ్  -    "ముస్లిం సమాజంలో అందరూ తీవ్రవాదులు"  అని రాస్తే నేను సమర్ధించను. వారి అభిప్రాయాలు నిరాధారమైనవని వివరిస్తూ, నిరూపిస్తూ,  అంతకన్నా తీవ్రంగా విమర్శిస్తూ ఇంకో  పుస్తకం రాస్తాను.  అప్పుడు కూడా ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెఫర్డ్ భావ ప్రకటన స్వేఛ్ఛ హక్కును నేను  గౌరవిస్తాను. ఒకవేళ ఐలయ్యగారు చట్టాన్ని వుల్లంఘించారని నేను భావిస్తే  న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాను. కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ భౌతిక దాడులకు పాల్పడవద్దని ముస్లిం సమాజాన్ని హెచ్చరిస్తాను. అయినా కొందరు  ముస్లిం ఆవేశపరులు వారి మీద దాడిచేస్తే నేను ఆ దాడుల్ని తప్పక ఖండిస్తాను.  ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెఫర్డ్ కు సానుభూతిని ప్రకటిస్తాను. ఇప్పుడు నేను వైశ్య సామాజికవర్గాన్ని సూచిస్తున్నది కూడా అ...

Row over Kancha Ilaiah book

28-09-2017 ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెఫర్డ్  భావప్రకటనా స్వేఛ్ఛకు మద్దతుగా  బహిరంగసభ 2 p.m. 3rd October 2017 సుందరయ్య విజ్ఞాన కేంద్రం Hyderabad అందరూ ఆహ్వానితులే ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెఫర్డ్ మీద జరుగుతున్న దాడులకు నిరసనగా బహిరంగసభ 2 p.m. 3rd October 2017 సుందరయ్య విజ్ఞాన కేంద్రం Hyderabad అందరూ ఆహ్వానితులే భావప్రకటన స్వేఛ్ఛను ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెఫర్డ్  దుర్వినియోగం చేశారనేవారు న్యాయస్థానాల్ని ఆశ్రయించవచ్చు. నేను వాళ్ళ హక్కునూ సమర్ధిస్తాను. Anwar ఇరు వైపుల సమర్ధించడమే కాదు సర్ , తప్పొప్పులు కూడా మీలాంటి వాళ్ళు చెప్పాల్సిందే Danny ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెఫర్డ్  రాసిన 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళు' పుస్తకం 'హిందూమతానంతర భారత దేశం' అనే పెద్ద పుస్తకంలో ఒక అధ్యాయం.  ఇస్లాంకు వ్యతిరేకంగా  శామ్యూల్ పీ హంటింగ్ టన్  1997లో రాసిన  “క్లాస్ ఆఫ్ ద సివిలైజేషన్ అండ్ ద మేకింగ్ ఆఫ్ వరల్డ్ ఆర్డర్’ పుస్తకం ప్రభావం ఐలయ్యగారి పుస్తకంపై కనిపిస్తోంది. అదలా వుంచితే,  ఈ చిన్ని పుస్తకంలో  అనేక పరస్పర విరుధ్ధమైన అంశాలున్నాయి. కొన్ని అంశాలు భారత ముస్...

Razakar Memories and Political Motives - Dr. A Sunitha

Razakar Memories  and Political Motives  రజాకార్ల జ్ఞాపకాలు రాజకీయ ప్రయోజనాలు 22-09-2017 04:06:09 http://www.andhrajyothy.com/artical?SID=467367 1947–1948 మధ్య రాజ్యేతర సాయుధ బలగాలు అన్నివైపులా తమ తమ పోరాటాల పేరుతో హింసకి పాల్పడ్డాయి. రాజ్యేతర సాయుధ బలగాలన్నీ ప్రమాదభరితమే అయినప్పుడు కేవలం రజాకార్ల హింస గురించే అప్పుడూ, ఇప్పుడూ ఎక్కువగా రాశారు. సులువనేగా? హైదరాబాదు రాజ్యాన్ని భారత దేశంలో కలిపిన తీరుని ఇరుకు జాతీయవాద పరిధి నుండి బయటకి తెచ్చి అది విలీనమా, విమోచనమా లేక విద్రోహమా అన్న సందిగ్ధాన్ని 2009లో మొదలయిన తెలంగాణ రాష్ట్ర పోరాట సందర్భం లేవనెత్తింది. ప్రజాస్వామిక తెలంగాణ కోరే వారందరూ విద్రోహంతో మొదలయ్యి నెమ్మదిగా విలీనమే అన్న వాదనకి రాజీ పడితే, విమోచన వాదానికి దాసోహం అయిన వారు ఒక పట్టాన దాన్ని వదలలేక పోతున్నారు. తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తికి ప్రతీకలయిన భూస్వామ్య వ్యతిరేక తెలంగాణ సాయుధ పోరాటం, నక్సలైటు ఉద్యమాలని పక్కన పెట్టేసి, హైదరాబాదు రాజ్యంలో 1947–1948 మధ్య జరిగిన నిజాం ప్రభుత్వ వ్యతిరేక పోరాటంపై, ఆ సమయంలో రజాకార్లని వ్యతిరేకించిన తీరుపై మన దృష్టిని కేంద్రీకరించా...

రోహింగ్యాలు అక్రమ వలసదారులే: రాజ్‌నాథ్‌

వారు శరణార్థులు కాదు Sakshi | Updated: September 22, 2017 01:29 (IST) వారు శరణార్థులు కాదు రోహింగ్యాలు అక్రమ వలసదారులే: రాజ్‌నాథ్‌ న్యూఢిల్లీ: రోహింగ్యాలు శరణార్థులు కారని, వారు అక్రమ వలసదారులని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. రోహింగ్యాలు దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించారని, వారిని తప్పనిసరిగా వెనక్కి పంపించేయాలన్నారు. గురువారం ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) నిర్వహించిన సదస్సులో రాజ్‌నాథ్‌ ప్రసంగించారు. రోహింగ్యాలను తమ దేశం తీసుకెళ్లేందుకు మయన్మార్‌ సిద్ధంగా ఉందని, అయినా మనదేశం నుంచి వారిని వెనక్కి పంపించే ప్రయత్నాలను కొందరు వ్యతిరేకించడం తగదని చెప్పారు. ‘రోహింగ్యాలకు సంబంధించి కేంద్ర హోం శాఖ తమ వైఖరిని అఫిడవిట్‌ ద్వారా సుప్రీం కోర్టుకు సమర్పించింది. వారు అక్రమ వలసదారులు. శరణార్థులు కారు. వారిని వెనక్కి పంపిస్తాం. శరణార్థి హోదా పొందా లంటే ఒక నిర్దిష్టమైన ప్రక్రియను అనుసరిం చాలి. కానీ వీరు దానిని అనుసరించలేదు’ అని చెప్పారు. రోహింగ్యాలు ఎవరికీ భారత్‌లో ఆశ్రయం కల్పించే అవకాశం లేదని, ఎందుకంటే వారు అక్రమ వలసదారులని స్పష్టం చేశారు. వీరిని వెనక...

Hyderabad RT Meeting

హైదరాబాద్ రౌండ్ టేబుల్ సమావేశం మత అల్పసంఖ్యాక వర్గాలు, దళితులు, ఆదివాసులు, బలహీనవర్గాలపై దాడుల్ని ఖండించండి ! ముస్లీం ఆలోచనాపరుల వేదిక హైదరాబాద్ రౌండ్ టేబుల్ సమావేశం 3 సెప్టెంబరు 2017 ఆదివారం, ఉదయం 10 గంటల నుండి షోయబుల్లా హాల్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్ అందరూ ఆహ్వానితులే. -         ఊ. సాంబశివరావు, సామాజిక ఉద్యమాల సిధ్ధాంతవేత్త -         డా. పసునూరి రవీందర్, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహిత -         డా. సూరేపల్లి సుజాత, శాతవాహన యూనివర్శిటీ -         డా . జిలుకర శ్రీనివాస్ మహరాజ్ , సాహిత్య పరిశోధకులు -         డా . అరుణ గోగులమండ , యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ -         డా. నూకతోటి రవికుమార్, ప్రధాన కార్యదర్శి, బహుజన రచయితల వేదిక -         డా. మెర్సీ మార్గరేట్, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్...