I Support Right for the Freedom of expression of Both Iliah and Vyshyas
ఐలయ్య, వైశ్యుల భావ ప్రకటన స్వేఛ్ఛ హక్కును గౌరవిస్తాను
Sabareeish Gupta
ముస్లిం సమాజం అందరూ తీవ్రవాదులు అని కంచె ఐలయ్య గారు బుక్ రాస్తే మీరు సమర్థిస్తారా సర్. ఆయన రచనలు అందరినీ కలపడానికి ఉపయోగపడాలి. కొట్టుకోడానికి కాదు..
Danny
ఒకవేళ నీరు చెప్పినట్టే - ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెఫర్డ్ - "ముస్లిం సమాజంలో అందరూ తీవ్రవాదులు" అని రాస్తే నేను సమర్ధించను. వారి అభిప్రాయాలు నిరాధారమైనవని వివరిస్తూ, నిరూపిస్తూ, అంతకన్నా తీవ్రంగా విమర్శిస్తూ ఇంకో పుస్తకం రాస్తాను. అప్పుడు కూడా ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెఫర్డ్ భావ ప్రకటన స్వేఛ్ఛ హక్కును నేను గౌరవిస్తాను. ఒకవేళ ఐలయ్యగారు చట్టాన్ని వుల్లంఘించారని నేను భావిస్తే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాను. కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ భౌతిక దాడులకు పాల్పడవద్దని ముస్లిం సమాజాన్ని హెచ్చరిస్తాను. అయినా కొందరు ముస్లిం ఆవేశపరులు వారి మీద దాడిచేస్తే నేను ఆ దాడుల్ని తప్పక ఖండిస్తాను. ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెఫర్డ్ కు సానుభూతిని ప్రకటిస్తాను.
ఇప్పుడు నేను వైశ్య సామాజికవర్గాన్ని సూచిస్తున్నది కూడా అదే. ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెఫర్డ్ 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళూ' పుస్తకంలో రాసిన అంశాలు మీకు నచ్చకపోతే అవి నిరాధారమైనవని వివరిస్తూ, నిరూపిస్తూ, అంతకన్నా తీవ్రంగా విమర్శిస్తూ పుస్తకాలు రాయండి. కానీ, ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెఫర్డ్ భావ ప్రకటన స్వేఛ్ఛ హక్కును గౌరవించండి. ఒకవేళ ఐలయ్యగారు చట్టాన్ని వుల్లంఘించారని మీరు భావిస్తే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించండి. అంతేతప్ప, భౌతిక దాడులకు పాల్పడవద్దు. అలా మీలో ఎవరయినా చేస్తే నేను ఆ దాడుల్ని తప్పక ఖండిస్తాను. ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెఫర్డ్ కు సానుభూతిని ప్రకటిస్తాను.

Comments
Post a Comment