Hyderabad RT Meeting

హైదరాబాద్ రౌండ్ టేబుల్ సమావేశం


మత అల్పసంఖ్యాక వర్గాలు, దళితులు, ఆదివాసులు, బలహీనవర్గాలపై దాడుల్ని ఖండించండి!
ముస్లీం ఆలోచనాపరుల వేదిక
హైదరాబాద్ రౌండ్ టేబుల్ సమావేశం
3 సెప్టెంబరు 2017 ఆదివారం, ఉదయం 10 గంటల నుండి
షోయబుల్లా హాల్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్
అందరూ ఆహ్వానితులే.

-        ఊ. సాంబశివరావు, సామాజిక ఉద్యమాల సిధ్ధాంతవేత్త
-        డా. పసునూరి రవీందర్, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహిత
-        డా. సూరేపల్లి సుజాత, శాతవాహన యూనివర్శిటీ
-        డా. జిలుకర శ్రీనివాస్ మహరాజ్, సాహిత్య పరిశోధకులు
-        డా. అరుణ గోగులమండ , యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్
-        డా. నూకతోటి రవికుమార్, ప్రధాన కార్యదర్శి, బహుజన రచయితల వేదిక
-        డా. మెర్సీ మార్గరేట్, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహిత
-        అబ్దుల్ వాహెద్ , కో-కన్వీనర్, ముస్లీం ఆలోచనాపరుల వేదిక
-        నశ్రీన్ ఖాన్ , కో-కన్వీనర్, ముస్లీం ఆలోచనాపరుల వేదిక
-        డానీ, జాతీయ కన్వీనర్, ముస్లీం ఆలోచనాపరుల వేదిక


నివేదిక

మిత్రులారా!
ఈరోజు హైదరాబాద్ రౌండ్ టేబుల్ సమావేశం మేధో మధనం రీత్య చాలా గొప్పగానూ, నిర్వహణ దృష్ట్యా అసంతృప్తిగానూ సాగింది.

మూడుసార్లు వాయిదాలు వేసి నిర్వహించిన సభ ఇది. నేనూ వాహెద్ తప్ప మన వేదిక సభ్యులెవరూ రాలేదు. కొందరు ఉర్లో లేరు. మరికొందరికి వేరే పనులున్నాయి. వాహెద్ గారూ సకాలంలో స్పందించారు గాబట్టి సరిపోయిందిగానీ లేకపోతే నిజానికి మీటింగు హాలు కూడా సక్రమంగా బుక్ కాలేదు.

సోషల్ మీడియాల్లో అతి ఉత్సాహాన్ని ప్రదర్శించేవాళ్ళు సొసైటీలో అతి నీరసంగా వుంటున్నారు. పది మందిని సమావేశపరచాలంటే వంద మందికి ఆహ్వానం పంపించేస్తేగానీ వచ్చేలా లేరు. ఈ 10:1 నిష్పత్తిని ఇక ముందు జాగ్రత్త గా పాటించాలి.

ఇక భావ సంచయనం విషయంలో హైదరాబాద్ సమావేశం మన వేదిక స్థాయిని పెంచింది. భారత రాజ్యాంగం మత ప్రాతిపదికనే రిజర్వేషన్లు ఇస్తుందనే అంశంతోపాటూ, ద్విజాతి సిధ్ధాంతానికి రాజ్యాంగం అద్దం పట్టిందనే అభిప్రాయమూ బలంగా వచ్చింది. ఆరెస్సెస్ వేసే నిందలకు వందేళ్ళుగా సంజాయిషీ ఇచ్చుకోవడమేతప్ప దాన్ని అదుపుచేసే వ్యూహాన్ని మత అల్పసంఖ్యాక వర్గాలు, దళితులు, ఆదివాసులు, బలహీనవర్గాలు  రూపొందించుకోలేదని సమావేశం అసంతృప్తి వ్యక్తం చేసింది. దాన్ని రూపొందించుకునే ప్రయత్నాన్ని తక్షణం మొదలెట్టాలని నిర్ణయించింది. 2019 ఎన్నికలకు ముందయినా అణగారినవర్గాల ఆత్మగౌరవ యాత్రను నిర్వహించాలనే ప్రతిపాదన వచ్చింది. గోరక్షకుల అరాచకాలను అరికట్టడానికి మానవ రక్షణ దళాలు ఏర్పాటు చేయాలనే సూచన కూడా వచ్చింది.

త్వరలో ఈ అంశాలపై ముస్లిం ఆలోచనాపరుల వేదిక ఒక శిక్షణా తరగతిని నిర్వహిస్తుంది.


-డానీ 

Comments

Popular posts from this blog

*జిల్లాల్లోని ప్రధాన సమస్యల్ని పోస్టు చేయండి*

Crusades - 1095–1291

Ahmad Khan - French Revolution