Row over Kancha Ilaiah book


28-09-2017

ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెఫర్డ్  భావప్రకటనా స్వేఛ్ఛకు మద్దతుగా  బహిరంగసభ
2 p.m. 3rd October 2017 సుందరయ్య విజ్ఞాన కేంద్రం
Hyderabad
అందరూ ఆహ్వానితులే

ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెఫర్డ్ మీద జరుగుతున్న దాడులకు నిరసనగా బహిరంగసభ
2 p.m. 3rd October 2017 సుందరయ్య విజ్ఞాన కేంద్రం
Hyderabad
అందరూ ఆహ్వానితులే

భావప్రకటన స్వేఛ్ఛను ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెఫర్డ్  దుర్వినియోగం చేశారనేవారు న్యాయస్థానాల్ని ఆశ్రయించవచ్చు. నేను వాళ్ళ హక్కునూ సమర్ధిస్తాను.

Anwar
ఇరు వైపుల సమర్ధించడమే కాదు సర్ , తప్పొప్పులు కూడా మీలాంటి వాళ్ళు చెప్పాల్సిందే

Danny
ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెఫర్డ్  రాసిన 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళు' పుస్తకం 'హిందూమతానంతర భారత దేశం' అనే పెద్ద పుస్తకంలో ఒక అధ్యాయం.  ఇస్లాంకు వ్యతిరేకంగా  శామ్యూల్ పీ హంటింగ్ టన్  1997లో రాసిన  “క్లాస్ ఆఫ్ ద సివిలైజేషన్ అండ్ ద మేకింగ్ ఆఫ్ వరల్డ్ ఆర్డర్’ పుస్తకం ప్రభావం ఐలయ్యగారి పుస్తకంపై కనిపిస్తోంది.

అదలా వుంచితే,  ఈ చిన్ని పుస్తకంలో  అనేక పరస్పర విరుధ్ధమైన అంశాలున్నాయి. కొన్ని అంశాలు భారత ముస్లిం సమాజం శ్రేయస్సుకు ఇబ్బందికరమైనవీ వున్నాయి. అయితే, వీటిని ఇప్పుడు ప్రస్తావించడం సరికాదనే అభిప్రాయమూ నాకుంది.

ఈ పుస్తకం విషయంలో మాత్రమేకాక మన విధానాల విషయంలో  నేను త్వరలో MTF  ఒక విస్తృత సమావేశాన్ని నిర్వహించాల్సిన అవసరం వుంది.

మన తాత్కాలిక క్యాంపేయిన్ లు, స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక కార్యక్రమాలు. అంతిమ లక్ష్యాలు మొదలైన ప్రాణప్రదమైన అంశాల మీద మనం ఒక అవగాహనను నిర్దేశించుకోవాలి.  లేకపోతే మనల్ని మనం నడిపించుకోలేక ఇతరులు మనల్ని నడిపించే స్థితి వచ్చేస్తుంది. ఇది టెయిలిజం.

మనం అనుక్షణం స్వతంత్ర ముస్లీం దృక్పథాన్ని ముందుకు పెడుతుండాలి. ఆయా అంశాల మీద కలిసివచ్చే శక్తులతో ఐక్య సంఘటనలు కడుతూ బలపడుతూ వుండాలి.

సభ్యులందరూ స్పందించండి. 

Comments

Popular posts from this blog

MTF - Charter Of Demands for Elections - 2019

*జిల్లాల్లోని ప్రధాన సమస్యల్ని పోస్టు చేయండి*

Muslim programme to confront the ‘Neo Manuism’