Meetings and Two Duties
సభలు - రెండు బాధ్యతలు మిత్రులారా! సంస్థ నిర్వహించే సభలు, సమావేశాలకు హాజరుకావడం సభ్యులందరి బాధ్యత. సభలూ సమావేశాలవల్ల రెండు ప్రయోజనాలుంటాయి. మొదటిది; మన సంస్థ లక్ష్యాలు కార్యక్రమాల గురించి స్వీయ సమాజానికేకాక బయటి ప్రపంచానికి కూడా తెలుస్తుంది. రెండోది; సమావేశాల్లో జరిగే చర్చల ద్వార సభ్యుల అవగాహన స్థాయి పెరుగుతుంది. అందువల్ల, సభలూ, సమావేశాలకు హాజరుకావడం సభ్యులందరి ప్రత్యక్ష బాధ్యత. సభ్యులు నిర్వర్తించాల్సిన పరోక్ష బాధ్యత కూడా వుంది. సెలవు దొరక్కో, అదేరోజు మరో ముఖ్యమైన పని వుండో, ఆరోగ్యం బాగోలేకో కొందరు సభ్యులు కొన్ని సభలు, సమావేశాలకు హాజరు కాలేకపోవచ్చు. అలాంటివాళ్ళు ఒక పని చేయవచ్చు. సభలు, సమావేశాలకు వెళ్ళాలనే ఆసక్తి వుండి డబ్బులు లేక వెళ్లలేకపోతున్న వాళ్ళని మీమీ జిల్లాలో గుర్తించండి. వాళ్లకు టిక్కెట్టు డబ్బులు ఇచ్చి సభలు, సమావేశాలకు పంపించండి. 1980వ దశకంలో నక్సలైటు ఉద్యమంలో ఇలాంటి సాంప్రదాయం వుండేది. నిరుద్యోగులు, పేదవాళ్ళ ప్రయాణ ఖర్చులను ఉద్యోగులు, స్థితిమంతులు పెట్టుకునేవారు. నిజానికి ఇది ఇస్లాం సాంప్రదాయమే. రంజాన్ నెలలో ఉపవాసం వుండలేక...