MTF Vijayawada Round Table Conference 23 July 2017

ముస్లిం ఆలోచనాపరుల వేదిక విజయవాడ సదస్సు సందర్భంగా వచ్చిన సూచనలు -
1. డానీ
- హిందూ ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికి ప్రజల్లో ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక కపట నీతితో వ్యవహరిస్తున్నది.
- సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (LPG) పధ్ధతుల్లో కార్పొరేట్లకు ఊడిగం చేయడం ప్రభుత్వ లక్ష్యంగా వుంది.
- ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చడానికి ప్రజల దృష్టిని మళ్ళించడానికి అది తరచూ ముస్లింలను వివాదంలోనికి లాగుతోంది.
- ట్రిపుల్ తలాఖ్ పేరుతో కొన్నాళ్ళు, బీఫ్ బ్యాన్ పేరుతో కొన్నాళ్ళు ముస్లిం సమాజం మీద అనైతిక దాడులు చేస్తున్నది.
- ముస్లింల మీద సాగుతున్న మూక దాడులు, హత్యల మీద సభ్యసమాజం స్పందించాల్సినంతగా స్పందించడంలేదు.
- ఇలాంటి నేపథ్యంలో తమ జీవికను కాపాడుకోవడం ముస్లింలకు ప్రాధమిక సమస్యగా మారింది.
- బీజేపికి హిందూత్వ అనేది ప్రత్యక్ష సాధనంగా వుంటే, తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో వున్న టిడిపి, టీఆర్ ఎస్ లకు, ప్రతిపక్షాలయిన వైయస్సార్ సిపీ, కాంగ్రెస్ లకు హిందూత్వ అనేది పరోక్ష సాధనంగా వుంది.
- బీజేపి అమతవాద కాంగ్రెస్ అయితే, కాంగ్రెస్ మితవాద బీజేపిగా వుంది.
- ఎన్నికల్లో సంఘ్ పరివార శక్తుల్ని ఓడించడం ముస్లిం సమాజానికి తక్షణ అవసరం అయినప్పటికీ దానికోసం ఎలాంటి వ్యూహాన్ని ఆచరించాలనేది ఇంకా స్పష్టంకాలేదు.
- అలాగే యస్టీ, యస్సీ, నిమ్నకులాలు, మతమైనారిటీ వర్గాల్ని ఏకం చేయాలనే లక్ష్యం వున్నప్పటికే దాన్ని ఎలా సాధించాలనే అంశం మీద ఒక స్పష్టత రావల్సి వుంది.
- ఇది ముస్లింల పొరాటం మాత్రమేకాదు. అణగారిన వర్గాలందరి ఆరాటం.
2. ప్రొఫెసర్ అబ్దుల్ నూర్ బాషా
- ఆరెస్సెస్ అనేది ధార్మిక సంస్థ కాదు రాజకీయ సంస్థ.
- దోపిడీవర్గాన్ని కాపాడడానికి మతాన్ని ఒక సాధనంగా మార్చుకుంది.
- సమాజంలో ప్రజాస్వామిక భావాలు బలపడనంతకాలం ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడజాలదు.
- హిందూమతోన్మాదాన్ని వ్యతిరేకించడం అంటే ముస్లిం మతోన్మాదాన్ని ఆశ్రయించడంకాదు.
-ఏదో ఒక సంఘటన జరిగినపుడు స్పందించడం మాత్రమే చేయకుండా నిరంతరం సమాజాన్ని ప్రజాస్వామీకరణ సాగుతుండాలి.
- మోదీ ది డిస్టార్టెడ్ డెవలప్ మెంట్ .
- అభివృధ్ధిని ప్రచారంచేస్తూ ధనికవర్గాల పెరుగుదలకు తోడ్పడుతున్నాడు.
- భారతదేశాన్ని సూపర్ పవర్ గా మారుస్తాననే ఉన్మాదాన్ని సృస్టిస్తున్నారు.
- నిజానికి ఆయన కార్పొరేట్లను సూపర్ పవర్ గా మారిస్తున్నాడు.
2. ప్రొఫెసర్ (రిటైర్డ్) అమంచర్ల సుబ్రహ్మణ్యం.
- తమ సమాజం మీద జరిగే దాడులను ఖండించడానికే పరిమితంకాకుండా, సమస్త అణగారినవర్గాల ఐక్య సంఘటనను నిర్మించే బాధ్యతను కూడా MTF స్వీకరించాలి.
- ముస్లిం సమాజం ఆత్మరక్షణ ధోరణి నుండి బయటపడి కాశ్మీర్ సమస్యతోసహా ప్రతిదాన్నీ ప్రశ్నించే తత్త్వాన్ని అలవరచుకోవాలి.
- సనాతన ధర్మం వేరు హిందూమతం వేరు.
- సనాతన మతం ధార్మిక మతం. హిందూమతం రాజకీయ మతం.
- మతం వేరు దేశం వేరు, భక్తి వేరు దేశ భక్తి వేరు.
- దేశం అంటే మార్కెట్. దేశభక్తి అంటే మార్కెట్ ను ప్రేమించడం.
- ఒకే దేశం, ఒకే మార్కెట్ , ఒకే పన్ను అనేది బీజేపి నినాదం.
- ఈ నినాదాన్ని బద్దలుగొట్టాలి.
4. జహా ఆరా
- సమాజంలో Culture of impunity పెరిగిపోతోంది.
- అంటే చట్టాన్ని తమ చేతుల్లోనికి తీసుకున్నా తమకు ఏమీ కాదనే భరోసాతో కొందరు (హిందూత్వవాదులు) ప్రవర్తిస్తున్నారు.
- దీనివల్ల సమాజంలో rule of law అంతరించి అరాచకత్వం పెరిగిపోతుంది.
- ఈ అరాచకత్వాన్ని ప్రభుత్వమే పెంచిపోషించడమే ప్రమాదకరం.
- Judaism, Zionism రెండూ ఒకటి కాదు.
- Judaism అంటే ధార్మిక వ్యవహారం. Zionism అంటే వాణీజ్య వ్యాపారం.
- Hinduism, Hindutva కు మధ్య తేడా కూడా అదే.
- మానవ్ సురక్షా కానూన్ (మాసుక) ను తెస్తానని ప్రభుత్వం అంటున్నది. కానీ అది ఇప్పటికీ బిల్లు దశలోనే వుంది. చట్టం కాలేదు.
5. సయ్యద్ రఫీ
- ముస్లింలకు రాజ్యాధికారం, రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా చేయాలనేది BJP లక్ష్యం.
- కేంద్ర కేబినెట్ లో ఒక్క ముస్లిం మంత్రి కూడా లేడు. వున్నవాళ్ళు సహాయ మంత్రులు మాత్రమే. ఏపీ మంత్రి వర్గంలో కూడా ఒక్క ముస్లిం మంత్రి కూడా లేడు.
- BJPని రాజ్యాధికారం నుండి దించడం ముస్లింల రాజకీయ లక్ష్యం కావాలి.
- BJP ని గద్దె దించగల రాజకీయ పార్టీని గానీ, రాజకీయ కూటమినిగానీ ముస్లింలు బలపరచాలి.
- యంఐయం అసదుద్దీన్ ఒవైసీ రాజకీయ ఎత్తుగడలు BJP కి మేలు చేసేలా వున్నాయి..
- ఎన్నికలకు రెండేళ్ల వ్యవధి మాత్రమే వుంది. అణగారిన వర్గాలన్నీ ఏకం కావాలి అనే నినాదంతో ముస్లిం సమాజం ముందుకు సాగాలి.
6. బీ. పరంజ్యోతి
- ఇప్పుడు దేశంలో జరుగుతున్నది మత చర్చకాదు. రాజకీయ చర్చ.
- ఈ దేశంలో అందరూ హిందువులుగా మారినా BJP కి ఇష్టం వుండదు. దానికి ఒక మైనారిటీ శత్రువు కావాలి.
- ఒక్క ముస్లింలు మాత్రమే కాదు యస్సీలు, యస్టీలు కూడా అంబేడ్కర్ దృష్టిలో మైనారిటీలే.
- ముస్లింల మీద కుల ప్రభావం వుంది. వాళ్ళు దళితుల్ని దగ్గరకు తీసుకోలేకపోతున్నారు.
- దళితుల మీద మత ప్రభావం వుంది. వాళ్ళు ముస్లింలతో కలవలేకపోతున్నారు.
- అంబేడ్కర్ కేంద్ర (న్యాయశాఖ) మంత్రి పదవికి రాజీనామా చేసినపుడు నాలు గు అంశాలను ప్రస్తావించాడు. వాటిల్లో కాశ్మీర్ సమస్య ఒకటి. ఆ సమస్యకు ఇప్పటి వరకు అంతకు మించిన పరిషారం లేదు.
- రాజకీయాల్లో మన శత్రువులు ఏకం అవుతున్నారు. మన మిత్రులు విడిపోతున్నారు.
- APలో TDP/ YSRCP లలో ఎవరికి ఓటేసినా BJP కి ఓటేసినట్టే.
- మనం కొత్త ప్రత్యామ్నాయాన్ని వెతకాలి.
- బహుజన శక్తులు ఏకం కావాలి. మరో మార్గంలేదు.
7. Shafi Ahamed Pasha
- ముస్లిం సమాజంలోని అత్యధికులు జమాతుల కింద వున్నారు.
- జమాత్ నేతల ఆదేశాలు అనుమతుల మేరకే వాళ్ళు ఉద్యమాలు, రాజకీయాల్లో పాల్గొంటారు.
- అనేక జమాత్ ల ముఖ్యులకు దునియాదారీకన్నా దీన్ దారీయే ముఖ్యం.
- ఈ కారణంగా ముస్లింలను సామాజిక వుద్యమాల లోనికి క్రియాశీలకంగా తీసుకురాలేకపోతున్నాము.

Comments
Post a Comment