Vijayawada Declaration
MTF Vijayawada Declaration
23rd July 2017
"ముస్లింల మీద దాడుల్ని ఖండించండి"
ముస్లిం ఆలోచనాపరుల వేదిక
దేశంలో ముస్లింలు, దలితుల మీద సాగుతున్న మూక దాడుల్ని ప్రజాస్వామిక వాదులు అందరూ ముక్తకంఠంతో ఖండించాలని ముస్లీం ఆలొచనాపరుల వేదిక విజయవాడలో ఆదివారం నిర్వహించిన సదస్సు కోరింది.
వేదిక కన్వీనర్ ప్రముఖ రచయిత డానీ అధ్యక్షతన
జరిగిన సదస్సులో ప్రొఫెసర్ అబ్దుల్ నూర్ బాషా, రిటైర్డ్ ప్రొఫెసర్ అమంచెర్ల సుబ్రహ్మణ్యం, గీటురాయి సంపాదకులు అబ్దుల్ వాహెద్, అడ్వకేట్ జహా ఆరా, దళిత నేత బి. పరంజ్యోతి తదితరులు ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని వారన్నారు. తమ తప్పిదాల నుండి
దృష్టిని మళ్ళించడానికి ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నదని వారన్నారు. గోరక్షణ దళాల పేరుతో
కొన్ని అరాచకశక్తులు ముస్లింలు, దళితులపై దాడులు చేస్తున్నాయని వక్తలు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలవల్ల నష్టపోతున్నవారందరూ ఏకం కావాలని వారు కోరారు.
ఆగస్టు 6న హిందూపురంలోనూ, 13న సత్తుపల్లిలోనూ దళిత, ముస్లిం ఆలోచనాపరుల సదస్సులు జరుపుతున్నట్టు
డానీ ప్రకటించారు.
ముస్లిం ఆలోచనాపరుల వేదిక విజయవాడ సదస్సు సందర్భంగా వచ్చిన సూచనలు -
1. డానీ
i.
హిందూ ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికి ప్రజల్లో ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టే విధంగా
కేంద్ర ప్రభుత్వం ఒక కపట నీతితో వ్యవహరిస్తున్నది.
ii.
సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (LPG) పధ్ధతుల్లో కార్పొరేట్లకు ఊడిగం చేయడం ప్రభుత్వ లక్ష్యంగా వుంది.
iii.
ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చడానికి ప్రజల దృష్టిని మళ్ళించడానికి అది తరచూ ముస్లింలను వివాదంలోనికి లాగుతోంది.
iv.
ట్రిపుల్ తలాఖ్ పేరుతో కొన్నాళ్ళు, బీఫ్ బ్యాన్ పేరుతో కొన్నాళ్ళు ముస్లిం సమాజం మీద అనైతిక దాడులు చేస్తున్నది.
v.
ముస్లింల మీద సాగుతున్న మూక దాడులు, హత్యల మీద సభ్యసమాజం స్పందించాల్సినంతగా స్పందించడంలేదు.
vi.
ఇలాంటి నేపథ్యంలో తమ జీవికను కాపాడుకోవడం ముస్లింలకు ప్రాధమిక సమస్యగా మారింది.
vii.
బీజేపికి హిందూత్వ అనేది ప్రత్యక్ష సాధనంగా వుంటే, తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో వున్న టిడిపి, టీఆర్ ఎస్ లకు, ప్రతిపక్షాలయిన వైయస్సార్ సిపీ, కాంగ్రెస్ లకు
హిందూత్వ అనేది పరోక్ష సాధనంగా వుంది.
viii.
బీజేపి మతవాద కాంగ్రెస్ అయితే, కాంగ్రెస్ మితవాద
బీజేపిగా వుంది.
ix.
ఎన్నికల్లో సంఘ్ పరివార శక్తుల్ని ఓడించడం ముస్లిం సమాజానికి తక్షణ అవసరం అయినప్పటికీ దానికోసం ఎలాంటి వ్యూహాన్ని ఆచరించాలనేది ఇంకా స్పష్టంకాలేదు.
x.
అలాగే యస్టీ, యస్సీ, నిమ్నకులాలు, మతమైనారిటీ వర్గాల్ని ఏకం చేయాలనే లక్ష్యం వున్నప్పటికే దాన్ని ఎలా సాధించాలనే అంశం మీద ఒక స్పష్టత రావల్సి వుంది.
xi.
ఇది ముస్లింల పొరాటం మాత్రమేకాదు. అణగారిన వర్గాలందరి ఆరాటం.
xii.
భారత రాజకీయాల్లో ఇప్పుడు రెండే ధోరణులున్నాయి. Hard Hindutva - Soft Hindutva.
2.
ప్రొఫెసర్ అబ్దుల్ నూర్ బాషా
i.
ఆరెస్సెస్ అనేది ధార్మిక సంస్థ కాదు రాజకీయ సంస్థ.
ii.
దోపిడీవర్గాన్ని కాపాడానికి మతాన్ని ఒక సాధనంగా మార్చుకుంది.
iii.
సమాజంలో ప్రజాస్వామిక భావాలు బలపడనంతకాలం ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడజాలదు.
iv.
హిందూమతోన్మాదాన్ని వ్యతిరేకించడం అంటే ముస్లిం మతోన్మాదాన్ని ఆశ్రయించడంకాదు.
v.
ఏదో ఒక సంఘటన జరిగినపుడు స్పందించడం మాత్రమే చేయకుండా నిరంతరం సమాజాన్ని ప్రజాస్వామీకరణ సాగుతుండాలి.
vi.
అభివృధ్ధిని ప్రచారంచేస్తూ ధనికవర్గాల పెరుగుదలకు తోడ్పడుతున్నాడు.
vii.
మోదీ ది Distorted డెవలప్ మెంట్ .
viii.
భారతదేశాన్ని సూపర్ పవర్ గా మారుస్తామనే ఉన్మాదాన్ని సృస్టిస్తున్నారు.
ix.
నిజానికి ఆయన కార్పొరేట్లను సూపర్ పవర్ గా మారుస్తున్నాడు.
3.
ప్రొఫెసర్ (రిటైర్డ్) అమంచర్ల సుబ్రహ్మణ్యం.
i.
తమ సమాజం మీద జరిగే దాడులను ఖండించడానికే పరిమితంకాకుండా, సమస్త అణగారినవర్గాల ఐక్య సంఘటనను నిర్మించే బాధ్యతను కూడా MTF
స్వీకరించాలి.
ii.
ముస్లిం సమాజం ఆత్మరక్షణ ధోరణి నుండి బయటపడి కాశ్మీర్ సమస్యతోసహా ప్రతిదాన్నీ ప్రశ్నించే తత్త్వాన్ని అలవరచుకోవాలి.
iii.
సనాతన ధర్మం వేరు హిందూమతం వేరు.
iv.
సనాతన మతం ధార్మిక మతం. హిందూమతం రాజకీయ మతం.
v.
మతం వేరు దేశం వేరు, భక్తి వేరు దేశ భక్తి వేరు.
vi.
దేశం అంటే మార్కెట్. దేశభక్తి అంటే
మార్కెట్ ను ప్రేమించడం.
vii.
ఒకే దేశం, ఒకే మార్కెట్ , ఒకే పన్ను అనేది బీజేపి నినాదం.
viii.
ఈ నినాదాన్ని బద్దలుగొట్టాలి.
ix.
హిందూ అనేది మతం అని నిరూపించడం గతంలో కష్టంగా వుండేది. పురాణాల్లో
హిందుమతం, హిందువులు అనే ప్రస్తావన లేదు. ఒక ప్రామాణిక గ్రధంలేదు.
x.
ఇప్పుడు హిందూత్వ అంటే ముస్లిం వ్యతిరేక సామాజికవర్గాలు అని తేల్చేశారు.
xi.
హిందూత్వ అనేది క్రైస్తవానికి కూడా వ్యతిరేకమయినది కాదు.
కేవలం ముస్లింలకు వుతిరేకమైది.
4.
జహా ఆరా
i.
సమాజంలో Culture of impunity పెరిగిపోతోంది.
ii.
అంటే చట్టాన్ని తమ చేతుల్లోనికి తీసుకున్నా తమకు ఏమీ కాదనే
భరోసాతో కొందరు (హిందూత్వవాదులు) ప్రవర్తిస్తున్నారు.
iii.
దీనివల్ల సమాజంలో rule of law అంతరించి అరాచకత్వం పెరిగిపోతుంది.
iv.
ఈ అరాచకత్వాన్ని ప్రభుత్వమే పెంచిపోషించడమే ప్రమాదకరం.
v.
Judaism, Zionism రెండూ ఒకటి కాదు.
vi.
Judaism అంటే ధార్మిక వ్యవహారం. Zionism అంటే వాణీజ్య వ్యాపారం.
vii.
Hinduism, Hindutva కు మధ్య తేడా కూడా అదే.
viii.
మానవ్ సురక్షా కానూన్ (మాసుక) ను తెస్తానని ప్రభుత్వం అంటున్నది. కానీ అది ఇప్పటికీ బిల్లు దశలోనే వుంది. చట్టం కాలేదు.
5. సయ్యద్ రఫీ
i.
ముస్లింలకు రాజ్యాధికారం, రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా చేయాలనేది BJP లక్ష్యం.
ii.
కేంద్ర కేబినెట్ లో ఒక్క ముస్లిం మంత్రి కూడా లేడు. వున్నవాళ్ళు సహాయ మంత్రులు మాత్రమే. ఏపీ మంత్రి వర్గంలో కూడా ఒక్క ముస్లిం మంత్రి కూడా లేడు.
iii.
BJPని రాజ్యాధికారం నుండి దించడం ముస్లింల రాజకీయ లక్ష్యం కావాలి.
iv.
BJP ని గద్దె దించగల రాజకీయ పార్టీని గానీ, రాజకీయ కూటమినిగానీ ముస్లింలు బలపరచాలి.
v.
యంఐయం అసదుద్దీన్ ఒవైసీ రాజకీయ ఎత్తుగడలు BJP కి మేలు చేసేలా వున్నాయి.
vi.
ఎన్నికలకు రెండేళ్ల వ్యవధి మాత్రమే వుంది. అణగారిన వర్గాలన్నీ ఏకం కావాలి అనే నినాదంతో ముస్లిం సమాజం ముందుకు సాగాలి.
6.
బీ. పరంజ్యోతి
i.
ఇప్పుడు దేశంలో జరుగుతున్నది మత చర్చకాదు. రాజకీయ చర్చ.
ii.
ఈ దేశంలో అందరూ హిందువులుగా మారినా BJP కి ఇష్టం వుండదు. దానికి ఒక మైనారిటీ శత్రువు కావాలి.
iii.
ఒక్క ముస్లింలు మాత్రమే కాదు యస్సీలు, యస్టీలు కూడా అంబేడ్కర్ దృష్టిలో మైనారిటీలే.
iv.
ముస్లింల మీద కుల ప్రభావం వుంది. వాళ్ళు దళితుల్ని దగ్గరకు తీసుకోలేకపోతున్నారు.
v.
దళితుల మీద మత ప్రభావం వుంది. వాళ్ళు ముస్లింలతో
కలవలేకపోతున్నారు.
vi.
అంబేడ్కర్ కేంద్ర (న్యాయశాఖ) మంత్రి పదవికి రాజీనామా చేసినపుడు నాలు గు అంశాలను ప్రస్తావించాడు. వాటిల్లో కాశ్మీర్ సమస్య ఒకటి. ఆ సమస్యకు ఇప్పటి వరకు అంతకు మించిన పరిషారం లేదు.
vii.
రాజకీయాల్లో మన శత్రువులు ఏకం అవుతున్నారు. మన మిత్రులు విడిపోతున్నారు.
viii. APలో TDP/ YSRCP లలో ఎవరికి ఓటేసినా BJP కి ఓటేసినట్టే.
ix.
మనం కొత్త ప్రత్యామ్నాయాన్ని వెతకాలి.
x.
బహుజన శక్తులు ఏకం కావాలి. మరో మార్గంలేదు.
ఈరోజు విజయవాడలో జరిగినంతటి మేధోమధనం గతంలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ జరగలేదు. స్పీకర్లు ఒకరిని మించి మరొకరు కొత్త కోణల్ని ఆవిష్కరించారు.
vijayawada
Declaration
విజయవాడ ప్రకటన
ముస్లింల మనుగడ, అస్థిత్వం అనేది వర్తమాన సమాజంలో ప్రధానంగా రాజకీయ సమస్య. అన్ని కాలాల్లోనూ ముస్లింల మీద
ఆర్ధిక, సాంస్కృతిక, భౌతిక దాడులు సాగుతున్నాయి. బీజేపి అధికారంలో వున్న కాలంలో ఈ దాడులు వుధృతం అవుతున్నాయి.
ఈ వాస్తవాన్ని గుర్తించిన తరువాత, రాజకీయ అధికారం వస్తేనే ముస్లింల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆలోచనాపరులు చెప్పి ఊరుకుంటే సరిపోదు.
దానికి అవసరమైన రాజకీయ ప్రక్రియను సూచించడమేగాక దాన్ని చేపట్టాలి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో టిడిపి, టీఆర్ఎస్, వైయస్సార్ సిపీ లు బీజేపీ కూటమిలో సభ్యులే.
బీజేపి కూటమిని గద్దె దించాలంటే బీజేపి వ్యతిరేక కూటమిని బలపరచాలి. బీజేపి వ్యతిరేక కూటమి
ముస్లింలకు పూర్తిగా అనుకూలమైనది ఏమీ కాకపోవచ్చు. అయితే, శత్రువుకు శత్రువు మిత్రుడనే విధానాన్ని పాటించాలి.
జాతీయ రాజకీయాల్లో బీజేపి కూటమికి గట్టిపోటీ ఇవ్వగల కూటమిని గుర్తించాలి. దాన్ని బలపరచాలి. ముస్లిం ఆలోచనాపరులు తక్షణం ఆ ప్రక్రియను
ఆరంభించాలి.
--//--//--
Comments
Post a Comment