Posts

Showing posts from May, 2019

MTF విస్తృత కార్యవర్గ సమావేశం జూన్ 15, 2019

మితృలారా!  MTF విస్తృత కార్యవర్గ సమావేశం జూన్ 15, 2019 శనివారం విజయవాడలో జరుపుదాం. ఈ డేట్ వల్ల కూడా కొందరికి ఇబ్బందులు వుండవచ్చు. సంస్థ మీద అభిమానంతో కొంత సర్దుబాటు చేసుకోండి. మీ మీ అభిప్రాయాలను వెంటనే తెలపండి.  ఎజెండా  1. MTF సాధారణ కార్యక్రమం నిర్ధారణ.(లౌకిక సామ్యవాద ప్రజాస్వామ్యం (రాజ్యాంగ పరిరక్షణ)) 2. MTF రాజకీయ విధానం.   3. MTF సంబంధాలు సాధారణ స్థితిలో, ఎన్నికల సమయంలో వివిధ సోషల్ ఆర్గనైజేషన్స్, రాజకీయ పార్టీలతో   ఎలావుండాలి?     4. MTF కార్యక్రమం అమలుకు ఐదేళ్ళ రోడ్ మ్యాప్.   5. MTF ఆర్ధిక వనరుల ప్రణాళిక  6. MTF కొత్త కన్వీనర్, కొత్త కార్యవర్గం ఎన్నిక.  

నా మీద మీ అందరి నమ్మకానికీ, అభిమానానికి, ప్రేమకూ సలాములు.

హైదరాబాద్ 15 మే 2019 మిత్రులారా అస్సలాం అలైకుమ్, నా మీద మీ అందరి నమ్మకానికీ, అభిమానానికి, ప్రేమకూ సలాములు. మీ మాటలు విని చాలా ఆనందంగావుంది. ఏ సంస్థలో అయినా సరే  నాయకత్వం మారుతూ వుండాలి.   నాయకత్వం వహించే అవకాశాలు తమకూ  వస్తాయనే నమ్మకం కలిగినప్పుడు  సంస్థలోని యువతరంలో ఉత్సాహం వస్తుంది.  సీనియర్లు అలాంటి నమ్మకాన్ని కలిగిస్తూ వుండాలి. నేను అలాంటి మంచి సాంప్రదాయాన్ని పాటించాలనుకుంటున్నాను.  మనం సంఖ్యరీత్యా చాలా తక్కువ మందిమి. అయినప్పటికీ జాతికి అంకితభావం రీత్యా  MTF  సభ్యులు చాలా వున్నతులు.  రెండు రాష్ట్రాల్లో కలిపి కోటి మందికి పైగా జనాభావున్న సమూహం మనది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు చేస్తున్న అన్యాయాన్ని రోడ్డెక్కి ప్రశ్నించడానికి మన ఆలోచనాపరులు భయపడిపోతున్నారు. ఆ నేపథ్యంలో చూసినపుడు MTF ఔన్నత్యం బోధపడుతుంది. మనది అద్భుతమైన కూర్పు కూడా. ఉమర్ ఫారూఖ్, హసన్ షరీఫ్, షేక్ యాసీన్ లాంటి  చురుకైన యువతరం మనతోవుంది. ఖాలిదా పర్వీన్ లాంటి గంభీరమైన వ్యక్తిత్వాలు మనతో వున్నాయి.  ఫయాజ్ అలీ, మునీర్ అహ్మద్, హబీబుర్ రహమాన్, నబీ కరీం ...

'మత సామరస్య ఇఫ్తార్లు

మిత్రులారా ! అస్సలామ్ అలేకుమ్ ! 'మత సామరస్య ఇఫ్తార్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రెండు లక్షల ఎకరాల వక్ప్హ్ భూముల్లో 85 శాతం అంటే ఒక లక్షా 70 వేల ఎకరాల భూములు అన్యాక్రాంతం అయిపోయాయి. నేను వక్ఫ్ భూముల గురించి నెలన్నర క్రితం రెండు వ్యాసాలు రాసిన విషయం  మీకు తెలుసు. రెండు పత్రికలు దాన్ని అచ్చువేశాయి. వాటిని సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా షేర్ చేశారు.  అప్పటి నుండి నాకు దాదాపు ప్రతిరోజూ  ఎక్కడో ఒక చోట నుండి ఫోన్లు వస్తున్నాయి. తమ ఊర్లో సమస్య వుందనీ  నేను వచ్చి ఒక మీటింగు పెట్టాలని. ఎండాకాలం, ఎన్నికల ఫలితాలు రాకపోవడం, రంజాన్ మాసం వగయిరా కారణాలతోపాటూ నా దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల కూడా ఏప్రిల్ 19 అనంతపురం సమావేశం తరువాత కొత్త కార్యక్రమాన్ని చేపట్టలేదు. జూన్ నెల 5న రంజాన్ పండుగ జరిగే అవకాశాలున్నాయి. జూన్ 9 ఆదివారం మనం విజయవాడలో కార్యవర్గ సమావేశాన్ని జరుపుకుందాము. అందులో  భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయించుకుందాము. అందరూ జూన్ 9న విజయవాడలో వుండేలా టిక్కెట్లు రిజర్వు చేసుకోండి. మరో ముఖ్య విషయం ఏమంటే  నేను MTF  కన్వీనర్ బాధ్యతల్ని స్వీకరించి రంజాన...