'మత సామరస్య ఇఫ్తార్లు

మిత్రులారా !
అస్సలామ్ అలేకుమ్ !

'మత సామరస్య ఇఫ్తార్లు

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రెండు లక్షల ఎకరాల వక్ప్హ్ భూముల్లో 85 శాతం అంటే ఒక లక్షా 70 వేల ఎకరాల భూములు అన్యాక్రాంతం అయిపోయాయి. నేను వక్ఫ్ భూముల గురించి నెలన్నర క్రితం రెండు వ్యాసాలు రాసిన విషయం  మీకు తెలుసు. రెండు పత్రికలు దాన్ని అచ్చువేశాయి. వాటిని సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా షేర్ చేశారు. 

అప్పటి నుండి నాకు దాదాపు ప్రతిరోజూ  ఎక్కడో ఒక చోట నుండి ఫోన్లు వస్తున్నాయి. తమ ఊర్లో సమస్య వుందనీ  నేను వచ్చి ఒక మీటింగు పెట్టాలని. ఎండాకాలం, ఎన్నికల ఫలితాలు రాకపోవడం, రంజాన్ మాసం వగయిరా కారణాలతోపాటూ నా దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల కూడా ఏప్రిల్ 19 అనంతపురం సమావేశం తరువాత కొత్త కార్యక్రమాన్ని చేపట్టలేదు.

జూన్ నెల 5న రంజాన్ పండుగ జరిగే అవకాశాలున్నాయి. జూన్ 9 ఆదివారం మనం విజయవాడలో కార్యవర్గ సమావేశాన్ని జరుపుకుందాము. అందులో  భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయించుకుందాము. అందరూ జూన్ 9న విజయవాడలో వుండేలా టిక్కెట్లు రిజర్వు చేసుకోండి.

మరో ముఖ్య విషయం ఏమంటే  నేను MTF  కన్వీనర్ బాధ్యతల్ని స్వీకరించి రంజాన్ నెలతో రెండేళ్ళు అయిపోయింది. ఇక నేను తప్పుకుని మరొకరికి అవకాశం కల్పించడం నా బాధ్యత  అనుకుంటున్నాను. జూన్ 9 నాటి కార్యవర్గ సమావేశంలోనే కొత్త కన్వీనర్ ను ఎంచుకుందాము. 

మరో ముఖ్యవిషయం ఏమంటే గత ఏడాది MTF పిలుపు ఇచ్చిన  'దళిత్ ముస్లిం ఇఫ్తార్' కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది.  ఈ ఏడాది దాన్ని మరి కొంత విస్తరించి 'మత సామరస్య ఇఫ్తార్' గా చేపట్టండి. మీ సౌలభ్యాన్ని బట్టి ఏదో ఒకరోజు  ఇతర మతస్తుల్ని ఇఫ్తార్ దావత్ కు ఆహ్వానించండి. మన కార్యక్రమం మత సామరస్యం అని గుర్తుపెట్టుకోండి.

మతసామరస్యం వర్ధిల్లాలి!

జజఖుల్లా ఖైర్

యజ్దానీ


Comments

Popular posts from this blog

*జిల్లాల్లోని ప్రధాన సమస్యల్ని పోస్టు చేయండి*

Crusades - 1095–1291

Telangana State Backward Classes List