నా మీద మీ అందరి నమ్మకానికీ, అభిమానానికి, ప్రేమకూ సలాములు.

హైదరాబాద్
15 మే 2019

మిత్రులారా
అస్సలాం అలైకుమ్,

నా మీద మీ అందరి నమ్మకానికీ, అభిమానానికి, ప్రేమకూ సలాములు. మీ మాటలు విని చాలా ఆనందంగావుంది.

ఏ సంస్థలో అయినా సరే  నాయకత్వం మారుతూ వుండాలి.   నాయకత్వం వహించే అవకాశాలు తమకూ  వస్తాయనే నమ్మకం కలిగినప్పుడు  సంస్థలోని యువతరంలో ఉత్సాహం వస్తుంది.  సీనియర్లు అలాంటి నమ్మకాన్ని కలిగిస్తూ వుండాలి. నేను అలాంటి మంచి సాంప్రదాయాన్ని పాటించాలనుకుంటున్నాను. 

మనం సంఖ్యరీత్యా చాలా తక్కువ మందిమి. అయినప్పటికీ జాతికి అంకితభావం రీత్యా  MTF  సభ్యులు చాలా వున్నతులు.  రెండు రాష్ట్రాల్లో కలిపి కోటి మందికి పైగా జనాభావున్న సమూహం మనది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు చేస్తున్న అన్యాయాన్ని రోడ్డెక్కి ప్రశ్నించడానికి మన ఆలోచనాపరులు భయపడిపోతున్నారు. ఆ నేపథ్యంలో చూసినపుడు MTF ఔన్నత్యం బోధపడుతుంది.

మనది అద్భుతమైన కూర్పు కూడా. ఉమర్ ఫారూఖ్, హసన్ షరీఫ్, షేక్ యాసీన్ లాంటి  చురుకైన యువతరం మనతోవుంది. ఖాలిదా పర్వీన్ లాంటి గంభీరమైన వ్యక్తిత్వాలు మనతో వున్నాయి.  ఫయాజ్ అలీ, మునీర్ అహ్మద్, హబీబుర్ రహమాన్, నబీ కరీం ఖాన్  వంటి స్వచ్చంద సేకులు,  జహా ఆర, డాక్టర్ అతావుర్ రహమాన్, అబ్దుల్ మతీన్, షేక్ హుస్సేని, షఫి అహ్మద్, వంటి వృత్తి నిపుణులు. వాహెద్, వేంపల్లె షరీఫ్ వంటి గొప్ప రచయితలు, ఆసిఫుద్దీన్ వంటి ఛానల్ ప్రమోటర్, హనీఫ్, మజహర్ రహమాన్ వంటి ప్యాట్రన్లు మనకున్నారు.  ఇంతటి వైవిధ్యాన్ని సాధించడం అంత సులువు కాదు. మనం ఇలా వున్నాము గాబట్టే బయట వందల సంఘాలున్నా పెద్ద సమస్య వచ్చినపుడు మన వైపు చూస్తున్నాయి. ఇది మనం సాధించిన విజయం.

మన సంస్థకు నాయకత్వం వహించేవారు తక్షణ రాజకీయ, వ్యక్తిగత  ప్రయోజనాల కోసం కాకుండా జాతికి ఒక మేధోసరోవరంలా  కొనసాగాలని నా కోరిక.  వాళ్ళు ఏ రాజకీయ పార్టీలోనూ క్రియాశీలంగా వుండరాదు.  అన్ని రాజకీయ పార్టీలకు సమాన దూరాన్నో సమాన దగ్గరితనాన్నో పాటిస్తూ వుండాలి. సంస్థలో రెండవ శ్రేణి నాయకులకు ఏ పార్టీలో అయినా చేరే అవకాశాలను ఇవ్వాలి.  వాళ్ళెప్పుడూ తమ పార్టి అభిమానాన్ని సంస్థ మీద రుద్దే ప్రయత్నం చేయరాదు. ఈ రెండు నియమాలను పాటిస్తే MTF  అనేక విజయాలను సాధిస్తుంది.

నా తరువాత దీనికి ఎవరు నాయకత్వం వహించాలి అనేది సూచించే అవకాశం నాకు వుంటే వాహెద్, జహ ఆర గార్లలో ఒకరిని ఎంచుకోండి అని సూచిస్తాను. 

అల్లా హాఫీజ్

మీ
యజ్దాని



  

Comments

Popular posts from this blog

*జిల్లాల్లోని ప్రధాన సమస్యల్ని పోస్టు చేయండి*

Crusades - 1095–1291

Telangana State Backward Classes List