MTF Supports UPA
MTF Supports UPA ఐక్య ప్రగతిశీల కూటమికి ఎంటిఎఫ్ మద్దతు ముస్లిం ఆలోచనాపరుల వేదిక గుంటూరు ప్రకటన, నవంబరు 23, 2018 వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలతో పాటూ ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జమిలిగా జరుగనున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు విడిగా జరిగాయి కనుక అక్కడ సూటిగా ఒక రాజకీయ విధానాన్ని తీసుకోవడం ముస్లింలకు సులువయింది. కేసిఆర్ సాగించిన ముస్లిం ఫ్రెండ్లీ విధానాలవల్ల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ ఎస్ ను సమర్ధించాలని ముస్లిం ఆలోచనాపరుల వేదిక ( ఎంటిఎఫ్) తీసుకున్న నిర్ణయం అన్ని విధాలా సరైనది. తెలంగాణ ముస్లింలు టిఆర్ ఎస్ ను సంపూర్ణంగా సమర్ధించే క్రమంలో కాంగ్రెస్ ను ఓడించారు. అదే వరుసలో టిడిపిని, కమ్యూనిస్టుల్ని కూడా ఓడించారు. ఈ క్రమంలో బిజెపి ఐదు సిట్టింగ్ స్థానాల్లో నాలుగింటిని కోల్పోయి ఒక్క అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే నిలబెట్టుకుని ఘోరపరాజయం పాలైంది. సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ఎజెండాలే ప్రధానంగా వుంటాయి. తెలంగాణ సెంటిమెంట్ గల టిఆర్ ఎస్ ఒకవైపు మిగిలిన పార్టీలన్నీ ఇంకో వైపు అనే సమీకరణతో ఈసారి తెల...