MTF - Charter Of Demands for Elections - 2019
ముస్లిం ఆలోచనాపరుల వేదిక
MUSLIM THINKERS FORUM
Andhra Prades Assembly Elections – 2019
ఆంధ్ర
ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు – 2019
Charter Of Demands
కోర్కెల
పట్టిక
(Draft
Copy 17 November 2018))
డ్రాఫ్టింగ్
కమిటి
ఛైర్మన్
రచయిత ఏ యం ఖాన్ యజ్దానీ
(డానీ)
కమీటీ
మెంబర్స్
డాక్టర్ రహమాన్
అడ్వకేట్ జహా ఆరా
కవి అబ్దుల్ వాహెద్
అడ్వకేట్ అబ్దుల్
మతీన్
ఇంజినీర్ అఫ్సర్ బాషా
కాకినాడ
6 డిసెంబరు 2018
Contents
a. Political Representation and Protocols
b. Financial Commitments
c. Educational Reforms (Primary Education)
d. Higher Education, Coaching and Employment
e. Employment Creation Private Sector
f. Muslim Women Empowerment
g.
Balanced Regional Development
h.
Infrastructure Sector
i.
Development of Urdu language
j.
Judiciary, Law and Order
k.
Wakf Lands & Properties
l.
Freedom of Religion and Right to profess.
m. Universal Demands
a. Political Representation and Protocols
ఎ. రాజకీయ ప్రాతినిథ్యం - గౌరవస్థానం
రాజకీయా
పార్టీ ఆధారిత పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థలో ఏ సమూహమైనా సరే స్వేఛ్ఛా స్వాతంత్ర్యాలతో గౌరవప్రదంగా
మనుగడ సాగించాలంటే రాజకీయ ప్రానిధ్యం ప్రాణప్రదమైనది. రాజకీయ ప్రాతినిధ్యం వున్న
సమూహాలే చట్టసభల్లోనూ, అధికార వాకిళ్ళలోనూ
తమ సమస్యలకు పరిష్కారాలను సాధించుకోగలుగుతాయి. రాజకీయ ప్రాతినిధ్యం లేని సమూహాలు సామాజికంగానూ
అంతరించిపోతాయి.
మరోవైపు,
గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టి నాయకత్వంలో కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన జాతీయ ప్రజాస్వామిక కూటమి సమస్త ప్రజాస్వామిక వ్యవస్థల్ని ధ్వంసం చేస్తూ, మూకస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ,
మతసామరస్య విలువల్ని చిదిమేస్తూ, సమాజంలో అసహన వాతావరణాన్ని సృష్టిస్తూ, పెద్ద నోట్ల రద్దు, జీయస్టీ వంటి పథకాలతో భారత సామాన్య ప్రజల జీవితాలను ఉక్కు పాదంతో తొక్కేస్తోంది. ఈ
ఫాసిస్టు పాలనకు తొలి బాధితులు ముస్లింలు.
1.
భారతీయ జనతా పార్టినీ, దాని నాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామిక కూటమినీ జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ఓడించాలి.
2.
బిజెపి, ఎన్డీఏ శక్తులతో తలపడే పార్టీలు కూటముల్ని జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో బలపరచాలి.
3.
జనాభా
దామాష (ఆంద్రప్రదేశ్ లో 9 శాతం, తెలంగాణలో 12 శాతం) ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో 16 అసెంబ్లీ
స్థానాల్లోనూ. 2 పార్లమెంటరీ స్థానాల్లోనూ ముస్లిం అభ్యర్ధులకు పార్టి టిక్కెట్లు ఇవ్వాలి.
4.
శాసన
మండలి, రాజ్య సభ ఎన్నికల్లో ముస్లింలకు 9 శాతం సీట్లు కేటాయించాలి.
5.
మంత్రివర్గంలో
ముస్లింలకు ప్రాతినిథ్యం కల్పించాలి.
6.
ఉప
ముఖ్యమంత్రి పదవిలో ఒక ముస్లింను నియమించాలి.
7.
ముస్లిం
మంత్రులను మైనార్టీల సంక్షేమం వంటి శాఖలకు మాత్రమే పరిమితం చేయకుండా ప్రాధాన్యంగల శాఖలను
కేటాయించాలి.
8.
పంచాయితీ,
మునిసిపాలిటి, నగర పాలక సంస్థల పాలకవర్గ ఎన్నికల్లో ముస్లింలకు 9 శాతం సీట్లు కేటాయించాలి.
9.
వెనుకబడిన
తరగతుల రిజర్వుడు స్థానాల్లో బిసి-ఎ, బిసి
- బి, బిసి - ఇ ల లోని ముస్లిం సామాజికవర్గాలకు జనాభా దామాషా ప్రకారం 9 శాతం అవకాశం
కల్పించాలి.
10. కొత్త పాలకవర్గాల్లో ముస్లింల ప్రాతినిధ్యం తక్కువగా వున్న చోట్ల నామినేటెడ్ పోస్టుల్లో వారిని నియమించాలి.
11. వివిధ కార్పొరేషన్ల
నామినేటెడ్ పదవుల్లో ముస్లింలకు 9 శాతం కేటాయించాలి.
12. పార్టి సంస్థాగత నిర్మాణంలో ముస్లింలను మైనారిటీ సెల్ లకు పరిమితం చేయకుండా
ఇతర విభాగాల్లోనూ సముచిత పదవులు ఇవ్వాలి.
13. సమాజంలో ముస్లింల ప్రాథాన్యం పెరుగడానికి వీలుగా గ్రామీణ, పురపాలక, జిల్లా స్ధాయిల్లో అధికారిక ప్రోటోకాల్ ప్రకారం అధికారిక కార్యక్రమాలకు ముస్లింలను ఆహ్వానించాలి.
b. Financial Commitments
బి.
ఆర్ధికరంగం
మనిషి ఆర్ధిక జీవి. ఆర్ధిక ఆలంబన లేని సమూహం వర్తమాన సమాజంలో నిలదొక్కుకోలేదు.
అనేక చారిత్రక సామాజిక కారణాలవల్ల కొన్ని సమూహాలు
ఆర్ధిక ఆలంబనను పొందలేకపోవడమేగాక, వున్న ఆర్ధిక ఆలంబనను సహితం కోల్పోతుంటాయి. ఆ సమూహాక్లను ప్రత్యేకంగా ఆదుకోనంత కాలం, వాళ్ళను
ప్రధా స్రవంతితో సమానంగా అభివృధ్ధి చేయనంత
కాలం భారత రాజ్యాంగ లక్ష్యమైన ప్రజాహిత సమాజాన్ని నిర్మించుకోలేము.
ప్రభుత్వాలు ముస్లింల అభ్యున్నతికి కేటాయిస్తున్న
నిధులే తక్కువ. అలా కేటాయించిన నిధుల్ని సహితం ఖర్చుపెట్టకుండా మురగబెడుతున్నారు. ప్రభుత్వ బడ్జెట్ లో ముస్లిం సబ్ ప్లాన్ ప్రకటిస్తామని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 2013లో ఒక వాగ్దానం చేశారు.
కర్ణాటక ప్రభుత్వం ఈ ఏడాది సబ్ ప్లాన్ చట్టాన్ని సవరించింది. సబ్‌ప్లాన్ కేతాయింపుల్లో వినియోగం కాని నిధుల్ని వేరే శాఖలకు మళ్లించే
అధికారులకు జైలు శిక్ష విధించేలా చట్టంలో మార్పులు చేశారు. ఆ కోవలో ఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాల్లో ముస్లిం సబ్ ప్లాన్ చట్టాన్ని తీసుకు రావలసిన అవసరం వుంది.
1.
ముస్లిం సబ్-ప్లాన్ ను రూపొందించి రాష్ట్రంలోని ముస్లిం జనాభా ధామాషాకు అనుగుణంగా బడ్జెట్ లో 10 నుంచి 13 శాతం కేటాయించాలి.
2.
రాష్ట్ర
మైనారిటీస్ కార్పొరేషన్ ద్వార లక్ష రూపాయల వరకు ఇచ్చే రుణాలను బ్యాంకులతో కొల్లాటరల్
సెక్యూరిటీ (ఆస్తి జామీను) లింకు లేకుండా అందించాలి.
3.
కొల్లాటరల్
సెక్యూరిటీ (ఆస్తి జామీను) లేకపోవడంవల్ల అనేక పథకాల్లో ముస్లింలు బ్యాంకు రుణాలు పొందలేకపోతున్నారు.
ఇళ్ళ స్థలాలు, ఇళ్ళ నిర్మాణాల మంజూరు ద్వార ముస్లింల సంపదను ప్రభుత్వం పెంచాలి. వాటితో
ముస్లింలు కొల్లాటరల్ సెక్యూరిటీ సమర్పించి
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే
పలు పథకాల్లో బ్యాంకు రుణాలు పొందే వీలు ఉంటుంది. తద్వార తమ అర్థిక స్థితి గతుల్ని వాళ్ళు మరింతగా మెరుగుపరచుకునే
వీలుంటుంది.
4.
కొల్లాటిరల్ సెక్యూరిటీ అవసరం లేని పథకాల్లోనూ ముస్లింలకు రుణాలు ఇవ్వడానికి కొన్ని బ్యాంకులు కొల్లాటిరల్ సెక్యూరిటీ అడుగుతున్నాయి. కొల్లాటిరల్ సెక్యూరిటీ చూపించలేని వారికి రుణాలు నిరాకరిస్తున్నాయి.
ఇటువంటి బ్యాంకుల మీద చర్యలు తీసుకోవాలి.
5.
పేద ముస్లిం పిల్లలకు రంజాన్ నెలలో ఉచితంగా 2 జతల బట్టలు పంపిణి చేయాలి.
6.
ఆంధ్రప్రదేశ్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ వద్ద రుణాల కోసం పెండింగులో ఉన్న 30,000పైగా
దరఖాస్తుల్ని పరిశీలించి రుణాలు మంజూరు చేయడానికి ప్రత్యేకంగా 100 కోట్ల రూపాయల కేటాయించాలి.
7.
ముస్లిం కార్ డ్రైవర్లను యజమానులుగా మార్చడానికి 200 కార్లను పంపిణీ చేచేయాలి .
8.
మెకానిక్కులు, రిపేరర్లు తమ వృత్తికి సంబంధించిన పనిముట్లను సమకూర్చుకోవడానికి ఒక్కొక్కరికి 20 వేల
రూపాయల వరకు బ్యాంక్ లోన్లు ఇప్పించాలి. లేదా కంప్లీట్ టూల్ కిట్లను పంపిణీ చేయాలి.
9.
బంగారం
/ సునార్ పని చేసే వారికి రుణసౌకర్యం కల్పించడానికి
10 కోట్ల రూపాయల కేటాయించాలి.
10.
నూర్ బాషాల కోసం ప్రత్యేకంగా ఒక ఫినాన్స్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి దాని కోసం సాలీన 40 కోట్ల రూపాయలు కేటాయించాలి.
11.
పెద్ద నొట్ల రద్దు, జీయస్టీల వల్ల తీవ్రంగా నష్టపోయిన చిరువ్యాపారుల సంక్షేమానికి కొత్త పథకాలను చేపట్టాలి.
c. Educational Reforms
(Primary Education)
సి. ప్రాధమిక విద్య
పేదరికం ముస్లిం సమాజాన్ని
మరింత పేదరికం లోనికి నెట్టి వేస్తోంది. వాళ్ళను అకడమిక్ విద్యకు దూరం చేస్తోంది. విద్యలేని
సమూహం ప్రజాస్వామ్య వ్యవస్థ ఫలాలను అందుకోజాలదు. దేశంలో ముస్లింల అభివృధ్ధి విద్యారంగం నుండే ఆరంభం
కావలసి వుంది.
1.
స్థలాలు
కేటాయించి మదరసాలు నిర్మించి ప్రతి మదరసాకు సర్వ శిక్ష అభియాన్ ద్వారా నిధులు అందే
విధంగా చర్యలు తీసుకోవాలి.
2.
మదరసాలు
అన్నింటిలోనూ జిల్లా విద్యా శాఖాధికారి (డి.ఇ.ఒ.) ద్వారా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి.
3.
మదరసాల్లో ఆంగ్ల మాధ్యమం, రాష్ట /
కేంద్ర ప్రభుత్వాల సిలబస్ అమలు చేయాలి.
4.
ముస్లిం డ్రాప్‌అవుట్ బాలబాలికలకు మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా వృత్తి శిక్షణ తరగతులు నిర్వహించి స్వయం
ఉపాధి కల్పించాలి.
5.
ప్రత్యేక
పాఠశాల కమిటీలు ఏర్పాటుచేసి ఉర్దూ
పాఠశాలల్లో చదువును మధ్యలో ఆపేసే వారి (స్కూల్ డ్రాపింగ్ ) సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేయాలి.
6.
మదరసాలకు
కేంద్ర ప్రభుత్వ నిధులు అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి.
D. Higher
Education, Coaching and Employment
డి.
ఉన్నత విద్యా, కోచింగ్, ఉద్యోగ రంగాలు
ఉన్నత
విద్య సమాజంలో వ్యక్తి వికాసానికి తోడ్పడుతుంది.
ప్రభుత్వ ఉద్యోగాన్ని కేవలం ఉపాధి, ఆర్థిక
అంశాలుగా మాత్రమే చూడకూడదు. అన్ని సామాజిక సమూహాలకు కార్యనిర్వాహకవర్గంలో, తద్వార ప్రపాలనలో భాగస్వామ్యం కల్పించే ప్రజాస్వామిక ప్రక్రియగా
చూడాలి.
1.
ప్రభుత్వ
విద్యా, ఉపాధి రంగాల్లో ముస్లింలకు ఇప్పుడున్న 4% రిజర్వేషన్లను పరిరక్షించడమేగాక,
మరో 5 శాతం పెంచుతూ శాసన సభలో ఒక తీర్మానం చేసి పార్లమెంటు ఆమోదం కోసం కేంద్రానికి
పంపించాలి.
2.
ఆంధ్రప్రదేశ్లో నాలుగు శాతం రిజర్వేషన్ కలిగి ఉన్న బి.సి. (ఇ) జాబితాలోని ముస్లిం ఉప తరగతుల్ని కేంద్ర ఒ.బి.సి. జాబితాలో పొందుపరిచి, విద్యా, ఉపాధి, ఉద్యోగావకాశాలు
కల్పించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ మేరకు శాసన సభలో తీర్మానం చేసి, కేంద్రానికి నివేదించాలి.
3.
కేంద్ర ప్రభుత్వ 15 సూత్రాల పథకం తదితర కార్యక్రమాల ద్వార రాష్ట్రానికి వచ్చే ఉద్యోగాల్లో
ముస్లింలకు 9 శాతం కేటాయించాలి.
4.
రాష్ట్ర
బి.సి.(ఇ) జాబితాలోని ముస్లిం ఉప సామాజికవర్గాలను ఇప్పటి వరకు కేంద్ర ఒబిసి జాబితాలో
చేర్చని కారణంగా ముస్లిం విద్యార్ధులు The National
Eligibility cum Entrance Test (NEET) పరీక్షలో ఏటా 200 మెడికల్ సీట్లను కోల్పోతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఒ.బి.సి. రిజర్వేషన్ జాబితాలో ఏపి బి.సి.(ఇ) సామాజికవర్గాలను
చేర్చేవరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీట్ కౌన్సిల్‌తో సంప్రదించి, రాష్ట్ర వైద్య కళాశాలల్లో సీట్లు రాష్ట్ర బి.సి.(ఇ) రిజర్వేషన్ ప్రకారం ముస్లింలకు ఇవ్వాలి.
5.
ఎం.సెట్, పాలిటెక్నిక్, APPSC, UPSC లకు హాజరయ్యే ముస్లిం విద్యా, ఉద్యోగ
ఆశావహులకు రాష్ట్ర ప్రభుత్వం అంచేస్తున్న కోచింగ్ క్లాసుల కాల పరిమితిని మూడు నెలలకు పెంచాలి.
6.
సివిల్ సర్వీసు పరీక్షలకు హాజరవుతున్న విద్యార్ధులకు ప్రత్యేక శిక్షణ అందించడానికి ఉచిత కోచింగ్ సెంటర్ల ఏర్పాటు చేయాలి.
7.
ప్రతి జిల్లాలో ముస్లింల కోసం ప్రత్యేకంగా టీచర్ ట్రైనింగ్, బి.ఇడి., ఒకేషనల్ కోర్సుల శిక్షణా
కేంద్రాలు ఏర్పాటుచేసి, దిగువ, మధ్య తరగతి ముస్లింలను ప్రోత్సహించాలి.
8.
ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (RCEDM) ప్రాంతీయ కేంద్రాలను పునరుధ్ధరించాలి. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మూడు రీజియనల్ సెంటర్ ఫర్ ముస్లిం ఎడ్యుకేషన్ ఏర్పాటుచేయాలి.
హైదరాబాద్ ఉస్మానియా విశ్వ విద్యాలయం ద్వారా 1983లో రీజియనల్ సెంటర్స్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ ను ఆంధ్ర ప్రాంతంలో ఏర్పాటుచేశారు.
అందులో భాగంగా నాటి ఆంధ్ర విశ్వ విద్యాలయం ఉప కులపతి ఎల్. వేణుగోపాల్ రెడ్డి 2005లో ఎ.యు. ప్రాంగణంలో ఒక ప్రాంతీయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా అనేకమంది ముస్లింలకు విద్యా శిక్షణతో పాటు ఉపాధి, ఉద్యోగావకాశాలు వచ్చాయి. ఇప్పుడు ఆ కేంద్రం భవనమే లేకుండాపోయింది. తిరిగి ఆ కేంద్రాన్ని నిధులు, పోస్టులతో ప్రారంభించాలి.
9.
విదేశాల్లో ఉన్నత విద్యను ఆశించేవారికి
15 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం /ఉపకారవేతనాలు అందించాలి.
10.
10వ తరగతి ఉత్తర్ణులైన వారికి వృత్తి విద్యాకోర్సుల ద్వార సాంకేతిక నైపుణ్యాన్ని పెంచడానికి 5 కోట్ల రూపాయల కేటాయించాలి.
11.
ముస్లిం పిల్లల కోసం అదనంగా 50 రెసిడెన్సీయల్
పాఠశాలలను ఏర్పాటు చేయాలి.
E. Employment in
Private Sector
ఇ. ప్రైవేటు ఉపాధి రంగం
అకడమిక్ విద్యను అందుకోలేకపోతున్న కారణంగా
ముస్లిం యువకులు ప్రైవేటు రంగంలో ఉపాధినో, స్వయం ఉపాధినో ఆశిస్తున్నారు. వాణిజ్య, పారిశ్రామిక
సంస్థల ప్రమోటర్లలో ముస్లింల సంఖ్య చాలా పరిమితం కనుక ప్రైవేటు రంగంలో ఉపాధిని పొందడం
కూడా ముస్లిం యువకులకు కష్టసాధ్యంగా మారుతోంది.
ఆర్థిక వనరుల కొరత కారణంగా స్వయం ఉపాధిని చేపట్టే అవకాశాలు కూడా అంతరించిపోతున్నాయి.
1.
ముస్లిం
చిరు వ్యాపారులు, తోపుడు బండ్లవాళ్ళు, హాకర్లు, మెకానిక్కులు, రిపెరర్ల వృత్తి నైపుణ్యాభివృధ్ధికీ,
ఆర్థికాభివృధ్ధికీ అవసరమైన కొత్త పథకాలను ప్రవేశపెట్టాలి.
2.
ముస్లిం సమాజంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని (ఎంటర్ప్రెన్యూయర్షిప్) పెంచేందుకు స్టార్ట్-అప్స్ని ప్రోత్సహించాలి.
3.
ముస్లిం ఔత్సాహికులకు చిన్న తరహా పరిశ్రమల్ని నెలకొల్పడానికి
తగిన ఆర్థిక రుణాలు అందించాలి.
4.
హిందూ
వెనుకబడిన కులాల అభ్యున్నతి కోసం చేపట్టే పథకాలన్నింటినీ బిసి-ఎ, బిసి-బి, బిసి-ఇ జాబితాల్లోని
ముస్లిం సామాజికవర్గాలు అన్నింటికీ వర్తింపచేయాలి.
5.
పేదరిక
నిర్మూలన పథకాలను ఏ కొందరికో కాకుండా ముస్లిం సమాజంలో సంతృప్త స్థాయి (సాచురేషన్)కి
చేరే వరకు వాటిని కొనసాగించాలి.
F. Muslim Women Empowerment
ఎఫ్. ముస్లిం మహిళా సాధికారత
ఏ సామాజికవర్గంలో అయినా సరే మహిళలే అభివృధ్ధికి
కొలమానం. మహిళాభ్యున్నతిని సాధించని సమాజం అసలు అభివృధ్ధిని సాధించినట్టే కాదు. భారత
అభివృధ్ధి నిచ్చెనమెట్లలో ముస్లిం సమాజం అందరికన్నా అట్తడుగున వుంటే , ముస్లిం మహిళలు
వాళ్ళకన్నా కింద వుంటున్నారు.
1.
ముస్లింల
కోసం చేపట్టే ప్రతి ఉద్దీపన చర్యల్లోనూ ముస్లిం
మహిళలకు 33 శాతం ఉప రిజర్వేషన్ కల్పించాలి.
2.
రాజకీయ,
ఆర్థిక, విద్యా, ఉపాధి రంగాలలో ముస్లింలకు
ఇచ్చే రిజర్వేషన్లలోనూ ముస్లిం మహిళలకు 33 శాతం ఉప రిజర్వేషన్ కల్పించాలి.
3.
ముస్లిం
యువతుల వివాహ సందర్భంగా దుల్హన్ పథకం కింద
ఇస్తున్న 50 వేల రూపాయల తోఫాను పెరిగిన ధరలకు అనుగుణంగా కనీసం 50 శాతం పెంచాలి.
G.
Balanced
Regional Development
జి.
ప్రాంతీయ సమానత్వం
రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతంలోనో, ఏదో ఒక సామాజికవర్గానికో జరిగే అభివృధ్ధి ఆదర్శవంతమైన అభివృధ్ధికాదు. అభివృధ్ది ఫలాలు అన్ని సామాజికవర్గాలకూ, అన్ని ప్రాంతాలకు
సమానంగా అందాలి. అప్పుడు మాత్రమే సామాజిక శాంతి
నెలకొంటుంది.
1.
ఉద్యోగ,
ఉపాథి, ప్రభుత్వ పథకాలు, శాసన సభ్యులు, శాసన
మండలి సభ్యులు మంత్రులు, రాజ్యసభ సభ్యులు, నామినేటెడ్ పోస్టులు వగయిరాలు అన్నింటిలోనూ ఉత్తరాంధ్రా, కోస్తా ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల ముస్లింలకు
సమాన ప్రతినిధ్యం కల్పించాలి. తద్వార ప్రాంతీయ సమానత్వాన్ని సాధించాలి.
H.
Infrastructure
Development
హెచ్. మౌళిక రంగ అభివృధ్ధి
సమాజ అభివృధ్ధికి మౌళికరంగం పునాది వంటిది. మౌళిక రంగాన్ని అభివృధ్ధిచేయకుండా ఈ సామాజికవర్గాన్ని
కూడా అభివృధి చేయలేము. మౌళికరంగ సదుపాయాలు సౌకర్యాల్లో ముస్లిం సమాజానికి ఇప్పటి వరకు
చాలా అన్యాయం జరుగుతూ వస్తున్నది.
1.
బలహీనవర్గాలకు
గృహ వసతి పథకం (యన్టీఆర్ హౌసింగ్
స్కీమ్) ద్వార మంజూరు చేసే ఇంటి స్ధలాలు, ఇళ్ళ నిర్మాణా రుణాల్లో
ముస్లింలకు 10 శాతం విడిగా మంజూరుచేయాలి.
2.
ముస్లింలు అధికంగా నివసించే
బస్తీలు,
పేటలు, మురికి వాడలను గుర్తించి వెంటనే పారిశుద్ధ్యం, మంచినీరు, డ్రైనేజి వ్యవస్థల్ని ఏర్పాటు చేయాలి.
3.
ముస్లింల
నివాసం కోసం కాలనీలు నిర్మించాలి.
4.
ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో వడ్డీలేని రుణ సదుపాయం అందించే ఇస్లామిక్ బ్యాంకుల శాఖలను ఏర్పాటుచేయాలి.
5.
గ్రామీణ
పేద ముస్లింల కుటుంబానికి మూడు ఎకరాల చొప్పున వ్యవసాయ భూమిని పంపిణీ చేయాలి.
6.
ప్రతి
జిల్లా కేంద్రంలో ముస్లింల కోసం ఒక ముసాఫిర్ ఖానా (సత్రం / సరాయ్ )ను నిర్మించాలి. వైద్యం తదితర పనుల కోసం జిల్లా కేంద్రానికి వచ్చే
ముస్లింలు నామమాత్రపు అద్దెతో ఆ ముసాఫిర్ ఖానాల్లో
ఓ మూడు రోజుల వరకు వుండే సౌకర్యం కల్పించాలి.
7.
ఆటోనగర్ లలో ఉన్న ముస్లిం మెకానిక్కులకు షెడ్లు వంటి మౌలిక నిర్మాణాలను ప్రభుత్వమే తక్షణం చేపట్టాలి.
I.
Urdu language Development
ఐ. ఉర్దూ భాషాభివృధ్ధి
ఆంధ్రప్రదేశ్ ముస్లింలకు
తెలుగు జీవనభృతి భాష అయితే, ఉర్దూ వాళ్ళకు
మాతృభాష. తెలుగు భాషాభివృధ్ధికి ఆంధ్రప్రదేశ్ ముస్లిం రచయితలు, కవులు, చేసిన సేవలు
ఎవరూ విస్మరించ లేనివి. ఉర్దూ అధికార భాషగా వున్న ఒకానొక కాలంలో అక్షరాశ్యుల శాతం ముస్లిం సమాజంలో ఎక్కువగా వుండేది. ముస్లిం మహిళల
అక్షరాశ్యత శాతం పురుషులకంటే ఎక్కువగా వుండేది. ఇప్పుడు ఉద్రూ భాష నిరాదరణకు గురి కావడంతో
అంతరించిపోయ్డ ప్రమాదం సంభవిస్తోంది. అపార సాంస్కృతిక వారసత్వం కలిగిన ఉర్దూ భాష అంతరించిపోవడం
అంటే ముస్లిం సమాజపు సాంస్కృతిక చరిత్ర అంతరించిపోతుంది.
1.
రాయలసీమ ఉర్దూ విశ్వవిద్యాలయంలో మౌలిక వసతులు, బోధనా సిబ్బందిని పెంచడానికి అవసరమైన నిధుల్ని
కేటాయించి
ఉర్దూ భాషాభివృధ్ధికీ తద్వార ముస్లిం సమాజపు సాంస్కృతికాభివృధ్ధికీ ప్రభుత్వం కృషి చేయాలి.
2.
ఉర్దూ-ముస్లిం
పేద కవులు, రచయితలు ఓ రెండు వందల మందికి నెలకు 2 వేల రూపాయల జీవన భృతి ఇవ్వాలి.
3.
రాయలసీమలోని నాలుగు జిల్లాలతోపాటూ కృష్ణ, గుంటూరులో జిల్లాల్లో ఉర్దూ భాషను రెండవ భాషగా గుర్తింపు ఇవ్వాలి.
4.
ఉర్దూ పాఠశాలల్ని అభివృద్ధి అన్ని విధాలా చేయాలి.
J. Judiciary, Code, law and Order
జే. న్యాయవ్యవస్థ, స్మృతి, శాంతి భద్రతలు
వర్తమాన సమాజంలో అవమానాలకు, అత్యాచారాలకు తరచుగా
గురవుతున్న సమూహం ముస్లింలు. ముస్లింల మీద నమోదు అవుతున్న బూటకపు కేసుల సంఖ్య రోజురోజుకూ
పెరిగిపోతున్నవి. ఈ పరిస్థితిని తక్షణం చక్కదిద్దాల్సిన అవసరం వుంది.
1.
ముస్లింలపై తరచుగా జరుగుతున్న మూకదాడుల్ని నిరోధించడానికి, మైనారిటీల
ఆత్మ గౌరవాన్ని పరిరక్షించడానికి , సమాజంలో
మైనారిటీల మీద కొనసాగుతున్న వివక్షను నివారించడానికీ
అత్యాచార నిరోధక చట్టాన్ని రూపొందించి, కట్టుదిట్టంగా అమలుచేయాలి.
2.
మూకోన్మాద దాడుల నుండి ముస్లింల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని తేవాలి.
3.
ఓక్క
గుక్కలో చెప్పే తక్షణ ట్రిపుల్ తలాక్ ను ముస్లిం సమాజం కూడా
వ్యతిరేకిస్తున్నది. అయితే, తక్షణ ట్రిపుల్
తలాక్ చెప్పారనే నెపంతో ముస్లిం పురుషుల్ని వేధించడాన్ని కూడా వ్యతిరేకిస్తున్నది. తక్షణ ట్రిపుల్ తలాక్ ను
జైలు శిక్ష విధించదగ్గ నేరంగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ను రద్దు చేయాలలని కోరుతున్నాము.
4.
ప్రభుత్వ ఎ.పి.పి. (అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్), ఎ.జి.పి. (అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్) నియామకాల్లో ముస్లిం న్యాయవాదులను ప్రోత్సహించి పోస్టులు ఇవ్వాలి.
5.
ప్రత్యేకమైన, భిన్నమైన ముస్లిం పర్సనల్ లా (షరియత్) గురించి అనేక మంది పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు అవగాహన
లేని కారణంగా పిర్యాదులు చేయడానికి వెళ్ళిన ముస్లింలకు అనేక అవమానాలు జరుగుతున్నాయి. ముస్లిం మహిళల స్థితి మరీ దారుణం. ఈ పర్రిస్థితిని
చక్కదిద్దడానికి ప్రతి జిల్లా సూపరింటెండెంట్
ఆఫ్ పోలీసు ఆఫీసుల్లో ముస్లిం ముఫ్తీతో
ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి. ముస్లిం పర్సనల్ లా కేసుల వ్యవహారంలో పోలీసులకు
ఈ ముఫ్తిలు సలహాదారులుగా వ్యవహరిస్తారు.
6.
పట్టణానికి ఒక ఒక
పోలీస్ స్టేషన్ లో ఫ్యామిలీ కౌన్సెలింగ్ కమిటీని ఏర్పాటు చేసి అందులో ఒక సభ్యునిగా ముస్లిం పెద్దను / మేధావిని నియమించాలి.
K.Wakf Lands and Properties
కే. వక్ఫ్ భూములు - ఆస్తులు
ముస్లిం
సమాజానికి ఆర్థిక ఆలంబన కోసం పూర్వికులు దానం చేసిన వక్ఫ్ భూములు, ఆస్తులు అన్యాక్రాంతానికి గురవుతున్నాయి. అనేక విధాలుగా
ఈ భూములు అస్తులు అంతరించిపోయి ముస్లిం సమాజానికి తీరని అన్యాయం జరుగుతోంది.
1.
వక్ఫ్
బోర్డును కార్పొరేషన్ స్థాయికి పెంచి, ముస్లిం ధార్మిక ఆస్తుల పరిరక్షణకు కట్టుదిట్టమైన
చర్యలు తీసుకోవాలి.
2.
వక్ఫ్
భూముల ఆక్రమణదారులు, కబ్జాదారుల మీద కఠినమైన
చర్యలు తీసుకోవాలి.
3.
వక్ఫ్
ఆస్తుల పరిరక్షణకు రెవెన్యూ మండల స్థాయిలో ఒక ఇనెస్పెక్టర్ స్థాయి ఉద్యోగిని నియమించాలి.
4.
అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం సేకరించిన భూములకు ఇతర రైతులకు ఇచ్చినట్టే వక్ఫ్ కు కూడా రాయితీలు ఇవ్వాలి.
5.
రాష్ట్రంలోని వక్ఫ్ భూముల్ని పరిరక్షించడమేగాక,
గతంలో అన్యాక్రాంతం అయిన భూములకు సమాన విలువగల భుముల్ని వక్ఫ్ బోర్డుకు ఇవ్వాలి.
L. Freedom of Religion and Right to profess
ఎల్.
మత స్వేఛ్ఛ, మతప్రచార హక్కు
మతఅల్పసంఖ్యాకులకు తమ మతవిశ్వాసాలను కొనసాగించుకోవడం, ప్రచారం చేయడం ప్రాణప్రదమైన అంశాలు. దానికి అవసరమైన
సంపూర్ణ పరిరక్షణను ప్రభుత్వం కల్పించాలి.
1.
ముస్లింలకు హజ్ సబ్సిడీ అందించాలి.
2.
హాజ్
కాని వేళల్లో మక్కా దర్శనానికి వెళ్ళే ఉమ్రా
యాత్రికులకు కూడా సబ్సిడీ అందించాలి.
3.
హజ్హౌస్కు అవసరమైన భూమిని
కేటాయించి,
నిర్మాణాన్ని చేపట్టాలి.
4.
హజ్
యాత్రికులు విజయవాడ, కడప, విశాఖపట్నం విమానాశ్రయాల నుండి నేరుగా జిద్దా వెళ్ళేలా అంతర్జాతీయ విమానాలు ఏర్పాట్లు చేయాలి.
5.
రాష్ట్రంలోని దర్గాలు అన్నింటి అభివృద్ధి కోసం 10 కోట్ల రూపాయలు కేటాయించాలి.
6.
ఇమాం,
మౌజన్లకు ఇప్పుడు ఇస్తున్న భృతిని పెరిగిన
ధరలకు అనువుగా 50 శాతం పెంచాలి.
7.
మసీదులకు
నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు సరఫరా చేయాలి.
8.
హఫీజ్, అలిం, ముఫ్తిలకు ఉచితంగా హజ్ యాత్ర ఏర్పాటు చేయాలి.
9.
హఫీజ్, ఆలిం, ముఫ్టిలకు సాధికార ధృవపత్రాలు పంపిణీ చేయడానికి వీలుగా మదరసాల గుర్తింపు కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలి.
10.
ముస్లిం జనాభా 3 వేలకు పైన ఉన్న మండలాల్లో ఒక ప్రభుత్వ ఖాజిని నియమించాలి.
M. Universal Deands
ఎం. సార్వజనీన డిమాండ్లు
1.
పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలి. ప్రాజెక్టు నిర్వాశితులకు తక్షణ
సహాయం, పునరావాస (ఆర్ ఆర్) ప్యాకేజిని సంపూర్ణంగా అమలు చేయాలి.
2.
ఎపీకి ప్రత్యేక తరహా హోదా సాధన కోసం ఉధృతంగా ఉద్యమించాలి.
3.
దళితుల మీద దాడుల్ని నిరోధించడానికి
ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
4.
మహిళల రక్షణ కోసం చట్టాలను పటిష్టం చేయాలి.
5.
ఇవిఎం లను రద్దు చేసి బ్యాలెట్ ఓటింగ్ విధానాన్ని పునరుధ్ధరించాలి.
=====================
Comments
Post a Comment