Posts

Showing posts from March, 2021

Thanks to All - ధన్యవాదాలు

  ధన్యవాదాలు     కరోనా తరువాత ముస్లిం ఆలోచనాపరుల వేదిక విజయవాడలో తలపెట్టిన తొలి సమావేశం సంతృప్తిని ఇచ్చింది. వ్యవధి తక్కువగా వున్నప్పటికీ చాలామంది సానుకూలంగా స్పందించారు. ఒక సామాజిక సమస్య మీద ముస్లిం సమాజం స్పందించడాన్ని అందరూ అభినందించారు.   ఇఫ్తార్ విందుల్లో సామాజిక అవగాహనను అభివృధ్ధిచేయడానికి కృషి చేయాలని ఒక అర్ధవంతమైన పిలుపును ఈ సమావేశం ఇచ్చింది.   సమావేశంలో పాల్గొని జయప్రదం చేసిన IFTU   జాతీయ అధ్యక్షులు పి ప్రసాద్, ప్రజాసాహితి నేత దివి కుమార్, మూవ్ మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ నేత కేఎంఏ సుభాన్, విరసం నేతలు అరసవిల్లి కృష్ణ, రివేర ప్రజా నాట్యమండలి నేత పిచ్చయ్య, IAPL నాయకులు పిచ్చుక శ్రీనివాస్, సమాజ పరిశీలకులు సి వెంకట్రావ్, సామాజిక పరివర్తన కేంద్రం నేత వున్నవ వినయ్ కుమార్, కార్మిక నేత కోయ వెంకటేశ్వర్లు, పిడిఎస్ యు రాష్ట్రనాయకులు   రామకృష్ణ, రవిచంద్ర, MTF నేతలు డాక్టర్ అతావుర్ రహమాన్, షేక్ మునీర్ అహ్మద్, అడ్వకేట్ ఖలీలుల్లా,   ప్రెస్ క్లబ్ సిబ్బందికి ఇంకా ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ సమావేశ ...

Improve social awareness at Iftar dinners - MTF

  ఇఫ్తార్ విందుల్లో సామాజిక అవగాహనను పెంచండి   ‘ఇఫ్తార్ విందుల్లో ప్రైవేటీకరణ, రిజర్వేషన్లు, రైతుల ఆందోళన మీద అవగాహనను పెంచండి’ ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF) పిలుపు.   విజయవాడ ప్రెస్ క్లబ్ లో మార్చ్ 28 ఆదివారం సాయంత్రం ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF) ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టెబుల్ సమావేశం ఈ మేరకు ఒక తీర్మానం చేసింది. ఏప్రిల్ 14 నుండి రంజాన్ మాసం ఆరంభం కానున్నందున ముస్లిం సమాజానికి ఈ సూచన చేసింది. ఏప్రిల్ 14 భారత లౌకిక రాజ్యంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతి కూడ.             భారత లౌకిక రాజ్యాంగ పరిరక్షణ కోసం 2019 చివర్లో ఆరంభమైన షాహీన్‌ బాగ్ ఉద్యమం కేంద్ర ప్రభుత్వాన్ని రాజధాని నగరంలోనే ఎలా దిగ్బంధం చేయవచ్చో చాటి చెప్పింది. ఈనాటి రైతాంగ ఆందోళన నాయకత్వం ‘ షాహీన్‌ బాగ్’ ను తమకు దారి చూపిన తల్లిగా పేర్కొనడం ఒక విశేషం.             దళితుల మీద ఒక పరంపరగా దాడులు సాగుతున్నప్పుడు 2018 రంజాన్ మాసంలో ముస్లిం ఆలోచనాపరుల వేదిక   ‘దళిత్ - ముస్లిం ఇఫ్తార్లు’ పిలుపు ఇచ్చిం...