సభలు ప్లాన్ చేయాలి. తేదీలను చర్చించి నిర్ణయించండి.
మిత్రులారా! నా ఆరోగ్యం ఇంకా కుదుట పడలేదు. నిన్నటి నుండి కొద్దిగా సెమీ సాలిడ్ డైట్ తీసుకుంటున్నాను. చాలా నీరసంగా వుంది. కశ్మీర్ సమస్య మీద మాట్లాడడానికి అనేక మంది పిలుస్తున్నారు. నేను చాలా నిస్సత్తువతో వున్నాను. ఐదు రోజుల క్రితం ధైర్యం చేసి ఒక టివీ కార్యక్రమానికి వెళ్ళాను. ఆ తరువాత జబ్బు తిరగబడింది. ప్రాణవాయువు సరిపోక చాలా ఇబ్బందిగా వుంటోంది. మంగళగిరి సభకు వెళ్లలేదు. చాలా బాధగా అనిపించింది. రేపు ఆదివారం హైదరాబాద్ సభకు వస్తానని మాటిచ్చాను. అప్పటికి కోలుకుంటానని నమ్ముతున్నాను. సోమవారం ఫుల్ బాడీ చెకప్ చేయించాను. ఒక శుభవార్త ఏమంటే నా శరీరంలో లంగ్స్ (COPD), ప్రాంకియాసిస్ (డయాబెటిక్) తప్ప మిగిలిన అన్ని అవయవాలు పూర్తి ఆరోగ్యంతో వున్నాయట. సెప్టెంబరు 8 విజయవాడ సభ చాలా ప్రతిష్టాత్మకమైనది. అందులో నేను ఒక్కడ్నే వక్తను. తమ్మినేని వీరభద్రంగారు అధ్యక్షులు. విమలక్క, గోరటి వెంకన్న గాయకులు. ప్రస్తుతం నేను దానికి సిధ్ధం అవుతున్నాను. హైదరాబాద్, ఖమ్మం, అనంతపురం, తూర్పు గోదావరి, విశాఖపట్నంలలో మనం సభలు ప్లాన్ చేయాలి. తేదీలను చర్చించి నిర్ణయించండి. విజయవాడ సభ తరువాత కడప ...