పాత రాజకీయ తీర్మానాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరం వుంది.
మిత్రులారా! మనం ఆశించినట్టు జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ కేంద్రంగా Pre-poll alliance (UPA) ఏర్పడలేదు. రాజకీయాల్లో BJP వ్యతిరేక పార్టీలన్నీ ఎవరికి వారే అనేలా వుంది పరిస్థితి. MTF పనిచేస్తున్న రెండు రాష్ట్రాల్లో BJP తప్ప ప్రకటిత NDA పార్టీలు లేవు. అలాగే Congress తప్ప ప్రకటిత UPA పార్టీలు కూడా లేవు. విచిత్రంగా Congress, BJPలు కూడా రెండు రాష్ట్రాల్లో చాలా బలహీనంగా వున్నాయి. మారిన ఈ నేపథ్యంలో మన పాత రాజకీయ తీర్మానాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరం వుంది. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి అసెంబ్లీలో తీర్మానం చేసి KCR ఒక మంచి సాంప్రదాయానికి నాందీ పలికారు. ఇది మరొకరికి కూడ ఆదర్శం కావాలంటే మనం TRS ను సమర్ధించడమే సమంజసం అనుకుంటున్నాను. GST, నోట్ల రద్దు నేరుగా ముస్లింల సమస్యలుకావు. రిజర్వేషన్ల పెంపు ముస్లింల సమస్య. ఈ విషయంలో ఒక సియం అసెంబ్లీలో బిల్లు పాస్ మాత్రమే చేయగలడు. అనుకూల వాతావరణం వచ్చినపుడు పార్లమెంటు దాన్ని షెడ్యూల్ లో చేరుస్తుంది. రాష్ట్రంలో మాత్రం కేసిఆర్ Muslim Friendly గానే వ్యవహరిస్తున్నారు. జగన్ విషయమూ అంతే. 2014...