Fight against communal forces and support UPA and allied parties
Fight against communal forces and support UPA and allied parties హైదరాబాద్ 25 జనవరి 2019 మిత్రులారా ! వచ్చే జమిలి ఎన్నికల్లో నరేంద్ర మోదీ - అమిత్ షా , ఎన్డీయే కూటమి , సంఘపరివారం , ఆడానీ - అంబానీలతో కూడిన మతతత్వ కేంద్ర ప్రభుత్వాన్ని ఓడించడం దేశంలోని ప్రజాస్వామికవాదులు , ఉదారవాదులు , మతసామరస్యవాదులు , సామ్యవాదులు , సౌమ్యవాదులు , మానవ హక్కులు- పౌరహక్కుల వాదుల ప్రధాన కర్తవ్యం . సరిగ్గా ఇదే లక్ష్యంతో ఈ కర్తవ్య నిర్వహణ కోసం ఏకం అవుతున్న రాజకీయ పక్షాలను ( ఈ కూటమి పేరు ఇప్పుడు యూపిఏ కావచ్చు రేపు ప్రజాకూటమి కావచ్చు లేదా మరొకటిగా మారవచ్చు ) సమర్ధించడం ద్వారానే మనం మన చారిత్రక కర్తవ్యాన్ని నిర్వర్తించగలం . ఈ శిబిరాల్లో ఏఏ పార్టీలున్నాయి , వాటితో మన వ్యక్తిగత empirical అనుభవాలు ఏమీటీ అనేది ఇప్పుడు అంతగా పట్టించుకోవాల్సిన అంశాలుకావు . వాటిల్లో కొన్ని పార్టీలతో వ్యక్తిగత empirical అనుభవాలు మనల్ని బాధించి, వేధించి కూడా వుండవచ్చు. వ్యక్తిగత empirical అనుభవాలను మాత్రమే ప్రధానంగా భావించేవాళ్ళు ఎన్నడూ...