సభల నిర్వహణ - కొన్ని సూచనలు
సభల నిర్వహణ - కొన్ని సూచనలు
స్పీకర్లు ఎవరో తేల్చడానికి ముందు మనం
ప్రోగ్రాం థీమ్ ను నిర్ణయించాలి.
ప్రస్తుతం మనం 3 థీమ్ లతో పనిచేస్తున్నాం.
1.
ఆంధ్రా ముస్లింలు – రాజకీయ దశదిశ –
2019
ఇందులోనూ మరలా రెండు రకాలున్నాయి.
అ. ముస్లింల రాజకీయ మేధోమధన సదస్సు (
ఒంగోలు, విజయవాడ)
ఆ. ప్రజాసంఘాల మేధోమధన సదస్సు
(విశాఖపట్నం)
2.
అణగారిన సమూహాల ఆత్మ గౌరవ సదస్సు (హిందూపురం)
3.
ప్రత్యేక అంశం మీద పెట్టే సభలు.
రాజ్యాంగాన్ని పరిరక్షించడం – రాజ్యాంగం
ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తుంది (రాజమండ్రి)
అవసరం సందర్భాలను బట్టి ఏ అంశం మీద అయినా
సభలు పెట్తవచ్చు.
సభ థీమ్, స్వభావం నిర్ణయమయితే
ఉపన్యాసకులు నిర్ణయం అవుతారు.
సాధారణంగా MTF సభలు అన్నింటికీ నేను తప్పనిసరిగా హాజరు
అవుతాను. ఇక మన కో-కన్వీనర్లలో ఒకరిద్దరు వస్తారు. స్థానిక కో కన్వీనర్ ఎలాగూ
వుంటారు.
మన సభల్లో పాల్గొనడానికి ఇతర అణగారిన
సమూహాల నేతలు కూడా వస్తారు.
వీరిలో చీరాల బి. పరంజ్యొతి,
ఒంగోలు నూకతోటి రవికుమార్, విశాఖపట్నం
చైతన్య కృష్ణ, గుంటూరు వైకే ముఖ్యులు.
ప్రస్తుతం ఎక్కువ మంది ఆలోచనాపరులు
సహజంగానే హైదరాబాద్ లో వున్నారు.
సూరేపల్లి సుజాత, ఊ సాంబశివరావు,
జిలుకర శ్రీనివాస్, కదిరే కృష్ణ, చైతన్య
పింగళి. ఎన్ వేణుగోపాలరావు, పసునూరి రవీందర్ వీరిలో ముఖ్యులు.
అయితే హైదరాబాద్ నుండి ఆంద్రప్రదేశ్ లోని ఏ పట్టణానికి రావాలన్నా
రవాణ, వసతి, క్యాబ్, భోజనాల కోసం ఒక్కో
అతిథికి సగటున 3000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. వాళ్ల డేట్ లను చాలా ముందుగానే
నిర్ధారించుకోవలసి వుంటుంది.
మన ఉదయం సభల్ని లంచ్ తోపాటూ
జరుపుకోవచ్చు, లంచ్ లేకుండానూ జరుపుకోవచ్చు. అలాగే సాయంత్రం సభల్ని డిన్నర్ తోపాటూ
జరపవచ్చు డిన్నర్ లేకుండానూ జరుపుకోవచ్చు. రెండు పూటలా రెండు అంశాల మీద జరిపితే నిండుగా
వుంటుంది. మధ్యహ్నం సెషన్ ను వీలయినంత మేరకు సాహిత్య సభగా జరపండి. ఇటీవల ముస్లీం
సాహిత్యం చాలా విస్తారంగా వస్తున్నది. దాన్ని ప్రచారం చేయండి. ఎందుకంటే అణగారినవర్గాలకు సంబంధించి సాహిత్యం, రాజకీయం
కలిసి ప్రయాణించాలి. ఒకటి లేనిదే మరొకటి లేదు.
సభ ఖర్చులు
a.
Basic Model (Rs. 3000)
10 a.m. to 1.30 p.m.
i.
Hall Rent Rs. 1000
ii.
Two Mics Rs. 200
iii.
Flexies / Banners Rs.
400
iv.
Water, Tea & Snacks (1) Rs.
400
v.
Guest Accomodation Rs.
1000
Total Rs. Rs.
3000
b.
Medium Model (Rs. 9000 )
10 a.m. to 5 p.m.
i.
Hall Rent Rs. 1800
ii.
Mic Arrangement Rs.
200
iii.
Flexies / Banners Rs.
600
iv.
Water, Tea & Snacks (2) Rs. 400
v.
Guest Accomodation Rs.
1000
vi.
Lunch Veg for 50 Rs. 5000
Total Rs. Rs.
9000
c.
Premium Model (Rs. 20000 )
3-Star Hotel
10 a.m. to 5 p.m.
i.
Hall Rent Rs.
- -
ii.
Mic Arrangement Rs. --
iii.
Flexies / Banners Rs. 600
iv.
Water, Tea & Biscuites Rs. ---
v.
Guest Accomodation Rs. 2400
vi.
Lunch Veg + Non-veg for 40 Rs. 16000
vii.
Second time Tea 40 Rs. 1000
Total Rs.
అన్నింటికన్నా ముఖ్యమైనది ఏమంటే మన సభలను
షాదీఖానాలు, మసీదుల్లో నిర్వహించడం మొదలెట్టాలి.
మన ప్రచారం ఆలోచనాపరుల స్థాయి నుండి సామాన్యుల వరకు చేరాలి.
గతంలో ఇలాటి ప్రయత్నాన్ని సత్తుపల్లిలో
మన కో-కన్వీనర్ ఫయాజ్ అలీ చేశారు. MTF సభను స్థానిక మసీదులో నిర్వహించారు. ఆ రోజు మధ్యాహ్న
భోజనం కూడా ఆంధ్రా ముస్లింల సాంప్రదాయంలో బగారా ఖానా, దాల్చా, దహి చట్నీ, చికెన్ రోస్ట్
వడ్డించారు. ఇలా చేయగలిగితే ఖర్చు కూడా బాగా తగ్గిపోతుంది. మన ఆహార సాంప్రదాయం కూడా
కొనసాగుతుంది.
ఇవన్నీ కేవలం సూచనలు మాత్రమే. స్థానిక బాధ్యులు తమ శక్తి, ఆసక్తి, సృజనాత్మకతలను బట్టి అనేక మార్పులు చేర్పులు చేసుకోవచ్చు.
MTF సభలు ఎక్కడ జరిగినా బ్యానర్ మోడల్ మాత్రం ఒకేలా వుండాలి.
దానివల్ల మన సంస్థకు బ్రాండ్ ఇమేజి, పబ్లిక్ రిజిస్ట్రేషన్ పెరుగుతుంది. JPEG ఫార్మాట్
ను సోషల్ మీడియా కోసం వాడవచ్చు. బ్యానర్ల ప్రింటు
క్వాలిటీ పెరగాలంటే PSD Open Files ను వాడాలి.
Comments
Post a Comment