ముస్లిములకు మంత్రిపదవి కంటితుడుపు చర్య! Press Release


Muslim Thinkers Forum (MTF)
ముస్లిం ఆలోచనాపరుల వేదిక
Press Note -  Vijayawada 4 July 2018

ముస్లిములకు మంత్రిపదవి కంటితుడుపు చర్య!
ముస్లిములకు చంద్రబాబు చాలా అన్యాయం చేశారు

రాష్ట్ర మంత్రివర్గంలో ముస్లింలకు ప్రాతినిధ్యం కల్పించే ఆలోచన చేస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు.  అయితే, ఆంధ్రప్రదేశ్ ముస్లిం సమాజానికి ఇది కంటితుడుపు చర్య మాత్రమే. బడ్జెట్లు అన్నీ ప్రవేశపెట్టేసిన తరువాత, నిధుల కేటాయింపులన్నీ అయిపోయిన తరువాత మంత్రి పదవిని ఇవ్వడంవల్ల ముస్లింలకు ఒరిగేది ఏమీలేదు. ఇది ఒక చవుకబారు రాజకీయ విన్యాసం మాత్రమే !

ప్రధాని నరేంద్ర మోదీ మనోభావాలు దెబ్బతింటాయనే భయంతో  చంద్రబాబు గత నాలుగేళ్ళుగా ముస్లిం సమాజానికి తీవ్రమైన అన్యాయం చేశారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ముస్లింల ప్రాతినిధ్యంలేని  మంత్రివర్గాన్ని కొనసాగించారు. ఏడున్నర లక్షల కోట్ల రూపాయల నిధులతో ఐదు బడ్జెట్లను పెవేశపెట్టినప్పటికీ అందులో ముస్లింల అభ్యున్నతికి కేటాయించింది కేవలం రెండున్నర వేల కోట్ల రూపాయలుఉ మాత్రమే.  రాష్ట్ర జనాభాలో 8 శాతానికి పైగా వున్న ముస్లిం సామాజికవర్గానికి కేవలం 0.3 శాతం నిధులు కేతాయించడం ఏ విధమయిన సామాజికన్యాయం?  ఇప్పటికైనా ఆ తప్పును సరిదిద్దాలనీ, ఆ లోటును పూరించాలనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము.

ముస్లింలకు వ్యవసాయ భూములు లేవు; పరిశ్రమలు కూడా లేవు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం-పట్టిసీమ, అమరావతి, ప్రత్యేక తరహా హోదాల సాధనల వల్ల ముస్లిం సమాజానికి ఒనగూడే ప్రయోజనం ఏమీలేదు. అయినప్పటికీ రాష్ట్రంలోని ప్రధాన స్రవంతి మేలును కోరి ఈ పథకాలను ముస్లిం సమాజం బలపరుస్తున్నది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ముస్లిం సమాజపు అభ్యున్నతి కోసం ప్రత్యేకంగా ఒక బృహత్ పథకాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాము.

తమ పార్టి టిడిపి  అధికారంలోనికి వస్తే ముస్లింలకు విద్యా, ఉపాధి రంగాల్లో 8 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని 2011 నాటి ముస్లిం ప్లాన్ లో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ ప్రకారం రేపు జరగనున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఒక తీర్మానం చేసి ముస్లిం రిజర్వేషన్ల పెంపు ప్రక్రియను ఆరంభించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాము.

రాష్ట్ర ముస్లిం సమాజంలో నిరక్షరాశ్యత, ఉద్యోగలేమి, వృత్తి పరమైన  అభద్రతత తీవ్రస్థాయిలో వున్నాయి. ఈ కారణాలవల్ల ఓటర్ల నమోదు కార్యక్రమంలో ముస్లింలు చాలా వెనుకబడివున్నారు. ముస్లిం ఆలోచనాపరుల వేదిక  ఇటీవల నిర్వహించిన ఒక నమూనా సర్వేలో  ఓటర్ల జాబితాలో ముస్లింల సంఖ్య సగంకన్నా తక్కువగా వుందని తేలింది. ముస్లిం ఓటర్ల నమోదు కోసం ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఈ లోపాన్ని సరిదిద్దాల్సిందిగా  ప్రభుత్వాన్నీ, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సిఇఓ)ని కోరుతున్నాము.

ముస్లిం ఆస్తుల ధ్వంసం, ముస్లిం మహిళలు-బాలికల మీద అత్యాచారాలు, సాంస్కృతికంగా  ముస్లింలను అవమానించడం,  గోగ్రవాదుల మూకదాడులు వంటి సంఘటనలు రాష్ట్రంలోనూ  పెరుగుతున్నాయి. సమాజంలో అశాంతిని రెచ్చగొట్టే ప్రమాదమున్న ఈ సంఘటనల్ని అరికట్టడానికి  ముస్లిం (అత్యాచార నిరోధక) చట్టం ఒక దాన్ని రూపొందించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము.  

విడుదల చేసినవారు

1.     Vijayawada  
యం ఖాన్ యజ్దానీ (డానీ), కన్వీనర్, ముస్లిం ఆలోచనాపరుల వేదిక
A M Khan Yazdani (Danny) , Convener, Muslim Thinkers Forum (MTF)
Mobile 9010757776

2.     Visakhapatnam
జహా ఆరా, ఆడ్వకేట్, కో- కన్వీనర్, ముస్లిం ఆలోచనాపరుల వేదిక
Mobile 98490 72627

3.     Kakinada
 హసన్ షరీఫ్, కో- కన్వీనర్, ముస్లిం ఆలోచనాపరుల వేదిక
Mobile 98495 95898


4.     Ongole
నబీ కరీం ఖాన్, కో- కన్వీనర్, ముస్లిం ఆలోచనాపరుల వేదిక
Mobile – 99859 82292  

5.                 Anantapur
ఉమర్ ఫారూఖ్ ఖాన్, కో- కన్వీనర్, ముస్లిం ఆలోచనాపరుల వేదిక
Mobile –  93469 43336

Comments

Popular posts from this blog

*జిల్లాల్లోని ప్రధాన సమస్యల్ని పోస్టు చేయండి*

Crusades - 1095–1291

Ahmad Khan - French Revolution