Press Note - పత్రికా ప్రకటన 3-6-2018
పత్రికా ప్రకటన 
23, 24 తేదీల్లో ముస్లిం మేథావుల సదస్సు
ఒంగోలులో  నిర్వహిస్తున్న ఎంటిఎఫ్ 
తేదీ 3 జూన్ 2018  మీడియాసంస్థ
................................  లోకల్  ............................. 
ఒంగోలులో జూన్ 23, 24 తేదీల్లో 'ఆంధ్రా ముస్లిములు : దశ దిశ - 2019' పేరుతో ముస్లింల రాజకీయ విధాన సదస్సు నిర్వహించనున్నట్లు ముస్లిం ఆలోచనాపరుల వేదిక (ఎంటిఎఫ్) ప్రకటించింది.  వేదిక  కన్వీనర్ ఏ. ఎం. ఖాన్ యజ్దానీ (డానీ) విజయవాడ ప్రెస్క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ 2019 జరగబోయే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలు అనుసరించాల్సిన వ్యూహాన్ని ఈ  మేధోమధన సదస్సులో నిర్ణయిస్తామన్నారు.
ఈ సదస్సుకు రాష్ట్రంలోని  13 జిల్లాల నుంచి 150 మంది ముస్లిం ఆలోచనాపరులు, వృత్తి నిపుణులు పాల్గొంటారని చెప్పారు. 
బీజేపీతో విడిపోయిన కారణంగా ముస్లిములు ఈసారి ఎన్నికల్లో టిడిపిని బలపరుస్తారని చంద్రబాబు ఆశిస్తున్నారనీ అయితే, నాలుగేళ్లుగా టిడిపి ప్రభుత్వం తమకు చేసిన అన్యాయాన్ని ముస్లింలు మరచిపోలేదని
డానీ అన్నారు. బీజేపీతో పొత్తు ఉన్నకారణంగా రాష్ట్ర ప్రభుత్వంలో ముస్లిములకు మంత్రి పదవి ఇవ్వలేకపోయానని చంద్రబాబు
గతంలో అన్నారని ఆయన అన్నారు.  ఇప్పుడు బీజేపీతో
పొత్తు చెడిపోవడమేగాక, మంత్రివర్గంలోనూ ఖాళీలున్నాయని ఆయన గుర్తు చేశారు.   ఇప్పటికైనా చంద్రబాబు తన కేబినెట్ లో ఒక్క  ముస్లింను అయినా మంత్రిగా నియమించాలని  డానీ కోరారు. 
 వై.
ఎస్. రాజశేఖర్రెడ్డి ముస్లిములకు రిజర్వేషన్లు కల్పించిన  కారణంగా
ఆంధ్రా ముస్లిములు వైసిపికే ఓట్లు వేస్తారని వై.ఎస్. జగన్ భావిస్తున్నారని ఆయన అన్నారు.
రాజశేఖర రెడ్డి మీద నమ్మకంతో 2004లో, రాజశేఖర రెడ్డి మీద కృతజ్ఞతతో 2009లో ముస్లింలు
కాంగ్రెస్ కు ఓట్లేశారనీ,   2014లో జగన్ మీద
సానుభూతితో  ముస్లింలు ఓట్లేశారని గుర్తుచేశారు.
అక్కడితో ఆ అధ్యాయం ముగిసిందన్నారు.  జీవితాంతం
ముస్లింలు తనకు రుణపడివుంటారని జగన్ ఆశించడం తప్పు అన్నారు. అంతేకాక, వచ్చే ఎన్నికల్లో
జగన్ మతతత్వ శక్తులతో చేతులు కలిపితే ముస్లిములు అతనికి  నంద్యాల వంటి గుణపాఠం నేర్పుతారని అన్నారు. ఉత్తర ప్రదేశ్లో ఇటీవల జరిగిన కైరా లోక్సభ ఉప ఎన్నికలో వచ్చిన ఫలితం రానున్న రోజుల్లో బీజేపీకి  దేశమంతటా ఎదురౌతుందన్నారు. 
సంఘ్ పరివారం గోగ్రవాదుల ఆగడాలకు వ్యతిరేకంగా ఒక డిక్లరేషన్ను ఈ సదస్సులో ప్రకటిస్తామన్నారు. చట్టసభల్లో ముస్లింల ప్రాతినిధ్యాన్ని  పెంచుకోవాలనే లక్ష్యంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు.
ఈ సమావేశంలో వేదిక సభ్యులు సయ్యర్ రఫీ, మొహమ్మద్ అబ్దుల్ ఖాదర్ పాల్గొన్నారు.
ప్రకటన జారీచేసినవారు 
AM Khan Yazdani (Danny),
Convener, Muslim Thinkers Forum (MTF). 
ముస్లిం ఆలోచనాపరుల వేదిక (ఎంటిఎఫ్)
 కన్వీనర్ ఏ.యం. ఖాన్  యజ్దానీ (డానీ)
mobile : 9010757776 , e-mail
ID : khanyazdani@gmail.com 
Comments
Post a Comment