MTF Meetings Protocol


MTF Meetings Protocol

ఆశయాల  సాధన  కోసం ప్రచారం, సమీకరణ, ఆందోళనలు అనే మూడు విభాగాలని మనం అనుసరిస్తాము. ఇవన్నీ ఒక దాని మీద మరొకటి ఆధారపడివుంటాయి.  ఆశయాలను రూపొందించుకోకుండా ప్రచారానికి విషయం వుండదు.  ప్రచారం లేకుండా స్వీయ సమాజానికి మన గురించీ, మన ఆశయాల గురించీ తెలియదు. స్వీయసమాజానికి మన గురించీ, మన ఆశయాల గురించీ తెలియకపోతే సమీకరణ సాధ్యంకాదు. స్వీయసమాజాన్ని సమీకరించకుండా ఆందోళనలు చేపట్టలేము. ఆందోళనలు చేపట్టకుండా మన ఆశయాల  సాధన   సాధ్యంకాదు.

1.            Policy Making Meetings
ఆశయాల రూపకల్పన కోసం మనం  ప్రచారం లేకుండా విధాన రూపకల్పన సభ్యులు లేదా కోర్ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశం అవుతాము. వీటిని in-Camera meetings అంటారు. ఈ సమావేశం నిర్ణయాలను మీడియాకు విడుదల చేయడం చేయకపోవడం అనేది సందర్భాన్ని బట్టి.

2.            Press Notes, Meetings & Briefings
మన కార్యక్రమాలకు మీడియా చాలా అవసరం. మనం సభలు పెడితే 50-100 మంది వస్తారు. మీడియా ద్వార మన సందేశం దానికి పది రెట్లుకన్నా ఎక్కువ మందికి చేరుతుంది. అయితే, మనకు స్వంత మీడియా లేదు. సమీప భవిష్యత్తులో రాదు. ప్రస్తుతానికి మనం పరాయి మీడియా మీద ఆధారపడకతప్పదు.   ఎప్పుడూ మీడియా మీద అలగవద్దు. మనమేమీ  కమ్మర్షియల్ మీడియాను సంస్కరించలేం. వున్న మీడియానే తెలివిగా, సహనంగా  సాధ్యమయినంత ఎక్కువగా వాడుకోవాలి.

మన విధానాల ప్రచారానికి మనం ప్రధాన స్రవంతి మీడియా అవకాశాన్ని ఉపయోగించుకుంటాము. మీడియా సమావేశాలు నిర్వహించడం, ప్రెస్ నోట్ లు విడుదల చేయడం, MTF రాష్ట్ర కమిటి విడుదల చేసే ప్రకటనల్ని స్థానిక మీడియాకు విడుదల చేయడం మొదలైనవి  ఇందులో భాగం.  కొన్ని రాష్ట్ర కమిటి ప్రకటనల్ని జిల్లా  నాయకులు  తమ పేరు, హోదాను చేర్చి  స్థానికంగా మీడియాకు విడుదల చేయవచ్చు.

అలాగే MTF నిర్వహించే ప్రతి కార్యక్రమానికి మీడియాను ఆహ్వానించడం మరచిపోరాదు. కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టగానే మీడియాకు చెప్పాలి.  కార్యక్రమానికి ఒక  వారం రోజులు ముందుగా మీడియాకు మళ్ళీ గుర్తు చేయాలి. కార్యక్రమానికి ఒక రోజు ముందు తప్పని సరిగా  ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాలి. ఆ కవరేజి కర్టెన్ రైజర్ గా పనికి వస్తుంది.  కార్యక్రమం రోజు  బహిరంగా సమావేశానికి మీడియాను సాదరంగా ఆహ్వానించాలి. కార్యక్రమం ముగిశాక తీర్మానాలను తప్పకుండా మీడియాకు వివరించాలి. MTF  ప్రముఖులు కొందరు న్యూస్ ఛానళ్ళు, కేబుల్ టీవీ లకు Sound Bytes ఇవ్వడం ఇంకా మంచిది.

మనం ప్రెస్ మీట్ కు పిలిచినంత మాత్రాన పెద్ద పెద్ద రిపోర్టర్లు వచ్చేస్తారని, భారీ కవరేజి వచ్చేస్తుందని ఎప్పుడు ఆశించవద్దు. మీ పత్రికా విలేకరుల సమావేశానికి పేట స్ట్రింగర్ కూడా రాకపోవచ్చు. అయినా ఆ ప్రయత్నం కొనసాగిస్తూనే వుండాలి.  మీడియా పనివిధానంలో కొన్ని సమీకరణలు కలిసివచ్చినపుడు మనకు కొంచెం కవరేజి రావచ్చు. అప్పుడప్పుడు పెద్ద కవరేజి కూడా రావచ్చు. మన ప్రయత్నం మాత్రం మనం చేస్తుండాలి.

MTF జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో మీడియాతో సత్సంబంధాల కోసం ఒకర్ని ఎంపిక చేసుకోవడం చాలా మంచిది.  

3.            Social Media
ప్రధాన స్రవంతి మీడియాను మనం శాసించలేముగానీ, ఫేస్ బుక్, వాట్స్ ఆప్ వంటి  సామాజిక మాధ్యమాలను మనం ఇష్టం మేరకు  వాడుకునే అవకాశం వుంది. మెసెంజర్, వాట్స్ ఆప్ లలో MTF ఒక గ్రూపును నిర్వహించవచ్చు.  MTF సభ్యులు రోజుకు ఎదో ఒక పోస్టు పెడుతుండాలి. MTF ఆశయాలకు అనుకూలమైన పోస్టుల్ని షేర్ చేస్తుండాలి. MTF రాష్ట్ర కమిటి విడుదల చేసే ప్రకటనల్ని మీ పేరుతో మళ్ళీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండాలి.  ఇది సభ్యుల కనీస బాధ్యత.

సోషల్ మీడియాలో వుండే ఫ్రెండ్స్ లో అత్యధికులు ప్రచార యావ కలవారు. అంచేత 90 శాతం మంది కేవలం సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టి తమ సరదా తీర్చుకుంటుంటారు. వీరు తరచూ నేల విడిచి సాము చేస్తుంటారు. తమను తాము అపర ఉద్యమకారులుగా ఊహించుకుంటుంటారు. వీరిలో అతిశయం చాలా ఎక్కువ మోతాదులో వుంటుంది. వీరిని నమ్మి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకూడదు.  మోసపోతాం.  ఒక్క పది శాతం మంది మాత్రమే కాస్త నేల మీద నిలబడి ఆలోచించి మాట్లాడుతారు. వీరిని గుర్తించి వారితో మాత్రమే కార్యక్రమాల్ని రూపొందిస్తూ వుండాలి.

90 శాతం పనికి రాని వాళ్ళు వున్నాసరే సోషల్ మీడియాతో ఒక ప్రయోజనం వుంది. మన సంస్థ గురించి పదిమందికి తెలియడానికీ,  బ్రాండింగ్ కావడానికీ తొలి దశలో సోషల్ మీడియా పనికి వస్తుంది. తరువాతి దశలో మన పనితీరే మన సంస్థను  నోటి ప్రచారం చేస్తుంది.

4.            Types of  Meetings
మనది అస్తిత్త్వవాద  సంస్థ. ప్రధాన స్రవంతి సంస్థల్లా మన దగ్గర ఆర్ధిక వనరులు వుండవు. మనం ప్రభావశీలంగా మారే వరకు మన సంస్థ కార్యక్రమాలకు పెద్దగా స్పందన రాదు. జార్జి ఫెర్నాండేజ్ 1970లలో చెప్పిన ఒక మాటను మనం గుర్తు పెట్టుకోవాలి. మనం ఇద్దరం వుంటే ప్రెస్ మీట్ పెట్టవచ్చు. ఆరుగురం వుంటే ఆంతరంగిక సమావేశం, 15 మంది వుంటే రౌండ్ టేబుల్ సమావేశం. 30 మంది వుంటే బహిరంగ సభ. 50 మంది వుంటే మహాసభ.

తక్కువ మందితో మొదలయ్యి జనసముద్రంగా మారిన  ఉదాహరణలు ప్రవక్త ముహమ్మద్ (వారికి శాంతి కలుగుగాక) చేపట్టిన ఇస్లామ్ ఉద్యమంలోనూ కనిపిస్తాయి. మనం ముగ్గురిగా మొదలయ్యి ఏడాదిలో వంద మందిమి కాగలిగాము. ఇక ముందు ఈ వేగం మనం ఊహించనంతగా పెరుగుతుంది.

5.            వర్తమాన సమాజంలో ముస్లింలు భావోద్వేగ అంశాల మీద స్పందించినట్టుగా రాజకీయార్ధిక అంశాల మీద స్పందించరు. సామాజిక అభద్రత దీనికి కారణం. ఇస్లాం మీద విశ్వాసం లేని వారిని ముస్లిం సమాజం విశ్వసించదు. 

6.            ఇప్పటి వరకు మనం ప్రెస్ మీట్ లు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మేధోమధన సదస్సులు మాత్రమే నిర్వహించాము.  త్వరలో ఇన్ డోర్ బహిరంగ సభలు, ఔట్ డోర్ బహిరంగ సభలేకాక, మహాసభలు కూడా నిర్వస్తాము.

7.            MTF Meetings
మనం ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF) పేరుతో మాత్రమే నిర్వహిస్తాము.

8.        సభా నిర్వహణ ఖర్చులకు దాతలు ఎవరయినా విరాళాలు ఇచ్చినా  కార్యక్రమం మాత్రం MTF  పేరుతోనే జరగాలి. విరాళాలు, ఆతిథ్యం ఇచ్చినవారికి (వారికి అభ్యంతరం లేకుంటే)   సభా ముఖంగానే ధన్యవాదాలు చెపుతాం.

9.     విరాళాలు, ఆతిథ్యం ఇచ్చేవారు ఆరెస్సెస్ – బీజేపి తప్ప ఎవరయినా కావచ్చు. మనకు అభ్యంతరంలేదు.

10.       విరాళాలు, ఆతిథ్యం ఇచ్చేవారి రాజకీయాభిప్రాయాలు, అనుబంధాలు ఏ విధంగానూ MTF సభాకార్యక్రమాలనుగానీ, ప్రసంగాలనుగానీ  ప్రభావితం చేయకూడదు.  ఇతరుల జోక్యాన్ని గట్టిగా నిరోధించాలి. విరాళాన్ని స్వీకరించడానికి ముందే ఆ విషయాన్ని వారికి స్పష్టంగా చెప్పాలి.

11.       సాటి అణగారినవర్గాలు, సామ్యవాద, మతసామరస్యవాద, మానహక్కుల, పౌరహక్కుల, ఉదారవాద సంఘాల ప్రతినిధుల్ని మన కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయడం   మంచి సాంప్రదాయం.

12.       అయితే, ముస్లిం సమాజపు అంతర్గత అంశాల మీద సదస్సులు పెట్టినపుడు మాత్రం కేవలం ముస్లింలను మాత్రమే ఆహ్వానించాలి. 

13.       సాటి అణగారినవర్గాలు, సామ్యవాద, మతసామరస్యవాద, మానహక్కుల, పౌరహక్కుల, ఉదారవాద సంఘాలు నిర్వహించే సభలు, సమావేశాల్లో  MTF  ప్రతినిధిగా  మాత్రమే పాల్గొనాలి.  సాహిత్య సభలకు మాత్రం ఈ నిబంధనలో సడలింపు వవుంటుంది.

Joint Meetings
14.       కొన్ని ప్రత్యేక అంశాల మీద మరో సంఘంతోగానీ, అనేక సంఘాలతోగాని సంయుక్త  సభలు పెట్టినపుడు నిర్వాహకుల పేర్లలో మన సంఘం పేరు వుండేలా జాగ్రత్త పడాలి.

15.        సాంప్రదాయ ఇన్ డోర్ బహిరంగ సభల్లో ఉపన్యాసకులు ఓ అర డజను మంది వుంటారు. శ్రోతలు ఓ 40 మంది వుంటారు.

16.       అవుట్ డోర్ బహిరంగ సభల్లో ఉపన్యాసకులు ఓ డజను మంది వుంటారు. శ్రోతలు ఓ వెయ్యి మంది వుంటారు.

17.       సాంప్రదాయ ఇన్ డోర్ బహిరంగ సభనూ, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సునూ కలిపి కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు. ఈ పధ్ధతిలో అందరూ శ్రోతల స్థానంలో కూర్చుంటారు. వక్తలు ఒక్కొక్కరు వేదిక మీదికి వెళ్ళి మాట్లాడి కిందికి వస్తుంటారు.  

18.       మేధోమధన సదస్సు భిన్నమైనది. ఒక ప్రత్యేక అంశం మీద విధాన నిర్ణయం చేయడానికి ఇలాంటివి జరుపుతుంటారు. అంశం ఒక్కటే కనుక అందరూ  తమ అభిప్రాయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పేస్తే మెజారిటీ అభిప్రాయాన్ని తేల్చవచ్చు.  లేదా మూజువాణీగానూ సదస్సు నిర్ణయాన్ని ప్రకటించవచ్చు. అయితే వీటిల్లో పాల్గొనేవారికి అకడమిక్ (విద్వైక్య) సంస్కృతి వున్నప్పుడే  ఫలితం వస్తుంది. లేకుంటే,  మేధోమధన సదస్సుల్ని నిర్వహించడం చాలా క్లిష్టమైన వ్యవహారం.

19.       మేధోమధన సదస్సులు విఫలం చెందడానికి ప్రధానంగా పది కారణాలుంటాయి.

మొదటిది; సదస్సులో పాల్గొనే వాళ్ళు చర్చనీయాంశం మీద కొంత మేధోమధనం చేసి  ఒక నిర్దిష్ట అభిప్రాయాన్ని ఏర్పరచుకుని రారు.
రెండు; తమ ప్రతిపాదనని నిర్ణిత సమయంలో ముగించరు.
మూడోది; తాము ఎక్కువ సమయం తీసుకోవడం అంటే ఇతరుల వాక్ స్వాతంత్ర్యాన్ని హరించడం అవుతుందని  అర్ధం చేసుకోరు.
నాలుగోది; ఎక్కువసేపు మాట్లాడితే  నాయకులు అనిపించుకోవచ్చు అనే భ్రమల్లో వుంటారు.
ఐదవది; ఎజెండాతో సంబంధంలేని సాధారణ అంశాలను మాట్లాడుతారు.
ఆరవది; వ్యక్తిగత ఎజెండాలతో  సదస్సులకు వస్తారు.
ఏడవది; వేల మంది  ముస్లింలను క్షణాల్లో కదిలించే శక్తి తమకు వున్నట్టు గొప్పలు చెప్పుకుంటారు. తమ స్థాయికి తగ్గట్టు సౌకర్యాలు కల్పించలేదని అలుగుతారు.
ఎనిమిదవది; తమ స్వీయానుభవాన్ని (డేటాను) విపులంగా చెప్పి అదే మేధస్సు అనుకుంటాడు.
తొమ్మిదవది; మనుషులు స్వర్గంలో స్థానం కోసం ప్రత్నించాలిగానీ భూమి మీద ప్రయోజనం కోసం ఆరాటపడరాదని వేదాంతం వల్లిస్తారు.
పదవది ; ఎజెండా మీద ఏ అభిప్రాయమూ చెప్పకుండా నిర్వాహకులకు ఆశిస్సులు  చెప్పేసి కూర్చుంవదం మర్యాదస్తుల లక్షం అనుకుంటారు.

పై పది తప్పుల్ని  అదుపు చేయగలిగినపుడే మేధోమధన సదస్సులో సరయినా నిర్ణయం వస్తుంది.

20.       ముస్లింల సభలు నిర్వహించడంలో నమాజ్ వేళల్ని పాటించడం ఒక తప్పని సరి నిబంధన. జొహర్ , అసర్, మొగరీబ్, ఎషా  నమాజ్ వేళల్ని దృష్టిలో వుంచుకుని విశ్రాంతి ఇవ్వాల్సి వుంటుంది.

21.       కార్యక్రమాల కోసం సరదాపడి  ఎక్కువ నిధులు దమ్ములు ఖర్చు పెట్టరాదు. అవసరమైన మేరకు మాత్రమే ఖర్చుపెట్టాలి. వున్న నిధులన్నిమ్టినీ ఒకే కార్యక్రమానికి ఖర్చు పెట్టేస్తే ఆ తరువాత కార్యక్రమాలు చేపట్టడానికి నిధులు వుండవు. కార్యక్రమాలు కుంటుపడిపోతాయి.

22.       రౌండ్ టేబుల్ గానీ, మిక్సిడ్ రౌండ్ టేబుల్ గానీ,  ఇన్ డోర్ బహిరంగ సభకు గానీ  ఖర్చులు దాదాపు ఇలా వుంటాయి.

a.     Ideal timing  9.30 a.m. – 1.30 p.m.
b.     Hall Rent (AC)                                Rs. 1000               1500
c.      Podium, Extra Mic                         Rs. 500                 500
d.     Press Conference                          Rs. 600                  1000
e.     Back Drop Flexi (Big & Small)      Rs. 500                 600
f.       Water , Tea, Snacks (50)               Rs. 700                 1000
g.     Hall clearance Charges                Rs. 100                 200
h.     Guest Accommodation                 Rs. 1000                1000
Rs. 4400              5800
Additional
i.        Lunch  for Out station Guests      Rs. 600                  900
j.        Chief Guest Travelling                  Rs. 1000                1000             

Rs. 6000             7700
23.    Invitations and Attendance Rtio
సభలకు శ్రోతలు హాజరు కావడానికి ఒక నిష్పత్తి వుంది. నలుగురికి రెండేసిసార్లు ఫోన్ చేస్తే ఒకరు హాజరు అవుతారు. అంటే ఓ రెండు వందల మందికి రెండేసిసార్లు ఫోన్లు చేస్తే 50 మంది వరకు హాజరయ్యే అవకాశం వుంది. 4:1 అనేది సాధారణ నిష్పత్తి. ముస్లింలకు సభల సాంప్రదాయం తక్కువ గాబట్టి. ముడు వందల మందిని పిలిస్తే 50 మంది వస్తారు.


Comments

Popular posts from this blog

MTF - Charter Of Demands for Elections - 2019

*జిల్లాల్లోని ప్రధాన సమస్యల్ని పోస్టు చేయండి*

Muslim programme to confront the ‘Neo Manuism’