Muslim Meeting To decide Political Stand


Muslim Meeting To decide Political Stand
మిత్రులారా!

జై మీమ్!  

విషయం - ‘ముస్లిం రాజకీయ విధాన నిర్ణయ సదస్సు’.

28 మే 2018 సోమవారం ఒంగోలులో MTF  కీలక సమావేశం జరిగింది.
2019 సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముస్లింలకు ఎలాంటి  దిశానిర్దేశనం చేయాలనేది ఈ సమావేశం లక్ష్యం.

MTF కన్వీనర్ స్థాయిలో ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ), కో-కన్వీనర్ స్థాయిలో నబీ కరీం ఖాన్, MTF ప్రకాశం జిల్లా సభ్యుడు రసూల్ ఖాన్, FDCA నాయకులు కేయం సుభాన్,  బరవే నాయకుడు నూకతోటి రవికుమార్, స్థానిక విద్యాసంస్థకు చెందిన షేక్ అబ్దుల్ (SA)  కరీముల్లా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

పార్లమెంటరీ రాజకీయ పార్టీలు గతంలో ముస్లింలను కనీసం ఓటు బ్యాంకుగా భావించేవారనీ ఇప్పుడు ఆ గుర్తింపు కూడా పోయిందని సమవేశం అభిప్రాయపడింది. మతతత్త్వ శక్తులు భారత ముస్లింలకు ప్రధాన శత్రువుక్లని సమావేశం ప్రటించింది. రాబోయే ఎన్నికల్లో మతతత్త్వ జాతీయ కూటమినీ,  వాటితో పొత్తులు పెట్టుకునే ప్రాంతీయ పార్టీల్ని ఓడించడం మన వ్యూహమని  కావాలని ఒక ఏకాభిప్రాయం వచ్చింది. అయితే “ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఎలాంటి ఎత్తుగడలు అనుసరించాలి?” అనే కీలక విధానాన్ని  రూపొందించడానికి  రాష్ట్రంలోని ముస్లిం ఆలోచనాపరులతో కనీసం రెండు రోజులపాటు ఒక విస్తృత మేధోమధన సదస్సు నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది.

సమావేశం నిర్ణయాలు
1.            ఈ సదస్సు MTF ఆధ్వంలో జరుగుతుంది.
2.            రంజాన్ పండుగ జరుపుకున్న వారం రోజుల తరువాత దీన్ని నిర్వహిస్తాము.
3.             దీని వర్కింగ్ టైటిల్ ‘ముస్లిం రాజకీయ విధాన నిర్ణయ సదస్సు’. ఈ టైటిల్ ను  మరింత ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు. 
4.            ఇది ముస్లిం ఆలోచనాపరుల సదస్సు. సద్దసు నిర్వహణకు సోదర అణగారిన  సమూహాలు, సంస్థల సహకారం తీసుకున్నప్పటికీ సదస్సు చర్చల్లో కేవలం ముస్లిం ఆలోచనాపరులు మాత్రమే పాల్గొంటారు.
5.            (సంఘీయులుతప్ప) విభిన్న రాజకీయాల్లో, రాజకీయ పార్టీల్లో వున్న ముస్లింలు కూడా ఈ సదస్సులో పాల్గొనవచ్చు.
6.            ముఖ్యులైన ముస్లిం ఆలోచనాపరులు కొందరిని ప్రాధాన్యతను బట్టి పొరుగు రాష్ట్రాల నుండి కూడా ఆహ్వానించవచ్చు.
7.            ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల నుండి నలుగురు చొప్పున  ముస్లిం ఆలోచనాపరుల్ని ప్రతినిధులుగా ఈ సమావేశానికి పిలిపించాలి.
8.            ముస్లిం సమాజంలోని ఖబీలాలు (BC-E జాబితాలో వున్నవారు, లేనివారు) అన్నింటికీ ప్రాతినిధ్యం కల్పించాలి.
9.            ఈ సదస్సు ఒంగోలులో జరుగుతుంది.
10.       MTF కో-కన్వీనర్ నబీ కరీం ఖాన్ ఈ సదస్సు నిర్వహణ బాధ్యునిగానూ,  ఆహ్వాన సంఘానికి  కార్యదర్శిగానూ వుంటారు.
11.       ఆతిథ్యం ఇచ్చే స్థానిక దాత  ఆహ్వాన సంఘానికి అధ్యక్షునిగా వుంటారు.
12.       సదస్సుకు సహకరించే బరవే, FDCA తదితర సంస్థల ప్రతినిధులు ఆహ్వాన సంఘంలో సభ్యులుగా వుంటారు.

హైదరాబాద్
30 మే 2018


‘ఆంధ్రా ముస్లింలు : దశ- దిశ’ 
ముస్లిం ఆలోచనాపరుల రాజకీయ విధాన నిర్ణయ సదస్సు

జూన్ 23,24 శని, ఆదివారాలు, ఒంగోలు

Comments

  1. మీ అభిప్రాయాలను, సూచనలను blog లోనే రాయండి. చర్చ ఇక్కడే జరగాలి.

    ReplyDelete
  2. అందరూ అభిప్రాయాలు తెలియచేయండి

    ReplyDelete
  3. గొప్ప ప్రారంభం. రాజకీయ విధాన సదస్సు వంటి అకడమిక్ టైటిల్ కన్నా ’’ఆంధ్రా ముస్లిములు : దశ - దిశ‘‘ వంటి టైటిల్ ఏదన్నా బాగుంటుందేమో ఆలోచించాలి. ఒకసారి టైటిల్ జనంలోకి క్యాచీగా ఉండేలా చూడాలి. మార్కెటింగ్ ఇక్కడ చాలా ముఖ్యం.

    ReplyDelete
  4. మంచి‌ ఆలోచన.

    ReplyDelete
  5. ఆంధ్రా ముస్లింలు: దశ-దిశ
    బాగుంది

    ReplyDelete
  6. Is it "Andhra Muslims" OR "Telugu Muslims"..? :)

    ReplyDelete
  7. ఆంధ్రా లో ఉన్నవి 175 సీట్లు
    మేజిక్ ఫిగర్ 88
    Nda నుండి బైటకొచ్చి బాబు టిడిపి కి‌ ఎడ్జ్ ఉండేలా వ్యూహం పన్నాడు.
    ప్రభుత్వానికి ఉండే anti incumbency జగన్ కి లాభిస్తుంది.
    కనుక అలయన్స్ పై ఆధారపడక తప్పని స్థితి. జగన్ , టిడిపిల మధ్య ముస్లిం ఓట్లు తప్పక‌ చీలతాయి.
    ఇక కాంగ్రెస్ ‌,బాబు చేయికలిపితే కాంగ్రెస్ కి జీవం పోసినట్లే.
    ఇక‌ పవన్ కళ్యాణ్ ఎక్కువ ప్రభావం చూపగలడా? లేదా ? అన్నది ఇప్పుడే చెప్పలేం.
    ఎలక్షన్ వేవ్ చివరి పదిరోజుల్లో కూడా మారిపోయేంత గతిశీలక మైంది‌ ఈ రోజుల్లో.
    ఒకవేళ అతను 15 సీట్లు సాధించినా అతను కీలక మవ్వచ్చు‌
    అలాంటి పరిస్థితులు వస్తే‌
    ఇక్కడ కూడా హంగ్ తప్పని పరిస్థితి.
    కనుక ముస్లిం ఓట్ బిజెపి కి తలాక్ ఇచ్చిన టిడిపి‌ కా లేదా, బహిరంగముగా ‌భాజపా ను విమర్శించని జగన్ కా అన్నది నిర్ధారించాలి.
    ఏదేమైనా మనముందున్న ఈపని కత్తి మీద సామే

    ReplyDelete
  8. వాహెద్ గారు సూచించిన ‘ఆంధ్రా ముస్లింలు : దశ- దిశ’ శీర్షిక బాగుంది. ఇంతకన్నా మంచిది వచ్చే వరకు ఇదే మన శీర్షిక.

    ReplyDelete
  9. ‘ఆంధ్రా ముస్లింలు : దశ- దిశ’ సదస్సులో మనం రాజకీయ విశ్లేషణలు చేయడంలేదు. దానివల్ల ప్రయోజనమూ లేదు. ముస్లింల ఓట్లకు గుర్తింపు తేవడమే మన ఎత్తుగడ (Tactics) తక్షణ లక్యంట్. ఒక పార్టీని గెలిపించ గలిగినా మనకు గుర్తింపు వస్తుంది. లేదా ఒక పార్టీని ఓడించ గలిగినా మనకు గుర్తింపు వస్తుంది. ఏది చేసినా చెప్పి చేయాలి.

    ReplyDelete
    Replies
    1. మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.
      ముస్లిం సమాజం ఎటు ఉంది? నాయుడు వైపా,రెడ్డి వైపా అనే దానికి విశ్లేషణ కావాలి.
      అది తెలుసు కోడానికి తక్కువ ఎఫర్ట్ తో ఏదైనా శాంపిల్ సర్వే కూడా లాభదాయకం కాగలదు.

      Delete
  10. రాష్రంచeలో ముస్లింలు ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారో చెప్పడం మెయిన్ stream మీడియా పని. లేదా సర్వే సంస్థల పని. ముస్లిం ఆలోచనాపరులు చెయ్యాల్సింది అదికాదు. ముస్లింలు ఎవరికి ఓటు వేయాలో ముస్లీం ఆలోచనాపరులు చెప్పాలి.

    ReplyDelete
  11. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఏ పార్టీకి మద్దతివ్వాలి, ఏ పార్టీని గెలిపించాలి అనే అంశాల్లో ముస్లింలకు పెద్దగా ఆప్షన్స్ ఉన్నాయని నాకనిపించట్లేదు.

    రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు -పీ.కె, జగన్, సీబియన్.. వీరిలో ఏ ఒక్కరూ బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించేవారు కారు. ఇప్పుడు కూడా, వీరిలో ఎవరు బీజేపీతో లోపాయికారీ ఒప్పందంలో ఉన్నారో, రాబోయే ఎన్నికల్లో ఎవరు బీజేపీతో బహిరంగంగా పొత్తుపెట్టుకుంటారో, ఎన్నికల్లాయ్యాక ఎవరు కలుస్తారో కూడా చెప్పలేని పరిస్థితి.

    సీబీయన్ నిన్నటి వరకూ బీజేపీతో చెట్టపట్టాలేసుకుని తిరిగారు. పంపకాల్లో ఏవో తేడాలొచ్చి ఇప్పుడు వాళ్లూ-వాల్లూ కొట్టుకుంటున్నారు.( పైకి కనబడేవరకూ). మిగతా ఇద్దరూ బీజేపీని తిట్టట్లేదు కాబట్టి, సీబీయెన్ ఒక్కరే తిడుతున్నారు కాబట్టి ముస్లింలు అతనికే మద్దతివ్వక తప్పని పరిస్థితి.

    మొత్తం మీద, నా అభిప్రాయం - ముస్లింలు రాజకీయంగా చైతన్యవంతం కావాలి. ఏదో ఓ పార్టీలో చేరి, ఏదో ఓ నాయకుని పంచన చేరి ఉన్నంతవరకూ ఆ చైతన్యం రావడం అనేది అయ్యేపని కాదు. ఓ సమూహంగా ముస్లింలు ఇండిపెండెంట్ గా సంఘటితం కావాలి. తమలాగే సొంత పార్టిలు లేని ఇతర వర్గాలైన దలితులు, బీసీలతో కలిసిపనిచేయాలి. ఆ కలవడం అనేది జరగకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాంటీ ఇస్లామిక్ ప్రాపగాండా బలంగా పనిచేస్తుంటుంది. దానిని కూడా సమర్థవంతంగా హ్యాండిల్ చేసుకోవాలి. నిజమైన ఇస్లామిక్ విలువల్ని ఆచరణలో చేసి చూపడమే కాకుండా, వీలైనప్పుడల్లా ఇతరులకు చెప్తూ ఉండాలి. అలా చేస్తే మతప్రచారం చేస్తున్నామని కొందరు తటస్థులు నొచ్చుకుని దూరం జరిగే ప్రమాదం కూడా ఉంది. "అది మత ప్రచారం కాదూ, - మాకు వ్యతిరేకంగా జరుగుతున్న చెడు ప్రచారానికి విరుగుడు ప్రచారమే" అని వారికి కూడా చెప్పుకోవాలి. పైకి చూడటానికి ఇదంతా కత్తిమీద సాములా అనిపించొచ్చు కానీ, ప్రవక్త జీవితాన్ని, ఆయన దాటొచ్చిన సవాల్లనూ, 14 శతాబ్దాల ఇస్లాం చరిత్రనూ కలిపి చూస్తే, ఇదేమంత కంగారు పడాల్సిన అంశం కాదని తెలిసిపోతుంది.
    "ఖురాన్ సందేశం - ప్రవక్త ఆచరణ " ఇదే ప్రస్తుతం ముస్లింలు ఒడిసిపట్టాల్సింది.

    ఇక ఫైనల్ గా ముస్లింలు ఎవరికి ఓటేయాలంటే - బీజేపీని ఓడించే సత్తా ఉన్న పార్టికి. దానితో పొత్తు పెట్టుకోని పార్టికి. కనీసం దానితో ఎదురుగా నిలబడి పోరాడే పార్టీకి. అదేదో తేలనంతవరకూ వేచి ఉండటమే.

    అల్లా మనకు ఇహ పర లోకాలలో బర్కత్ ప్రసాదించు గాక. ఆమీన్.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

*జిల్లాల్లోని ప్రధాన సమస్యల్ని పోస్టు చేయండి*

Crusades - 1095–1291

Telangana State Backward Classes List