Muslim programme to confront the ‘Neo Manuism’
Muslim programme to confront the ‘Neo Manuism’ నయా మనువాదాన్ని ఎదుర్కోవడానికి ముస్లిం కార్యక్రమం - డానీ 1. మనదేశంలో నయా మనువాద నియంతృత్వం రాజ్యం చేస్తున్నదని ఇప్పుడు ఎక్కువ మంది గుర్తిస్తున్నారు . దేశవ్యాప్తంగా అనేకానేక నిస్సహాయ (vulnerable) సమూహాలు చాలాకాలంగా దీని ఉక్కుపాదాల కింద నలిగిపోతున్నాయి . 2. సాంస్కృతిక జాతీయవాదానికి తొలి బాధితులు మతఅల్పసంఖ్యాకవర్గాలు . ఆ బాధితుల్లోకెల్లా బాధితులు ముస్లింలు . 3. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో భారత రాజకీయార్థికరంగాల్లో భౌగోళిక జాతీయవాదం బలంగానూ సాంస్కృతిక జాతీయవాదం బలహీనంగానూ వుండేవి . కులమతాలు పౌరుల వ్యక్తిగత (ప్రైవేటు) వ్యవహారంగా వుండేవి . 4. దేశప్రజలకు లౌకిక రాజ్యాంగం ఒక కొత్త మార్...