ఒక మహా ప్రజాఉద్యమం మాత్రమే విశాఖ ఉక్కును రక్షించుకోగలదు!.
ఒక మహా ప్రజాఉద్యమం మాత్రమే విశాఖ ఉక్కును రక్షించుకోగలదు!. ఉక్కు ఉద్యమానికి MTF సంఘీభావం 20-02-21 శనివారం – విశాఖపట్నం 21-02-21 ఆదివారం – కాకినాడ 22-02-21 సోమవారం - విశాఖపట్నం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోరాడి సాధించుకున్న ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు. భారత దేశంలో తీరప్రాంతంలో వున్న ఏకైక స్టీలు ఫ్యాక్టరీ ఇది. 64 గ్రామాల ప్రజలు 33 వేల ఎకరాల భూములిస్తే పుట్టిన ప్రాజెక్టు ఇది. ఫ్యాక్టరీ శంఖుస్థాపన జరగడానికి ముందే దాన్ని పోరుగు రాష్ట్రం తమిళనాడుకు హైజాక్ చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ కుట్రను వ్యతిరేకిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1966లో పెద్ద ఉద్యమం సాగింది. విశాఖపట్నం, గుంటూరు, వరంగల్, హైదరాబాద్ విద్యార్ధులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన సాగించారు. విశాఖకు చెందిన తెన్నేటి విశ్వనాధం ఉద్యమానికి నాయకత్వం వహించారు. గుంటూరుకు చెందిన టి. అమృతరావు ఆమరణ నిరాహార దీక్ష సాగించారు. ఆనాడు ఏపీలో వున్న రాజకీయ పార్టీలన్నీ ఉద్యమానికి మద్దతు పలికాయి. ఉద్యమంలో విశాఖపట్నానికి చెందిన 12 మంది చనిపోయారు. ఇతర జిల్లాల్లో ఇంకో 20 మంది చనిపోయారు. ప్రాణ త...