ముస్లింల కోసం అందరూ; అందరి కోసం ముస్లింలు.
దేశవ్యాప్త రైతుల ఆందోళనకు ముస్లిం ఆలోచనాపరుల వేదిక ( MTF) సంపూర్ణ సంఘీభావాన్ని తెలుపుతోంది. ముస్లింల కోసం అందరూ; అందరి కోసం ముస్లింలు. ఆలోచనాపరుల వేదిక ( MTF) సభ్యులూ కో-కన్వీనర్లకు. అస్సలాము అలైకుమ్, మిత్రులారా! కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ముస్లింలను వేధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నది. కార్పొరేట్ల ఊడిగం చేయడానికి మైనారిటీలు మాత్రమేగాక కార్మికులు, కర్షకులు. సామ్యవాదుల్ని సహితం ఈ ప్రభుత్వం అణిచివేస్తున్నది. ఈ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జిల్లా స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు జరిగే ప్రతి ఉద్యమంలోనూ ముస్లింలు చురుగ్గా పాల్గొనాలి. వీలున్న చోట్ల నాయకత్వాన్ని చేపట్టడానికి చొరవను ప్రదర్శించాలి. ముస్లింలు అందరి కోసం నిలబడ్డప్పుడు మాత్రమే అందరూ ముస్లింల కోసం నిలబడతారు. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ నిరంతరం గుర్తు పెట్టుకోవాలి. ఖాలీదా పర్వీన్, ఉమర్ ఫారూఖ్ ఖాన్, జహా ఆరా, ఫయాజ్ ఆలీ, హసన్ షరీఫ్ తదితర MTF కో-కన్వీనర్లు నిరంతరం ప్రజల్లో పనిచేస్తున్నారు. వీళ్ళు సహజ నాయకులు. ...