Next Target AP Muslim Educational Society
విజయవాడ 30 జులై 2019 మిత్రులారా ! MTF స్వీయ సమాజానికి దిశానిర్దేశం చేసే మేధోసరోవరంగా వుంటూ క్షేత్రస్థాయిలో కార్యచరణ సంఘాలను ఏర్పాటుకు కృషి చేయాలని మన జూన్ 15 నాటి విస్తృత కార్యవర్గంలో తీర్మానం చేసుకున్నాము. నిన్న విజయవాడలో జరిగిన ముస్లిం సంకల్ప సభ నిర్వహణ భారాన్ని Muslim JAC కన్వీనర్ షేక్ మునీర్ అహ్మద్ మరికొందరు భరించగా, MTF మేధోసరోవరంగా పనిచేసింది. ఈ సభలోనే ఏపి వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కమిటి (APWPPC) ఆవిర్భవించింది. దీనితో MTF లక్ష్యాల్లో ఒకటి నెరవేరింది. ఇక మన తదుపరి లక్ష్యం విద్యారంగం. AP Muslim Educational Societyని ఏర్పాటు చేయాలి. రెండు మూడు నెలల్లో మరో ముస్లిం సంకల్ప సభను నిర్వహించి AP Muslim Educational Society ఏర్పాటు చేయాలి. ఇలాంటి సభలకు రూ. 40 వేల నుండి రూ. 50 వేల వరకు ఖర్చు అవుతుంది. భరించ గలిగే జిల్లా యూనిట్ ఏదైనా వుందా? లేకుంటే దాన్ని కూడా విజయవాడలోనే జరపాల్సి వుంటుంది. అందరూ స్పందించండి. మీ డానీ