Discussion on Election Stand 27-10-2018
Discussion on Election Stand 27-10-2018 రాష్ట్ర స్థాయిలో చూస్తే మనకు పరిష్కారం కనిపించదు. జాతీయ స్థాయి నుండి పరికిస్తే పరిష్కారం కనిపిస్తుంది. ఎలుకను పట్టుకునే పిల్లి నల్లదయితే మనకేమిటీ? తెల్లదయితే మనకేమిటీ? సంఘపరివారపు పాలన పోవాలి. అందరూ చెడ్దవాళ్ళే. కానీ అందర్నీ వదిలేద్దాం అంటే మనం అసలు రంగంలోనే వుండం. చెడ్దవాళ్లలో తక్కువ చెడ్డవాళ్లను పట్టుకుని వీలయిన మేర మన ప్రయోజనాలను నెరవేర్చుకోవాలి. ఓట్ల నమోదు అక్టోబరు 31తో ముగుస్తుంది. ఆ తరువాత కుడా ఒక పధ్ధతిలో నమోదు చేసుకోవచ్చు. మన అవసరం వున్నవాళ్ళతో మన అవసరాలు తీర్చుకోవడం తెలివి. కొత్త సిబిఐ డైరెక్టర్ నాగేశ్వర రావు RSS ప్రచారక్. రాం మాధవ్ కు అత్యంత సన్నిహితుడు. సంఘపరివారం మన శత్రువు. దానినే టార్గెట్ చేయాలి. అది హిందూ సామాన్యులకు కుడా శత్రువే. అది ఐక్య సంఘటనకు వుపయోగపడే అంశం. కాంగ్రెస్ మంచిదయినా చెడ్దదయినా, రాహుల్ గాంధి తెలివైనవాడయినా కాకపోయినా. మనం కాంగ్రెస్ ను సమర్ధించక తప్పదు. అంతకన్నా ముఖ్యమైన ప్రశ్న ఏమంటే ముస్లింలు ఈ ఎన్నికల్లో క్రియాశీలంగా వుండాలా? లేకుంటే ఎన్నికలకు దూరంగా వుండాలా? అనేది...