General Muslim Voting Trends


General Muslim Voting Trends  
31 August 2018

మిత్రులారా !

ముస్లిం ఓటర్లు 2014 ఎన్నికల్లో 60 శాతం YCPకి, 30 శాతం TDP కి 10 శాతం కాంగ్రెస్ కు వేశారని ఒక సర్వే అంచనా.

ప్రస్తుతం జగన్ ఓటింగ్ కొంత తగ్గి TDP  ఓటింగ్ కొంత పెరిగినట్టు కనిపిస్తోంది. రాయలసీమ ముస్లింలలో అత్యధికులు జగన్ పక్షాన వున్నారనిపిస్తోంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ముస్లింలు కొంత TDPవైపు మొగ్గు చూపుతున్నారనిపిస్తోంది. తనకు మంత్రి పదవి ఇస్తున్నారన్న ఉత్సాహంతో MLC  MA Sahrief అనేక పట్టణాలు తిరిగి ముస్లింలను TDP  వైపుకు మళ్ళించేందుకు చేసిన ప్రయత్నాలు కొంత వరకు పని చేసినట్టున్నాయి. అయినప్పటికీ టోటల్ సన్నివేశాన్ని గమనిస్తే మెజారిటీ మైనారిటీలు ఇప్పటికీ YCP  పక్షాన్నే వున్నట్టు వాతావరణం సూచిస్తోంది. గుంటూరు నారా హమారా టిడిపి హమారా సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన 30 వరాల్లో ఏ ఒక్కటీ ముస్లింలను ఉత్సాహ పరిచేలా కనిపించడం లేదు.  

మిత్రులారా !
మనం ఇప్పటి వరకు జగన్ పక్షమూ కాదు; చంద్రబాబు పక్షమూ కాదు. వాళ్ళిద్దరి మధ్య ఒక పోటీ పెట్టి వచ్చే ఎన్నికల్లో ముస్లిం ఓట్లకు ఒక గుర్తింపును సాధించి, మన సమాజానికి ఎక్కువ మేలు జరిగేలా  ఎక్కువ రాయితీలు సాధించడమే మన లక్ష్యం. ఇప్పటికి ఇదే మన విధానం.  ఎన్నికల ముందు రాజకీయ సమీకరణలు అనూహ్యంగా మారవచ్చు. అప్పుడు పరిస్థితిని అంచనా వేసి ఒక నిర్ణయం తీసుకుందాము.

Please discuss extensively on this topic to facilitate the making of a policy on elections.

Comments

Popular posts from this blog

MTF - Charter Of Demands for Elections - 2019

*జిల్లాల్లోని ప్రధాన సమస్యల్ని పోస్టు చేయండి*

Crusades - 1095–1291